ETV Bharat / entertainment

బిగ్​బాస్​ 8: తొలిరోజే మొదలైన రచ్చ - సోనియా వర్సెస్​ శేఖర్​ బాషా! ప్రోమో చూసేయండి! - War between sonia and shekar Basha

Bigg Boss 8: బిగ్​బాస్​ ఆట మొదలుపెట్టాడు. తొలిరోజే కంటెస్టెంట్ల మధ్య రచ్చ మొదలైంది. నువ్వా నేనా అంటూ మాటల యుద్ధం చేసుకున్నారు. దానికి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్​ అయ్యింది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Bigg Boss 8 Second Day
War between sonia and shekar Basha (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 2, 2024, 5:08 PM IST

Bigg Boss 8 Second Day: బిగ్ బాస్ ఆట మొదలైపోయింది.. 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్​లోకి ఎంట్రీ ఇచ్చేశారు. గత సీజన్లకంటే భిన్నంగా.. ఈసారి నో కెప్టెన్.. నో రేషన్.. నో ప్రైజ్ మనీ అంటూ ట్విస్ట్ ఇచ్చారు. అంటే రేషన్‌తో పాటు.. ప్రైజ్ మనీని సంపాదించుకుంటేనే వస్తుందని.. అన్ లిమిటెడ్ అంటూ బంపరాఫర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆట మొదలైపోయింది. అంతేనా తొలిరోజే కంటెస్టెంట్ల మధ్య రచ్చ మొదలైంది. అందుకు సంబంధించి ప్రోమో కూడా వచ్చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

బిగ్​బాస్​ గ్రాండ్​ లాంచ్​ ఎపిసోడ్​(సెప్టెంబర్​ 1)లో డైరెక్టర్​ అనిల్​ రావిపూడి వచ్చి ఒకరిని హౌజ్​లో నుంచి బయటికి తీసుకుపోతున్నట్లు చెప్పారు. అయితే ఎవరిని బయటికి పంపించాలనుకుంటున్నారో కంటెస్టెంట్స్​ను ఓట్లు వేయమని చెప్పగా.. ఆదిత్య ఓంతో పాటు.. నైనిక, బేబక్క, విష్ణు ప్రియ, సోనియా వీళ్లంతా.. నాగ మణికంఠను హౌస్‌లో నుంచి పంపించడానికి ఓట్లు వేశారు. దీంతో నాగ మణికంఠ ఎలిమినేట్​ అయినట్లు అనిల్​ రావిపూడి ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు. గేట్​ దగ్గరికి తీసుకుచ్చి.. ఇది ఫేక్​ ఎలిమినేషన్​ అంటూ మళ్లీ ఇంట్లోకి తీసుకొచ్చాడు.

తాజాగా ప్రోమో మొదట్లో.. ఫేక్​ ఎలిమినేషన్​ గురించి నిఖిల్​ అండ్​ నాగమణికంఠ మధ్య జరిగిన డిస్కషన్ చూపించారు.​ దీంట్లో ఆదిత్య ఓంపై ఎటాకింగ్ ప్లే మొదలుపెట్టాడు నాగమణికంఠ. ఆదిత్య ఓం గురించి నిఖిల్, పృథ్వీలతో చెప్తూ ఫైర్ అయ్యాడు. "ఆయన బిహేవియర్‌లో తేడా ఉంది.. మాట్లాడే విధానంలో తేడా ఉంది. నేను అతన్ని లైక్ చేయను" అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు మణికంఠ.

బిగ్​బాస్​​ 8: హౌజ్​లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్​ వీళ్లే - ఈసారి ఒక్కొక్కరు కాదు!

