ETV Bharat / entertainment

రాశీ ఖన్నా అందాల జాతర - ఇది మరో రేంజ్ అంతే! - Raasi Khanna Latest Photoshoot

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 9:33 PM IST

.
.

Raasi Khanna Latest Photoshoot : టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా తాజాగా అదిరిపోయే ఫొటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్​అవుతున్నాయి.

Raasi Khanna Latest Photoshoot : రాశీ ఖన్నా గురించి చాలా మంది సినీ ప్రియులకు తెలిసే ఉంటుంది. 2013లో వచ్చిన మద్రాస్ కేఫ్ అనే హిందీ మూవీతో వెండితెరకు పరిచయమైందీ బ్యూటీ. అదే ఏడాది తెలుగులో ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీలో బొద్దుగా ఉన్న రాశి తెలుగు ఆడియెన్స్​కు తెగ నచ్చేసింది. అనంతరం కొన్ని సినిమాలు చేసిన ఆమె ఇండస్ట్రీలో నిలబడాలంటే నటనతో పాటు శరీరం మీద దృష్టి పెట్టాలని అనుకున్నట్లు ఉంది. అందుకే తీవ్రంగా కసరత్తులు చేసి మెరుపు తీగలా మారిపోయింది. తెలుగు, తమిళం, హిందీ మూవీస్​లో కూడా అవకాశాలు సంపాదించుకుంది.

అయితే రాశీ ఖన్నా రీసెంట్​గా చేసిన తెలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపర్చినా సోషల్ మీడియాలో మాత్రం ఈ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. లేటెస్ట్​గా రాశి తన ఇన్స్టాగ్రామ్​లో రెడ్ కలర్​ లెహంగాతో హాట్ అందాలతో కుర్రకారు మతిపోగొట్టే ఫోటోలు పోస్ట్ చేసింది. అందులో రెడ్ లెహంగాతో పాటు ఆ కలర్​కు మ్యాచ్ అయ్యే లావుపాటి బ్యాంగిల్స్​తో ట్రెడిషనల్ లుక్​లో అదరగొట్టేసింది. ఆ ఫోటోల క్రింద "మంచి టేస్ట్ ఉన్న తుంటరి దెయ్యం" అని క్యాప్షన్ పెట్టింది. ఆ ఫొటోలు పెట్టిన కొన్ని గంటల్లోనే విపరీతమైన లైక్స్ అండ్ కామెంట్స్ వచ్చాయి. కాగా, ఇన్స్టాగ్రామ్​లో రాశీకి 11 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ఇకపోతే గత ఏడాది రాశీ నటించిన ఫర్జీ సిరీస్​కు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సంవత్సరం మార్చిలో సిద్దార్థ్ మల్హోత్రాతో చేసిన హిందీ మూవీ యోధా ప్లాప్ టాక్ తెచ్చుకుని కమర్షియల్​గా సక్సెస్ కాలేకపోయింది. ఇక విక్రాంత్ మాస్సేతో కలిసి నటించిన ది సబర్మతి రిపోర్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. మరో మూవీ బాక్(అరణ్మమై 4) కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక తెలుగులో శర్వానంద్​తో ఒక ఫిల్మ్, సిద్దు జొన్నలగడ్డతో మరో సినిమాకు ఆమె సైన్ చేసినట్లు సమాచారం. తమిళంలో మేధావిలో జీవాతో అనే సినిమా కూడా చేసింది.

RRRపై హాలీవుడ్ భామ ప్రశంసలు - ఎన్టీఆర్​, ​చరణ్​తో నటించాలని ఉందంటూ! - Anne Hathaway

స్టేజ్​పైనే కన్నీళ్లు పెట్టుకున్న 'యానిమల్' విలన్ - Bobby Deol cries

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.