August 1 OTT Releases : జులై ముగిసింది. ఆగస్ట్ నెల మొదలైంది. దీంతో మళ్లీ కొత్త సినిమా, సిరీస్లు స్ట్రీమింగ్కు వచ్చేశాయి. పైగా ప్రతి వారం శుక్రవారం రావాల్సిన చిత్రాలు ఈ సారి ఒకరోజు ముందుగానే గురువారం వచ్చేశాయి. మొత్తంగా ఈ వారం 23 సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానుండగా అందులో గురువారం ఒక్కరోజే ఏకంగా 11 ప్రాజెక్ట్లు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. దీంతో ఫ్రైడే రావాల్సిన మూవీ ఫెస్టివల్ గురువారమే కనిపిస్తోంది. ఇంతకీ ఆ సినిమాలేంటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.
జియో సినిమా ఓటీటీలో
గుహ్డ్ చడీ (హిందీ చిత్రం) - ఆగస్ట్ 1
డ్యూన్ పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ మూవీ) - ఆగస్ట్ 1(Dune part 2 Jio cinema)
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
బోర్డర్ లెస్ ఫాగ్ (ఇండోనేషిన్ సినిమా) - ఆగస్ట్ 1
ఏ గుడ్ గర్ల్ గైడ్ టూ మర్డర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - ఆగస్ట్ 1
అన్‌స్టెబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - ఆగస్ట్ 1
మ్యాన్ లఫెర్ట్ టెమో (స్పానిష్ చిత్రం) - ఆగస్ట్ 1
లవ్ ఈజ్ బ్లైండ్ మెక్సికో (స్పానిష్ వెబ్ సిరీస్) - ఆగస్ట్ 1
ఈటీవీ విన్ ఓటీటీలో
రక్షణ (తెలుగు చిత్రం) - ఆహా ఓటీటీ- ఆగస్ట్ 1(payal rajput Rakshana OTT)
డియర్ నాన్న (తెలుగు మూవీ) - ఆగస్ట్ 1
సత్యభామ (తెలుగు సినిమా) - ఆగస్ట్ 1
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
బ్యాట్ మ్యాన్ : క్యాప్‌డ్ క్రూసేడర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - ఆగస్ట్ 1
వీటిన్నింటిలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సీక్వెల్ డ్యూన్ 2పై చాలా మందిలో ఆసక్తి ఉంది. ఇది ఇంగ్లీషుతో పాటు తెలుగు ఇతర దక్షిణాది భాషల్లో అందుబాటులో ఉంది. బ్యాట్ మ్యాన్ వెబ్ సిరీస్ కూడా ఇంట్రెస్టింగ్ కలిగిస్తోంది. ఇంకా టాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకున్న పాయల్ రాజ్‌పుత్ లేటెస్ట్ క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ రక్షణ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీకెండ్లో మీరు ఫ్రీగా ఉంటే వీటిని ఎంచక్కా చూస్తూ ఎంజాయ్ చేయండి.