ETV Bharat / entertainment

'బలగం' వేణు అందులో రెండు సార్లు స్టేట్ ఛాంపియన్ - మీకు తెలుసా? - బలగం వేణు స్టేట్ ఛాంపియన్

Balagam Director Venu : రీసెంట్​గా 'బలగం' చిత్రంతో డైరెక్టర్​గా తన తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్న హాస్యనటుడు వేణు - తాను సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలిపారు? అసలు సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? ఆర్టిస్టుగా మారడానికి ఆయన చేసిన ప్రయత్నాలేంటి? సహా పలు విషయాలను తెలిపారు.

'బలగం' వేణు అందులో రెండు సార్లు స్టేట్ ఛాంపియన్ - మీకు తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 11:32 AM IST

Balagam Director Venu : రీసెంట్​గా 'బలగం' చిత్రంతో డైరెక్టర్​గా తన తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్నారు కమెడియన్ వేణు. దాదాపు 25 ఏళ్ళ క్రితమే సినీ పరిశ్రమలోకి వచ్చిన ఆయన మొదట కొన్నాళ్ళ పాటు అసిస్టెంట్​గా పనిచేసి, ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్​లో పైకి ఎదిగారు. మున్నా సినిమాతో హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత జబర్దస్త్ షోతో మరింత పాపులర్ అయ్యారు. ఇప్పుడు దర్శకుడిగా మారి సినిమాలు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం తన రెండో సినిమా కోసం పని చేస్తున్నారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ పాల్గొన్న వేణు తాను సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలిపారు? అసలు సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? ఆర్టిస్టుగా మారడానికి ఆయన చేసిన ప్రయత్నాలేంటి? సహా పలు విషయాలను తెలిపారు.

కూరగాయలు అమ్మేవాడిని : "మా అమ్మానాన్న కూరగాయలు అమ్మేవారు. పావలా కొత్తి మీర అమ్మాలంటే ఎన్నో మాటలు చెప్పాలి. అలా మాటలు చెబుతూ, కూరలు అమ్ముకుంటూ నేను చదువుకున్నాను. అందుకే నన్ను అందరూ వాగుడుకాయ అని అంటుంటారు. అయితే అందరి కన్నా నేను ప్రత్యేకంగా ఉండాలని భావించేవాడిని. అందుకే మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నాను. రెండుసార్లు స్టేట్‌ ఛాంపియన్‌గా కూడా నిలాచాను. కానీ, అప్పటికే నాకు సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. ఏ సినిమా రిలీజైనా చూసేవాడిని. అందరూ నన్ను బాబూమోహన్‌ బావమరిది అని పిలిచేవారు. దీంతో ఎలా అయినా సినిమాల్లోకి వెళ్లాలని ఇంటి నుంచి వచ్చేశాను" అని చెప్పుకొచ్చారు.

అలా కెరీర్ మొదలు : కెరీర్‌ మొదట్లో నవకాంత్‌ అనే రచయిత దగ్గర మూడు నెలలు అసిస్టెంట్‌గా పని చేశాను. అయితే సినిమాల్లో పని చేసేవారి దగ్గర ఉంటేనే పరిచయాలు పెరుగుతాయని అనిపించింది. అక్కడ ఉన్నప్పుడే 'చిత్రం' శ్రీను అసిస్టెంట్‌ కోసం వెతుకుతున్నారని తెలిసి, ఓ వ్యక్తి ద్వారా అక్కడ జాయిన్​ అయ్యాను. రెండు సంవత్సరాలు అక్కడే ఉండి పని చేశాను. చాలా విషయాలు నేర్చుకున్నాను.

ఆయన వల్లే ఇలా : సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడ్డాను. అప్పుడే దేవుడిచ్చిన అన్నయ్యలా కొత్తపల్లి శేషు 'చిత్రాంజలి' జర్నలిస్టు పరిచయమయ్యారు. 'వండర్‌ బాయ్‌' అని పేరు పెట్టారు. నాకు అవసరానికి డబ్బులిచ్చేవారు. ఎప్పటికప్పుడు నాలో స్ఫూర్తినింపుతుండేవారు. నా ఇంటి అద్దె కూడా కట్టేవారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రాకింగ్ స్టార్​ యశ్ కొత్త సినిమాలో బాలీవుడ్ బాద్​ షా

SSMB 29 - వారిని పక్కన పెట్టేసిన జక్కన్న!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.