Bigg Boss 8 Telugu Winner : బిగ్‌బాస్ తెలుగు సీజన్- 8లో నిఖిల్ విజేతగా నిలిచారు. గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా హాజరైన గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, నిఖిల్‌ను విజేతగా ప్రకటించారు. విజేతగా నిలిచిన కంటెస్టెంట్‌కు రూ. 55 లక్షలు ప్రైజ్ మనీ దక్కింది. అలాగే మారుతి కార్ కూడా దక్కించుకున్నారు. ఇక గౌతమ్ రన్నరప్‌గా నిలిచారు.
కాగా, ఈ షోలో మొత్తం 22 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా, వారిలో ఐదుగురు ఫైనల్‌కు చేరుకున్నారు. అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ గ్రాండ్ ఫినాలేకు అర్హత సాధించారు.