ETV Bharat / entertainment

"బిగ్‌బాస్‌కి రావడమే నేను చేసిన.." - హౌజ్​లో బరస్ట్​ అయిన విష్ణుప్రియ - ఏం జరిగిందో తెలుసా? - Bigg Boss 8 Telugu Updates - BIGG BOSS 8 TELUGU UPDATES

Bigg Boss 8: బిగ్​బాస్​లో కిక్​ ఇచ్చే ఎపిసోడ్​ అంటే నామినేషన్స్​.. ఆ తర్వాత టాస్కులు. తాజాగా ఈ సీజన్​లో టాస్కులు మొదలుపెట్టారు బిగ్​బాస్​. అయితే.. టాస్క్​ల పేరుతో ఓ టీమ్​నే టార్చర్​ చేశారు మరో టీమ్​ సభ్యులు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Bigg Boss 8
Bigg Boss 8 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2024, 10:39 AM IST

Bigg Boss 8 Telugu Updates: బిగ్​బాస్ అంటేనే గొడవలు, కొట్లాటలు, కాంట్రవర్సీలు. కోరుకున్నోడికి కోరుకున్నంతా అన్నట్టుగా ఈసారి బిగ్ బాస్ అన్​ లిమిటెడ్ అంటూ మొదలుపెట్టారు. ప్రైజ్ మనీ మీద కూడా బిగ్​బాస్​ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ప్రతి కంటెస్టెంట్ ' తగ్గేదేలే' అన్నట్టు వ్యవహరిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా రెచ్చిపోతున్నారు. అవసరమున్నా.. లేకున్నా నోరు పారేసుకుంటున్నారు. తాజాగా.. బిగ్‌బాస్ హౌస్‌లో టాస్కులు మొదలయ్యాయి. ఈ టాస్క్​ల్లో ఓ టీమ్​ మెంబర్స్​కి మరో టీమ్​మేట్స్​ చుక్కలు చూపించారు. దీంతో బిగ్​బాస్​కు అనవసరంగా వచ్చా అంటూ బరస్ట్​ అయ్యింది విష్ణుప్రియ. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ముగ్గురు చీఫ్​లలో ఇద్దరు చీఫ్​ల మధ్య టాస్కులు పెట్టారు బిగ్​బాస్​. ఏ చీఫ్​ కంటెస్టెంట్స్​ స్ట్రాంగో తెలుసుకునేందుకు టాస్క్​లు మొదలుపెట్టారు. నైనిక-యష్మీ టీమ్‌కి మొదట పెట్టిన 'బాల్ పట్టు ​గోల్ కొట్టు' గేమ్‌లో యష్మీ టీమ్ గెలిచింది. ఇక సెకండ్ ఛాలెంజ్‌గా 'లూప్ ది హోప్స్' అనే గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా అటు వైపు ఉన్న రింగ్స్‌ని కంటెస్టెంట్లు చైన్ బ్రేక్ చేయకుండా బాడీ మీదుగా తెచ్చి ఇటు వైపు వేయాలి. ఎవరు మొదటిగా రింగ్స్ అన్నీ కంప్లీట్ చేస్తారో వాళ్లు విన్. ఈ గేమ్‌లో నైనిక టీమ్ అదరగొట్టింది.

ఇక విన్నర్ ఎవరో తేల్చే మూడో గేమ్ కూడా వెంటనే మొదలైంది. 'బ్రిక్ బ్యాలెన్సింగ్' అంటూ పెట్టిన ఈ గేమ్‌ ప్రకారం బజర్ మోగే లోపు ఏ టీమ్ అయితే తమకిచ్చిన స్టాండ్‌పై ఐదు బ్రిక్స్ నిటారుగా నిలబెడుతుందో.. లేదా వేరే టీమ్​ కంటే ఏ టీమ్​ వాళ్లు ఎక్కువ బ్రిక్స్​ పెడతారో వాళ్లు విన్. ఈ గేమ్‌లో నైనిక టీమ్ గెలుస్తుందని తెలిసి యష్మీ టీమ్‌లో ఉన్న పృథ్వీ.. వాళ్ల స్టాండ్‌ను తోసి ఇటుకలు కిందపడేశాడు. ఇదేంటి ఫౌల్ గేమ్ అంటూ నైనిక టీమ్ ప్రశ్నించినా సంచాలక్​గా ఉన్న నిఖిల్ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అదే పని నైనిక టీమ్ కూడా చేసింది. ఇలా రెండు టీమ్‌లు కాసేపు ఒకరిది ఒకరు తోసేసుకున్న తర్వాత ఇక నుంచి ఫౌల్ ప్లే లేదు నిజాయతీగా ఆడండి అని నిఖిల్ అన్నాడు. అయితే అప్పటికే యష్మీ టీమ్ రెండు బ్రిక్స్ పెట్టేసి గేమ్​ గెలిచింది.

