ETV Bharat / entertainment

బిగ్​బాస్​ 8: డబుల్​ ఎలిమినేషన్​లో బిగ్​​ ట్విస్ట్​ - శనివారం ఆ కంటెస్టెంట్​ అవుట్ - ఫైనల్​కు వెళ్లేదెవరంటే? - BIGG BOSS 8 DOUBLE ELIMINATION

-క్లైమాక్స్​కు వచ్చిన బిగ్​బాస్​ సీజన్​ 8 -డబుల్​ ఎలిమినేషన్​తో మారిన టాప్​ 5 లెక్కలు

Bigg Boss 8 Telugu Double Elimination
Bigg Boss 8 Telugu Double Elimination (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2024, 5:25 PM IST

Bigg Boss 8 Telugu Double Elimination: రసవత్తరంగా సాగుతోన్నబిగ్ బాస్​ సీజన్ 8 క్లైమాక్స్​కు వచ్చింది. ఈ సీజన్​కు సంబంధించి చివరి వారం నామినేషన్స్​ పూర్తయి.. ఓటింగ్​ కూడా ముగిసింది. టికెట్ టు ఫినాలే గెలిచి ఫైనలిస్ట్​ అయిన అవినాష్​ మినహా.. మిగిలిన వారందరూ ఈ వారం నామినేషన్స్​లో ఉన్నారు. అయితే గ్రాండ్ ఫినాలేకి ముందు జరగబోతున్న ఈ ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్‌లు ఉండబోతున్నాయని సమాచారం. ముఖ్యంగా గత వారం మాదిరే ఈ వారం డబుల్​ ఎలిమినేషన్​ ఉంటుందని.. శనివారం ఒకరు, ఆదివారం మరొకరు ఎలిమినేట్​ అయ్యి టాప్​ - 5 కంటెస్టెంట్స్​ ఫినాలేకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వారం డబుల్​ ఎలిమినేషన్​లో ఎవరు ఇంటికి వెళ్తున్నారో.. ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఈ ఐదు రోజులు జరిగిందిదే: గత వారం డబుల్​ ఎలిమినేషన్​లో ఇద్దరు బయటికి వెళ్లగా మిగిలిన ఏడుగురు కంటెస్టెంట్స్‌లో అవినాష్.. టికెట్ టు ఫినాలే గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఇక మిగిలిన ఆరుగురు.. రోహిణి, విష్ణు ప్రియ, ప్రేరణ, నబీల్, నిఖిల్, గౌతమ్ నేరుగా నామినేట్ అయ్యారు. ఇక ఆ తర్వాత హౌజ్​మేట్స్​కు ఓట్​ అప్పీల్​ ఛాన్స్​ ఇచ్చాడు బిగ్​బాస్​. రకరకాల టాస్క్​లు పెట్టగా అందులో గెలిచిన వారికి ఓట్​ అప్పీల్​ అవకాశం లభించింది. అలాగే పలువురు సెలెబ్రిటీలు కూడా హౌజ్​లోకి వచ్చి సందడి చేశారు.

ఓటింగ్​ ఎలా ఉందంటే: ఈ వారం ఆరుగురు నామినేషన్స్​లో ఉండగా.. అన్​అఫీషియల్​ పోలింగ్​లో నిఖిల్, గౌతమ్‌ల మధ్య నువ్వా నేనా అంటూ ఓటింగ్ జరిగింది. దాదాపు 70 పర్సెంట్ ఓటింగ్‌ని వీళ్లిద్దరే షేర్ చేసుకున్నారు. మిగిలిన 30 పర్సంట్ ఓటింగ్‌ని నలుగురు కంటెస్టెంట్స్ షేర్ చేసుకోవడంతో పాయింట్ల తేడాతో.. ఈ నలుగురి మధ్య టఫ్ ఫైట్ నడిచింది. మొదటి రెండు స్థానాల్లో నిఖిల్​, గౌతమ్​ ఉంటే ఆ తర్వాతి స్థానాల్లో వరుసుగా ప్రేరణ, నబీల్​, విష్ణుప్రియ, రోహిణి ఉన్నారు. ముఖ్యంగా రోహిణికి, విష్ణుప్రియకు చాలా తక్కువ వ్యత్యాసంతో ఓటింగ్​ పోల్​ అయినట్లు తెలుస్తోంది.

