ETV Bharat / entertainment

మరో షాకిచ్చిన నాగ మణికంఠ - భార్య కంటే ఎన్నేళ్లు చిన్నోడో తెలుసా? - BIGG BOSS 8 TELUGU NAGA MANIKANTA

-వైల్డ్​కార్డ్​ ఎంట్రీలకు లెటర్​లో మేటర్​ చెప్పి​ ట్విస్ట్​ -మణికంఠ డైలాగ్స్​కు అవాక్కైన కంటెస్టెంట్లు

Naga Manikanta
Bigg Boss 8 Telugu Naga Manikanta (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2024, 1:09 PM IST

Bigg Boss 8 Telugu Naga Manikanta: "గెలిచి తీరాలి అప్పుడే నా భార్య, నా కూతురు నాకు దక్కుతారు" అంటూ బిగ్‌బాస్ సీజన్ 8 స్టార్ట్​ అయినప్పటి నుంచి చెబుతూనే ఉన్నాడు నాగ మణికంఠ. అంతేకాదు ఇప్పటివరకూ జరిగిన ఆరు వారాల గేమ్‌లో చాలా సందర్భాల్లో "నా భార్య నాకు కావాలి, నా కూతురు నాకు కావాలి" అంటూ ఎమోషనల్ కూడా అయ్యాడు. దీంతో "అసలు వాళ్ల భార్యతో మణికంఠకు ఉన్న గొడవలేంటి? ఆమె కూతురితో పాటు అమెరికాలోనే ఎందుకు ఉంటుంది?" అంటూ ఆడియన్స్ మందిలో చాలానే ప్రశ్నలు మిగిలిపోయాయి. కానీ వీటి గురించి ఇప్పటివరకూ మణికంఠ అయితే క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా ఓ సీక్రెట్‌ను మాత్రం హౌజ్​లో రివీల్ చేశాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

సీజన్​ 8లో వైల్డ్​ కార్డ్​ కంటెస్టెంట్స్​ రాకతో హౌజ్​లో సందడి మొదలైంది. అటు టాస్కుల పరంగా, ఇటు ఎంటర్​టైన్​మెంట్​ పరంగా కంటెస్టెంట్లు ఇరగదీస్తున్నారు. ముఖ్యంగా మొదటి ఐదు వారాల్లో ఎమోషనల్​గా ఉన్న మణికంఠ కూడా వైల్డ్​ కార్డ్స్​ రాకతో ఫుల్​ జోష్​లో ఉన్నాడు. తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలైన గంగవ్వ, అవినాష్, టేస్టీ తేజ, హరితేజలతో.. తన భార్య తనకి పంపిన లెటర్ గురించి మణికంఠ చెప్పాడు. లెటర్‌లో హాయ్ జూనియర్ అంటూ రాసింది అంటూ మణికంఠ చెప్పగానే.. అదేంటి జూనియర్ అని ఎందుకు పిలిచింది అంటూ అందరూ అడిగారు.

దీనికి "అంటే తను నన్ను కన్నా, జూనియర్ అంటుంది.. తన ఫోన్‌లో నా నంబర్‌ను జూనియర్ అని సేవ్ చేసుకుంటుంది" అంటూ మణికంఠ చెప్పాడు. అంటే మీరు ఇద్దరూ సేమ్ కాలేజా.. అంటూ తేజ అడిగాడు. కాదు తనకంటే నేను 3 ఏళ్లు చిన్నోడిని అందుకని అలా జూనియర్ అంటుంది అంటూ షాకిచ్చాడు మణికంఠ. ఇక ఇది విని అవునా అంటూ అందరూ అవాక్కయ్యారు. ముఖ్యంగా గంగవ్వ అయితే "ఎవరికంటే చిన్నోడు వాళ్ల భార్య కంటేనా?" అంటూ నోరెళ్లబెట్టింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నెటిజన్లు అయితే మణికంఠ ఈ సీజన్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తూనే ఉన్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇంతకీ లెటర్​లో ఏముందంటే: ఇక ఇటీవల మణికంఠకి వాళ్ల భార్య రాసిన లెటర్‌లో ఇలానే జూనియర్ అంటూ ఉంది. "హే జూనియర్ కంగ్రాట్యులేషన్స్.. ఈ సీజన్‌లో జైల్లోకి వెళ్లిన ఫస్ట్ పర్సన్ నువ్వే.. గేమ్ చాలా బాగా ఆడుతున్నావ్.. బయట ఏమనుకుంటున్నారో ఆలోచించి హౌజ్​లో డిస్ట్రబ్ అవ్వకు.. మహాభారతంలో అర్జునుడిలా ఉండు.. పక్షి కన్ను మీద మాత్రమే ఫోకస్ చెయ్.. బయట మేమంతా ఉన్నాం నీకు.. ప్లీజ్ ఎమోషనల్ అవ్వకు.. ఇట్లు శ్రీ ప్రియ" అంటూ లెటర్‌లో రాసింది మణికంఠ భార్య. ఈ లెటర్ చదివిన తర్వాత మణికంఠ కాస్త సెటిల్ అయ్యాడు.

బిగ్​ బాస్​లో లవ్​ బర్డ్స్! - వాళ్ల మధ్య లవ్ ట్రాక్ కన్ఫామ్ అంటగా?

"బిగ్‌బాస్‌కి రావడమే నేను చేసిన.." - హౌజ్​లో బరస్ట్​ అయిన విష్ణుప్రియ - ఏం జరిగిందో తెలుసా?

బిగ్​బాస్​ 8 : లవ్​ మ్యాటర్​ రివీల్​ చేసిన ​నబీల్ - పార్ట్​నర్​ ఆమేనటగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.