ETV Bharat / entertainment

'హీరో కన్నా ముందు మొదట అలా అవ్వాలనుకున్నాను!' : బాలకృష్ణ - Sathyabhama Trailer - SATHYABHAMA TRAILER

Balakrishna Kajal Agarwal Sathyabhama Trailer : కాజ‌ల్ అగర్వాల్ సత్యభామ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్​కు చీఫ్ గెస్ట్​గా వచ్చిన బాలకృష్ణ ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. పూర్తి వివరాలు స్టోరీలో.

Source ETV Bharat
Balakrishna Kajal Agarwal (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 10:03 PM IST

Balakrishna Kajal Agarwal Sathyabhama Trailer : చంద‌మామ కాజ‌ల్ అగర్వాల్ నటించిన మూవీ స‌త్య‌భామ‌. సుమన్ చిక్కాల ద‌ర్శ‌కుడు. కాజ‌ల్ పోలీస్​ ఆఫీస‌ర్‌గా నటించగా నవీన్ చంద్ర కీల‌క పాత్ర‌ పోషించారు. క్రైమ్ సస్పెన్స్​గా తెరకెక్కిన ఈ సినిమా జూన్​ 7న రిలీజ్ కానున్న సందర్భంగా ట్రైలర్​ను రిలీజ్ చేశారు మేకర్స్​. ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్​కు నందమూరి నటసింహం బాలకృష్ణ చీఫ్ గెస్ట్​గా విచ్చేసి సినిమాపై ప్రశంసలు కురిపించారు.

కెమెరామెన్​ అవ్వాలనుకున్నాను - "అందరికీ నమస్కారం. ప్రచారాలు పూర్తవ్వగానే షూటింగ్ మొదలు పెడదామని వచ్చాను. కానీ అది షురూ కాలేదు. ఏదేమైనా ఈ 50 రోజులు కెమెరాను మిస్​ అయ్యాను. ఇప్పుడది ఈ ఫంక్షన్ ద్వారా తీరింది. సత్యభామ పేరుకు చాలా గొప్ప చరిత్ర ఉంది. సినిమాలో యాక్షన్, స్టంట్స్​ అన్నీ బాగున్నాయి. సినిమాకు సంబంధించి అన్నీ విభాగాలు బాగున్నాయి. వాస్తవానికి మొదట్లో కెమెరామెన్​ కావాలనుకున్నాను. అన్నీ క్రాఫ్ట్స్​పై అవగాహన ఉండాలనుకున్నాను." అని పేర్కొన్నారు.

ఓ ఫైర్ బ్రాండ్ - "కాజల్ అగర్వాల్​ ఓ ఫైర్ బ్రాండ్​. 16 సంవత్సరాల్లో ఎన్నో పాత్రలు చేసింది. మధ్యలో గ్యాప్​ తీసుకుంది మళ్లీ కమ్​ బ్యాక్ కూడా ఇచ్చింది. బిడ్డను కని తిరిగి ఇండస్ట్రీకి వచ్చింది. సమపాళ్లలో అన్నింటికీ న్యాయం చేసింది. మా భగవంత్ కేసరిని ఒప్పుకున్నందుకు తనకు ధన్యావాదాలు. తన సినిమాలను మొదటి నుంచి చూస్తున్నాను. ఆమె డెడికేషన్​ ఉన్న నటి." అని అన్నారు.

ఆ అదృష్టం నాకు దక్కింది - "మా నాన్న అన్నీ పాత్రలు చేశారు. ఒక్క నారథుని పాత్ర చేయలేదు. కానీ ఆ అదృష్టం నాకు దక్కింది. క్రమశిక్షణ అనేది రామారావుగారితోనే మొదలైంది. వారసులు అంటే కేవలం ఆయన గురించి చెప్పుకోవడం కాదు. ఆయన వేసిన బాటను అందరం ఆచరిస్తున్నామా లేదా అనుకోవాలి. ఇక్కడున్న వారందరూ క్రమశిక్షణ పాటిస్తున్నారు తెలుగు చిత్రరంగం ఇండియావైడ్​గా టాప్​లో ఉంది. మంచి మంచి సినిమాలు ఇంకా రావాలి. చిత్రసీమను ప్రోత్సాహిస్తున్న ప్రేక్షకుల దేవుళ్లకు ధన్యావాదాలు. సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను." అని స్పీచ్​ను ముగించారు.

కాగా, సత్యభామ సినిమాను అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. ప్రకాశ్​ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్ తదితరులు ముఖ్య పాత్ర‌ల‌ు పోషించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.