Tollywood Upcoming Pan India Moives: పాన్ఇండియా ట్రెండ్ వల్ల సౌత్ఇండియా సినిమాలకు బాలీవుడ్లో ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్లు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌కు అక్కడ మార్కెట్ భారీగా పెరిగిపోయింది. అయితే పఠాన్, జవాన్, యానిమల్ మినహా కొంతకాలంగా బీటౌన్ స్టార్ హీరోల సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వకపోవడం వల్ల బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెరుపులు కరవయ్యాయి.
ఇక టాలీవుడ్ నుంచి భారీ బడ్జెట్ సినిమాలు కల్కి AD, దేవర పార్ట్- 1, గేమ్ ఛేంజర్, పుష్ప- 2 రానున్న ఆరు నెలల్లో రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. 'బాహుబలి'తో ప్రభాస్, రాజమౌళి సూపర్ హిట్ మూవీ 'ఆర్ఆర్ఆర్'తో రామ్‌చరణ్, ఎన్టీఆర్, 'పుష్ప'తో అల్లు అర్జున్ అక్కడ విపరీతమైన క్రేజ్ సంపాదించారు. దీంతో బాలీవుడ్ వ్యాపార వర్గాలు ఈ సినిమాలపై ఆశలు భారీగానే పెంచుకున్నాయి. మన హీరోల సినిమాలే మళ్లీ బాలీవుడ్లో థియేటర్లని కళకళలాడిస్తాయనే ఓ నమ్మకం అక్కడ కనిపిస్తోంది.
ఈ క్రమంలో జూన్ 27న రిలీజ్ కానున్న 'కల్కి'కి భారీ ఓపెనింగ్స్ లభించే ఛాన్స్ ఉంది. ఇక పుష్ప (ఆగస్టు 15), దేవర (అక్టోబర్ 10) కూడా రీలీజ్ డేట్లు కన్ఫార్మ్ అయ్యాయి. రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ విడుదల తేదీ ఖరారు కాకపోయినా ఈ ఏడాదే వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. అంటే జూన్ నుంచి ప్రతి రెండు నెలలకొకసారి బీటౌన్ బాక్సీఫీస్ వద్ద టాలీవుడ్ హీరోల సందడి ఉండనుంది. దీంతో 2024 సెకండ్ హాఫ్‌లో బీ టౌన్ బాక్సాఫీస్ చూపు టాలీవుడ్ హీరోలపైకి మళ్లింది.
వీళ్ల క్రేజ్ వేరేలెవెల్: పాన్ ఇండియా ట్రెండ్ రాక ముందే కోలీవుడ్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ హిందీలో సత్తా చాటారు. దీంతో వీరి సినిమాలపై కూడా బీ టౌన్ ఫోకస్ ఉంది. కమల్ నటించిన ‘ఇండియన్ 2’, రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ సినిమాలు కూడా ఈ ద్వితీయార్ధంలోనే విడుదలవుతున్నాయి. తమిళంలో పాన్ ఇండియా సినిమాలు చాలానే రూపొందుతున్నాయి. సూర్య కథానాయకుడిగా నటించిన ‘కంగువా’, విజయ్ ‘గోట్’, విక్రమ్ ‘తంగలాన్’ చిత్రాలు రానున్న నెలల్లో విడుదల కానున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'కల్కి' రూమర్స్‌కు చెక్- రిలీజ్‌పై క్లారిటీ ఇవ్వనున్న మూవీటీమ్! - Kalki 2898 Ad Release
తెలుగు భామల చూపు బాలీవుడ్ వైపు- అందరి చేతిలో భారీ ప్రాజెక్ట్‌లే! - Telugu Heroines Bollywood Movies