బిగ్​బాస్​ 8: కొంత గోల - కొన్ని కన్నీళ్లు - ఫస్ట్​ వీక్​ నామినేట్ అయింది వీళ్లే!

నరకం స్పెల్లింగ్​ రాయించిన యష్మీ టీమ్​: ఇక రెండు గేమ్స్ గెలిచినందుకు యష్మీ టీమ్‌ను విన్నర్‌గా ప్రకటించాడు బిగ్‌బాస్. అంతేకాకుండా గెలిచిన యష్మీ వాళ్లకి డ్రాగన్ ఫ్లై రూమ్ కేటాయించాడు. ఇక మిగిలిన రెండూ టీమ్‌లకి జీబ్రా, పీకాక్ రూమ్‌లను కేటాయించాడు. ఇక కాసేపటికి ముగ్గురు చీఫ్‌లు నైనిక, యష్మీ, నిఖిల్‌లను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచాడు బిగ్‌బాస్. ఇక్కడ ఓ ఆఫర్ కూడా ఇచ్చాడు యష్మీ టీమ్‌కి. యష్మీ టీమ్ విన్ అయింది కాబట్టి వాళ్ల సభ్యులు ఎవరూ ఇంటిపనులు చేయాల్సిన పని లేదని.. అంతేకాకుండా ఇతర టీమ్‌ల సభ్యులకి ఎవరికైనా ఏ పని అయినా చెప్పొచ్చు అంటూ ఫుల్ పవర్ యష్మీకి ఇచ్చాడు. దీంతో యష్మీ.. నిఖిల్ టీమ్‌కి కేవలం కుకింగ్ ఇచ్చి.. గిన్నెలు తోమడం, ఇల్లు, గార్డెన్, రూమ్స్, బాత్రూమ్స్ క్లీన్ చేయడం ఇలా మొత్తం పనులన్నీ నైనిక టీమ్‌కే ఇచ్చేసింది యష్మీ.

ఇక కన్ఫెషన్ రూమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత యష్మీ తన టీమ్ సభ్యులకి జరిగింది చెప్పింది. ఇక్కడే యష్మీ టీమ్​ సభ్యులు నైనిక టీమ్​ సభ్యులకు నరకం చూపించారు. కిచెన్‌లోకి వెళ్లి డ్రింక్స్ తాగడానికి గ్లాసులు అన్నీ తీసి సగం తాగేసి క్లీన్ చేసుకోండి అంటూ అక్కడ పడేశారు. చెత్త బుట్టలో ఉన్న చెత్త కూడా కిచెన్ పైన పెట్టి సైలెంట్‌గా పక్కకెళ్లిపోయారు. ఇదంతా చూసి నైనిక ఓ డైలాగ్​ చెప్పింది. "గెలవకపోయినా సరే యష్మీని చీఫ్‌గా చేశాం కదా నాకు సిగ్గుండాలి" అంటూ తనని తానే తిట్టుకుంది నైనిక.

రాంగ్​ డెసిషన్​: ఇక యష్మీ టీమ్ చేస్తున్న ఓవరాక్షన్ చూసి విష్ణుప్రియకి ఫైర్​ అయ్యింది. "అసలు ఇదెక్కడి న్యాయం. 10 మంది చేసే పనంతా మమ్మల్ని చేయండి అంటూ ఆర్డర్లు వేయడమేంటి.. బిగ్‌బాస్‌కి వచ్చింది పనులు చేయడానికా" అంటూ ప్రశ్నించింది. "ఏదో టైటిల్ గెలిచేద్దామనే ఫైర్‌తో లోపలికి వచ్చాను.. వీళ్ల వల్ల ఫైర్ అంతా ఆరిపోయింది. నేను అయితే ఒక్క పని కూడా చేయను.. నాగార్జున సార్ అడిగితే చెబుతా.. నేను ఏదో పర్సనాలిటీ డెవలెప్‌మెంట్ అనుకొని హౌస్‌లోకి వచ్చా కానీ ఇలా క్లీనింగ్ డెవలప్‌మెంట్ అవుతుందని అనుకోలేదు. బిగ్‌బాస్‌కి రావడం రాంగ్ డెసిషన్" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది విష్ణు.

బిగ్​బాస్​​ 8: తొలిరోజే కంటెస్టెంట్స్​ మధ్య వార్​ - కెప్టెన్​ ప్లేస్​లో ముగ్గురు చీఫ్​లు! డే 1 హైలెట్స్​ ఇవే!

బిగ్​బాస్​ 8: తొలిరోజే మొదలైన రచ్చ - సోనియా వర్సెస్​ శేఖర్​ బాషా! ప్రోమో చూసేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.