Bigg Boss Telugu 8 Grand Finale: ప్రముఖ రియాల్టీ షో.. బిగ్‌బాస్ సీజన్-8కు నేడు శుభం కార్డ్ పడబోతోంది. ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, టర్న్‌లు, ట్విస్ట్‌లకు లిమిటే లేదు అంటూ మొదలైన ఈ సీజన్ నేటితో ముగియనుంది. అయితే, ఫైనల్ ఎపిసోడ్‌కి సంబంధించి ఇప్పటికే షూటింగ్ జరుగుతోంది. అలాగే తాజాగా ప్రోమో కూడా విడుదలైంది. ఇక ప్రేక్షకులను అలరించడానికి సీజన్-8 ఫినాలే ఎపిసోడ్‌కి పలువురు సెలబ్రిటీలు వచ్చి సందడి చేయనున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
హీరోయిన్ లక్ష్మీరాయ్, నభా నటేష్ సందడి.. ఈ రోజున జరగబోయే గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సందడి చేశారు. ఆయన తన కొత్త సినిమా "యూఐ" ప్రమోషన్స్‌లో భాగంగా టీమ్‌తో వచ్చి సందడి చేశారు. అలాగే హౌజ్‌లోకి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే హీరోయిన్ లక్ష్మీరాయ్, నభా నటేష్ మంచి మాస్ సాంగ్స్‌కి స్టెప్పులేశారు. ‘అఖండ’ ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ కూడా గ్రాండ్ ఫినాలేలో సందడి చేశారు. అంతేకాకుండా హౌజ్‌లోకి వెళ్లి కంటెస్టెంట్స్‌తో కాసేపు ఆటలాడించారు. అలాగే బాలకృష్ణ కొత్త మూవీ టీమ్ "డాకు మహారాజ్" రాబోతోందట. అయితే, దర్శకుడు బాబీ కొల్లితో పాటు మూవీ టీమ్ తరఫున ఎవరొస్తారనేది వేచి చూడాలి.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. ఇక ఇటీవలే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన పుష్ప మూవీ టీమ్ కూడా గ్రాండ్ ఫినాలేకి వస్తున్నారట. దర్శకుడు సుకుమార్‌తో పాటు.. హీరోయిన్ రష్మిక మందన స్టేజ్ పైకి వచ్చే అవకాశం ఉందని జోరుగా చర్చ జరుగుతోంది. ఇక మెగా హీరో సాయి దుర్గ తేజ్ కూడా గ్రాండ్ ఫినాలేకి వస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తన కొత్త మూవీ 'సంబరాల ఏటిగట్టు' సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన స్టేజీ మీదకు వస్తున్నారట.
అలాగే, ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కి తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా వస్తున్నట్లు సమాచారం. విజయ్ తన కొత్త సినిమా విడుదల-2 ప్రమోషన్ల కోసం వస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి తమిళ బిగ్ బాస్ సీజన్-8 కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
చీఫ్ గెస్ట్‌గా ఎవరు: నేడు జరగబోయే గ్రాండ్ ఫినాలేకి చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్ రాబోతున్నారని గత రెండు మూడు రోజుల నుంచి టాక్ నడిచింది. కానీ, అవన్నీ రూమర్స్ మాత్రమేనని సమాచారం. అయితే తాజాగా ఫినాలే చీఫ్ గెస్ట్‌గా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ రాబోతున్నారని మరో వార్త వైరల్ అవుతోంది. కానీ, దీనిపై కూడా పూర్తిగా క్లారిటీ లేదు.
300 మందితో బందోబస్తు: బిగ్‌బాస్ సీజన్ 8 ముగింపు నేపథ్యంలో 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత సీజన్లో డిసెంబరు 17న బిగ్‌బాస్-7 విజేతగా పల్లవి ప్రశాంత్‌ను ప్రకటించిన తర్వాత అభిమానుల అత్యుత్సాహంతో పరిస్థితి అదుపు తప్పి 7 ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈసారి పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బిగ్‌బాస్ సెట్ చుట్టూ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.
బిగ్‌బాస్ 8: ముగిసిన ఓటింగ్ - ఆ ఇద్దరి మధ్యనే టైటిల్ వార్!