నువ్వా - నేనా: ఇక ఆ తర్వాత రెండో రోజు మార్నింగ్​ ఎప్పటిలానే పాటతో మొదలుపెట్టారు. డ్యాన్సులు, స్విమ్మింగ్ పూల్​లో జలకాలు.. స్టార్ట్ అయిపోయాయి. ఇక ఆ తర్వాత ఇంట్లోని కొందరు కంటెస్టెంట్స్​ ఆరెంజ్‌లతో ఆట ఆడుకుంటున్నారు. దీంతో సోనియా ఆకుల అభ్యంతరం చెప్పింది. ఈ క్రమంలో శేఖర్ బాషా.. బిగ్ బాస్ రూల్స్‌లో ఆరెంజ్‌లతో ఆడకూడదని రాశారా? అని క్వచ్చన్​ రైజ్​ చేశాడు.

దీంతో అదే విషయంపై ఫైర్ అయ్యింది సోనియా. "నీకు ఇచ్చిన వాటితో నువ్వు ఆడుకో.. కిందేసి తొక్కుకో.. డ్రైనేజ్‌లో వేసుకో.. అది మాత్రం వేరే వాళ్లకి పెట్టకు.. మనుషుల్లా తినాలనుకునే వాళ్లకి అవి పెట్టకు" అంటూ కౌంటర్ ఇచ్చింది. దీంతో శేఖర్ బాషా.. ఆ ఆరెంజ్‌లను తింటూ.. "ఆడిన వాటితోనే తిన్నా.. ఇప్పుడు నేను మనిషిని కాదా? పశువునా? అంటూ వార్​ స్టార్ట్ చేశాడు.

ఇక ఆ తరువాత హౌజ్​లో ఉన్న కంటెస్టెంట్స్​ మధ్య టాస్క్​ పెట్టాడు బిగ్​బాస్​. 14 మందిలో ఆరుగురు కంటెస్టెంట్స్‌కి "పట్టుకునే ఉండండి" అంటూ తొలి టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్​లో ముందుగా.. చాలా రకాల కలర్లు ఉన్న బెల్ట్​లను కంటెస్టెంట్స్​ పట్టుకునే ఉండాలి. పక్కనే ఉన్న స్పిన్​ తిప్పినప్పుడు ఏ కలర్​ అయితే వస్తుందో ఆ కలర్​ను బెల్ట్​ను కట్​ చేస్తుంటారు. ఇలా బెల్ట్​లు కట్​చేస్తున్నప్పుడు ఎవరూ కాలు కింద పెట్టకూడదు. పక్కనే ఉన్న కేజ్​ను పట్టుకోకూడదు. అలా చేసిన వారు గేమ్​ నుంచి అవుట్​ అయినట్లు లెక్క. అయితే ప్రోమో ఎండ్​ అయ్యే టైమ్​కు ఒకరు కింద పడుతున్నట్లుగా.. ముగ్గురు బెల్ట్​లను పట్టుకుని ఉన్నట్లుగా చూపించారు. అయితే ఈ టాస్క్‌లో గెలిచిన దాన్ని బట్టే.. హౌస్ మేట్స్‌కి రేషన్ రాబోతుందని సమాచారం.

ఈ వారం నామినేషన్స్​ ఉండవా?: సాధారణంగా గత అన్ని సీజన్లల్లో షో మొదలైన రెండో రోజే నామినేషన్స్​ ఉంటుంటాయి. ఎలిమినేట్​ చేయాలనుకున్నవారిని సోమవారం రోజున నామినేట్​ చేస్తుంటారు. అయితే ఈ సీజన్​ 8లో టర్న్​లకు, ట్విస్ట్​లకు లిమిటే లేదంటూ చెబుతున్నారు కాబట్టి.. ఆడియెన్స్​లో నామినేషన్లు లేవా? అనే డౌట్​ రైజ్​ అయ్యింది. ఇది తెలియాలంటే షో చూడాల్సిందే..!

బిగ్​ బాస్​ 8లో "డబుల్ ధమాకా" - ఇప్పటి వరకూ చూడని సరికొత్త ఎలిమెంట్​ చూపిస్తారట!

Bigg Boss Show : 3 రోజులు రూ.2 కోట్లు.. హైయెస్ట్​​ రెమ్యునరేషన్​ తీసుకున్న కంటెస్టెంట్​ తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.