ETV Bharat / entertainment

దీపికా పదుకొణె చేసిన పనికి హోరెత్తుతున్న సోషల్ మీడియా - కామెంట్ల మోత మోగిస్తున్న నెటిజన్లు! - Deepika Padukone Sold Yellow Dress - DEEPIKA PADUKONE SOLD YELLOW DRESS

Deepika Padukone: బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ దీపికా పదుకొణె త్వరలోనే తల్లి కానున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దీపికా చేసిన పనికి నెటిజన్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Deepika Padukone
Deepika Padukone Sold Yellow Dress (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 31, 2024, 2:36 PM IST

Bollywood Heroine Deepika Padukone Yellow Dress: బాలీవుడ్ టాప్​ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆన్​ స్క్రీన్​ తనదైన నటనతో అలరించే ఈ బ్యూటీ.. ఆఫ్​ స్క్రీన్​లోనూ తనదైన వ్యక్తిత్వం ఆకట్టుకుంటూ ఉంటారు. తాజాగా ఈమె చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

దీపికా పదుకొణే సినిమాల్లో నటించడంతోపాటు బిజినెస్​ రంగంలోకి కూడా ప్రవేశించింది. సొంతంగా ఫ్యాషన్​ బిజినెస్​ రన్​ చేస్తోంది. తాజాగా తన సొంత ఫ్యాషన్‌ బిజినెస్ "82 ఈస్ట్‌ ఆఫ్‌లైన్‌ స్టోర్‌"లో షేర్ చేసిన కొన్ని ఫొటోల్లో దీపిక ఎల్లో కలర్ గౌన్​లో ఎంతో అందంగా మెరిసిపోయింది. ఫ్యాషన్ ప్రియులు కూడా దీపిక డ్రెస్​ను తెగ మెచ్చుకున్నారు. అయితే.. ఆ డ్రెస్​ను అమ్మేసిందీ బాలీవుడ్ నటి. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ డ్రెస్​ అమ్మకానికి ఉందని చెబుతూ ఒక ఫోటోను పంచుకుంది దీపిక. ఆ ఫోటో షేర్ చేసిన నిమిషాల్లోనే అమ్ముడుపోయింది.

20 నిమిషాల్లోనే: ఫొటో పోస్ట్​ చేసిన 20 నిమిషాల్లోనే ఎల్లో గౌన్​ 34 వేల రూపాయలకు అమ్ముడుపోయింది. దీంతో దీపిక వెంటనే ఎల్లో గౌన్ డ్రెస్ సోల్డ్ ఔట్ అని మరో ఫొటో షేర్ చేసింది. అయితే.. ఈ డ్రెస్ అమ్మగా వచ్చిన రూ.34,000 నగదును సామాజిక సేవ కార్యక్రమాల కోసం వినియోగించనుంది దీపిక. "ద లైవ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌" పేరుతో నిర్వహిస్తోన్న చారిటీ సంస్థకు ఈ నగదును అంజేయనున్నారు ఈ అందాల తార. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు దీపికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీపికలాగే ఆమె ఆలోచనలు కూడా చాలా అందంగా ఉన్నాయంటున్నారు. మీరు చాలా గ్రేట్ మేడమ్ అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

దీపికకు అరుదైన గౌరవం- తొలి భారతీయ నటిగా రికార్డ్! - Deepika Padukone

కల్కితో అభిమానుల ముందుకు: ప్రెగ్నెన్సీ కారణంగా దీపికా పదుకొణె ప్రస్తుతానికి సినిమా నుంచి విరామం తీసుకుంది. అయితే.. దీపిక నటించిన మొదటి తెలుగు సినిమా ‘కల్కి 2898 ఏడీ చిత్రం రిలీజ్​కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ప్రభాస్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుందీ అందాల తార. జూన్ 27న సినిమా విడుదల కానుంది. దీంతో పాటు ‘సింగం అగైన్’ సినిమాలో కూడా దీపికా పదుకొణే ఓ ముఖ్య పాత్రలో నటించింది.

దీపికా పదుకొణె, సమంత అరుదైన ఘనత - దశాబ్దకాలంలో వీరే టాప్​!

'ఆ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు - దానికి అతడే కారణం' - Deepika Padukone Remuneration

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.