Kangana Ranaut Marriege: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' మరో ఐదు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో కంగనా సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. రోజూ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న కంగనా ఆయా ప్రశ్నలకు సమాధానమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఇంకా పెళ్లి చేసుకోకపోవడంపై స్పందించారు. నెగిటివ్ పబ్లిసిటీ కారణంగానే తాను పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగానే 'నటుడు లేదా రాజకీయ నాయకుడు. ఎవరిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు?' అనే ప్రశ్నకు ఆమె ఇంట్రెస్టింగ్గా జవాబిచ్చారు. ఆమెకు పెళ్లిపై ఎలాంటి ద్వేషం లేదని చెప్పిన కంగనా, లైఫ్‌లో పార్ట్నర్ ఉండాలని అన్నారు. 'ఇప్పుడు దీని గురించి నేనేం చెప్పగలను? పెళ్లిపై నాకు మంచి అభిప్రాయమే ఉంది. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక భాగస్వామి ఉండాలి. అలాగే పిల్లలు కూడా ఉండాలి. నాపై ఎంతో నెగిటివ్ పబ్లిసిటీ జరిగింది. దాని వల్ల నేను అపఖ్యాతి పాలయ్యాను. అందుకే వివాహం చేసుకోలేకపోతున్నా. నాపై చాలా కోర్టు కేసులు ఉన్నాయి. పెళ్లి అయ్యాక నాకు ఏమైనా కోర్టు నోటీసులు వస్తే, అది చూసి మా అత్తమామలు పారిపోతారు. ఇదీ ఒక సైడ్ ఎఫెక్ట్ లాంటిదే' అని కంగనా సరదాగా జవాబిచ్చారు.
కాగా, ఎమర్జెన్సీ సినిమా కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను ఈ సినిమాలో చూపించనున్నారు. ఇందులో నటి కంగన ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రంలో జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో స్టార్ నటుడు అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. నటి మహిమా చౌదరి కీలక పాత్ర పోషించారు. ఇక జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా సెప్టెంబర్ 6న రిలీజ్ కానుంది.
'ఎమర్జెన్సీ' ట్రైలర్ రిలీజ్- పవర్ఫుల్ ఉమెన్‌గా కంగనా రనౌత్! - Kangana Ranaut Emergency
కంగనా మూవీ మరోసారి పోస్ట్‌పోన్ - కారణం ఏంటంటే? - Emergeny Movie