ETV Bharat / entertainment

దిల్ రాజుతో పెద్ద గొడవ - కాళ్లు పట్టేసుకున్న సుకుమార్! - Dil Raju Sukumar - DIL RAJU SUKUMAR

Arya 20 Years completed : నిర్మాత దిల్​రాజు కాళ్లను పట్టుకున్నారు పుష్ప దర్శకుడు సుకుమార్! ఏం జరిగిందంటే?

ETV Bharat
Dil Raju Sukumar (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 8, 2024, 11:52 AM IST

Arya 20 Years completed : 2004లో వచ్చిన ఆర్య సినిమా దిల్ రాజును నిర్మాతగా నిలబెట్టడమే కాదు సుకుమార్, బన్నీ కెరీర్స్​ను మలుపు తిప్పింది. ఆ మూవీ వచ్చి 20 ఏళ్ల అయిన సందర్భంగా ఆ మూవీ యూనిట్ రీ యూనియన్ సెలబ్రేషన్స్ హైదరాబాద్​లో జరిగాయి. ఆ ఈవెంట్​లో అల్లు అర్జున్, దిల్ రాజు, సుకుమార్, శివ బాలాజీ, ఆ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ తో పాటు మరికొంతమంది పాల్గొన్నారు. అందరూ సరదాగా తమ కెరీర్​ను ఆర్య మూవీ ఎలా మలుపు తిప్పిందనే విషయాన్ని షేర్ చేసుకున్నారు.

అలానే సుకుమార్ కూడా ఈ చిత్రం షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను అందరితో పంచుకున్నారు. “కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి నిర్మాతలు సాహసించని టైంలో దిల్ రాజు గారు ధైర్యంగా నాతో మూవీ చేయడానికి ఒప్పుకున్నారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మా ఇద్దరికీ కూడా ఒకసారి చిన్న గొడవ జరిగింది. ఆర్య షూటింగ్ సమయంలో నేను, దిల్ రాజు గారు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక సీన్ షూటింగ్ గురించి, ఆ సీన్ సినిమాకు ఎంత ముఖ్యమనేది నేను వివరంగా ఆయనకు చెప్పాను. అయితే ఆ సీన్ వల్ల అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని దిల్ రాజు గారు ఒప్పుకోలేదు. ఇద్దరికీ మాటా మాటా పెరిగింది. ఎంతలా అంటే మీరు మీరు నుంచి నువ్వు, నువ్వు అనుకునే దాకా వెళ్లిపోయాం. గొడవ చాలా పెద్దది అయిపోయిన స్టేజ్​లో నేను సడెన్​గా ఆయన కాళ్లు పట్టేసుకున్నాను. ఆ సీన్ లేని సినిమా కష్టమని ప్రాధేయపడ్డాను” అని నవ్వుతూ చెప్పారు సుకుమార్. అంతవరకు సీరియస్​గా వింటున్న అందరు చివరికి నవ్వు ఆపుకోలేకపోయారు. దిల్ రాజు గట్టిగా నవ్వితే, పక్కనే ఉన్న అల్లు అర్జున్ నోటికి చేయి అడ్డు పెట్టుకుని నవ్వు ఆపుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేశారు.

ఇక ఇదే ఈవెంట్​లో బన్నీ మాట్లాడుతూ “నా లైఫ్ మార్చేసిన మూవీ ఇది. నిజానికి నా కెరీర్​ను ట్రాక్​లో పెట్టిన క్రెడిట్ సుకుమార్ కే వస్తుంది” అంటూ సుకుమార్​ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇక వీళ్లిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న విడుదల చేయనున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిడమే కాదు అల్లు అర్జున్​కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. పుష్ప మొదటి భాగం. ఇక రెండో భాగం ఎన్ని రికార్డులను బద్దలగొడుతుందో చూడాలి. ఈ మూవీలో బన్నీతో పాటు రష్మిక, ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆర్య ప్రేమ కథకు 20ఏళ్లు - ఆ ఆరుగురు జీవితాల్ని మార్చేసింది! - Arya movie 20 years

బన్నీ లైఫ్​ను మార్చేసిన ఆ తేదీ - అసలా రోజు ఏం జరిగిందంటే? - ALLUARJUN

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.