ETV Bharat / entertainment

బాగా ఫీలైన అవంతిక వందనపు - ఏం జరిగిందంటే? - Avantika Vandanapu on Trolls - AVANTIKA VANDANAPU ON TROLLS

Avantika Vandanapu Trolls : తెలుగమ్మాయి అవంతిక వందనపు ప్రస్తుతం హాలీవుడ్​లోనూ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈమె ఆ విషయంలో చాలా బాధపడినట్లు చెప్పుకొచ్చింది. పూర్తి వివరాలు స్టోరీలో.

బాగా ఫీలైన అవంతిక వందనపు
బాగా ఫీలైన అవంతిక వందనపు
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 7:13 PM IST

Avantika Vandanapu Trolls : బాలనటిగా టాలీవుడ్​​ ప్రేక్షకులకు పరిచయమైన అవంతిక వందనపు ప్రస్తుతం హాలీవుడ్​లోనూ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్​గా ఓ అరుదైన ఘనత కూడా దక్కించుకుంది. హైదరాబాదీ అమ్మాయి అయి ఉండి హాలీవుడ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాక ఓ ప్రతిష్ఠాత్మక అవార్డును కూడా సొంతం చేసుకుని తెలుగు ప్రేక్షకులు గర్వించేలా చేసింది. అయితే ఈమెపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె తనపై వస్తున్న ట్రోలింగ్​ గురించి రియాక్ట్ అయింది.

హద్దులు దాటిన అభిమానం - ఈ అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉందని అవంతిక చెప్పింది. ఇది కేవలం తన పనికి మాత్రమే లభించిన సత్కారం కాదని, హద్దులు దాటిన అభిమానానికి దక్కిన అవార్డనీ చెప్పుకొచ్చింది. గ్లోబల్ సినిమాలో భారత దేశం భాగం కావడం వల్లే తనకు ఈ అరుదైన అవార్డు దక్కిందని కూడా అవంతిక చెప్పింది. అలానే ఒకానొక సమయంలో తాను ఎదుర్కొన్న అవమానాలను గురించి తెలిపింది.

చాలా బాధపడ్డాను - కొన్ని నెలల క్రితం అవంతిక వందనపు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందులో ఆమె మాట్లాడిన అమెరికా యాసను, తన మాటలను చాలా మంది నెగిటివ్​గా ట్రోల్ చేశారు. ఆ ట్రోల్స్ కరణంగా తాను చాలా బాధపడ్డానని చెప్పింది అవంతిక. నిజానికి ఆ రోజు తాను పాజిటివ్​గా మాట్లాడిన విషయాలను నెగిటివ్ విషయాలుగా చెప్పి అనవసరంగా ట్రోల్ చేశారని బాధపడింది. అయినప్పటికీ తాను అవేవీ పట్టించుకోకుండా కెరీర్ లో ఎదగాలనే ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ అవార్డు తనకు మరింత గుర్తింపు ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది.

కాగా, రీసెంట్​గా అవంతిక 'మీన్ గర్ల్' అనే మ్యూజికల్ కామెడీ సినిమాలో ఓ మెయిన్ లీడ్ రోల్‌లో నటించింది. ఇందులో 'కరణ్ శెట్టి' అనే పాత్రకుగానూ తాజాగా ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డును ఆమెకు అందించింది. గ్లోబల్ మీడియాలో సౌత్ ఏషియన్‌గా రిప్రజెంట్ చేస్తూ కళల పట్ల ఆమె చేస్తున్న సేవకు గానూ అవంతికకు ఈ అవార్డు ఇచ్చినట్లు ఆ సంస్థ ప్రకటించింది.

కెరీర్ ఇలా ప్రారంభం - తెలుగు సినిమా ఇండస్ట్రీకి 2015లో బాలనటిగా పరిచయమైన అవంతిక మహేశ్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' సినిమాలో మొదటగా నటించింది. ఆ తర్వాత 'మనమంతా', 'ప్రేమమ్', 'రారండోయ్ వేడుక చూద్దాం', 'బాలకృష్ణుడు', 'ఆక్సిజన్', 'అజ్ఞాతవాసి' లాంటి సినిమాల్లో నటించింది. 'ప్రేమమ్' సినిమాలో మడోన్నా సెబాస్టియన్ చిన్ననాటి పాత్రతో అవంతిక అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత కొన్నాళ్లు సైలెంట్ అయిన ఈ బ్యూటీ ఒక్కసారిగా 2021లో హాలీవుడ్ చిత్రం 'స్పిన్' లో కనిపించి షాకిచ్చింది.

తెలుగులో రీమేక్ కానున్న మలయాళ సూపర్ హిట్ మూవీ - హీరోగా టాలీవుడ్ డైరెక్టర్​! - Jaya Jaya Jaya Jaya Hey Movie

థ్రిల్లర్​, హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ పక్కా! - ఈ బ్లాక్​బస్టర్​ మాలీవుడ్​ సినిమాలు చూశారా ? - Top Malayalam Movies In OTT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.