ఎలిమినేషన్​ ఎవరంటే: గత వారం మాదిరే.. ఈవారం కూడా డబుల్ ఎలిమినేషన్ అని.. ఇప్పటికే శనివారం ఎపిసోడ్​ షూటింగ్​ పూర్తయ్యిందని.. ఈ ఎపిసోడ్​లో సీజన్ 8 శివంగి.. ది స్ట్రాంగ్ ఫీమేల్ కంటెంస్టెంట్ రోహిణి ఎలిమినేట్ అయ్యిందని లీక్​ వచ్చింది. శనివారం నాటి ఎపిసోడ్‌లో రోహిణి ఫస్ట్ ఎలిమినేట్ కాగా.. రెండో ఎలిమినేషన్ ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది.

ఎలిమినేషన్​కు కారణం అదేనా: ఆటపరంగా చూస్తే రోహిణి ది బెస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆమె తొలిసారిగా నామినేషన్స్‌లోకి వచ్చింది. వైల్డ్ కార్డ్ ద్వారా హౌజ్​లోకి వచ్చిన రోహిణి.. ఆరో వారం నుంచి 14వ వారం వరకూ ఒక్కసారి కూడా నామినేషన్స్‌లోకి వచ్చింది లేదు. ఇప్పుడిదే రోహిణి ఎలిమినేషన్‌కి ప్రధానమైన కారణం కాబోతుందని టాక్​ నడుస్తోంది. ఎందుకంటే నామినేషన్స్‌లోకి వెళ్లడం కూడా బిగ్​బాస్​ ఆటలో భాగం. అక్కడికి వెళితేనే ఆడియన్స్​ సపోర్ట్​ ఎంతవరకు ఉన్నదని తెలుస్తుంది.

ఇంకో ఎలిమినేషన్​ ఎవరంటే: అన్​అఫీషియల్​ ఓటింగ్​ ప్రకారం రోహిణి తర్వాత డేంజర్​లో విష్ణుప్రియ, నబీల్​ ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు ఆదివారం ఎపిసోడ్​లో ఎలిమినేట్​ కానున్నారు. నిజానికి విన్నర్​ మెటీరియల్​గా హౌజ్​లోకి అడుగుపెట్టిన విష్ణుప్రియ.. పృథ్వీ వెంట పడి 14వ వారం వరకూ కూడా ఆటే ఆడలేదు. వీకెండ్ పెర్ఫామెన్స్ తప్పితే ఒక్కటంటే ఒక్క వారం కూడా విష్ణు బెస్ట్ అనిపించింది లేదు. దీంతో విష్ణుప్రియకు ఓట్లు రావడం కష్టమైంది. ప్రతిసారి నామినేషన్స్​కు వచ్చినా కేవలం పాయింట్ల తేడాతో సేవ్​ అవుతూ వచ్చింది. ఇక నబీల్​ ఆట చూసుకుంటే వచ్చిన కొత్తలో విన్నర్​ అవుతాడని ప్రేక్షకులు భావించినా.. ఫ్యామిలీ వీక్​ తర్వాత ఆట స్వరూపమే మారిపోయింది. టాస్క్​లు సరిగా ఆడట్లేదని టాక్​. దీంతో వీళ్లిద్దరిలో ఎవరూ ఎలిమినేట్​ అవుతారనేది ఆదివారం వరకు సస్పెన్స్​గానే ఉండనుంది.

"తమ్ముడంటే జెలస్​ - త్వరలోనే స్ట్రెయిట్ తెలుగు సినిమా" - బిగ్​బాస్​లో హీరో సూర్య సందడి!

బిగ్ బాస్ 8: అర్ధరాత్రి గంగవ్వకు గుండెపోటు - తీవ్రంగా భయపడ్డ కంటెస్టెంట్లు - అప్​డేట్​ ఇచ్చిన నిర్వాహకులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.