ETV Bharat / entertainment

'రెహమాన్ అడగలేదు - మరి మీరెందుకు అడుగుతున్నారు ఇళయరాజా!?' - Ilayarajas Copyright Issue

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 8:55 AM IST

Ilayaraja's Copyright Issue : తాను సంగీతం సమకూర్చిన సినిమా పాటలపై తనకే హక్కు ఉందంటూ ఇళయరాజా వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. పూర్తి వివరాలు స్టోరీలో

Source ETV Bharat
ILayaraja (Source ETV Bharat)

Ilayaraja's Copyright Issue : ఇళయరాజా కంపోజ్ చేసిన 4వేల 500 పాటలను తన అనుమతి లేకుండా వాడుకుంటున్నారంటూ వేసిన వ్యాజ్యం మరోసారి వాయిదా పడింది. ఎకో రికార్డింగ్ సంస్థపై ఇళయరాజా చేసిన అప్పీల్‌ను జూన్ 13న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఆర్ మహదేవన్, జస్టిస్ మహ్మద్ షఫీక్‌ల మొదటి డివిజన్ బెంచ్ విచారించింది. ఎకో తరపున సీనియర్ న్యాయవాది విజయ్ నారాయణ్ వాదన వినిపించారు. ఇళయరాజాకు తమ సినిమాల్లోని పాటలకు కంపోజ్ చేయాలని పలు చిత్ర నిర్మాతలు పని అప్పగించి, దానికి తగ్గ రెమ్యూనరేషన్ ఇచ్చారని, కాబట్టి కాపీరైట్ పూర్తిగా సంబంధిత నిర్మాతల వద్దనే ఉంటుందని నారాయణ్​ పేర్కొన్నారు.

ఈ పాటలకు సంబంధించిన కాపీ రైట్ ఇళయరాజా వద్దనే ఉందనడానికి, ఈ పాటల ఆల్బమ్‌ను ఆయన సొంతంగా రిలీజ్ చేయలేదని గుర్తుచేశారు. ఎకో కంపెనీ కేవలం పాటలను కొనుగోలు చేయడం, విక్రయించడం లాంటివి చేస్తుంటుందని అందుకోసం ఇళయరాజా దగ్గర నుంచి ఎలాంటి కాపీ రైట్ హక్కులను తీసుకునే అవసరం లేదని వెల్లడించారు.

"తాను సంగీతం సమకూర్చడం వల్లనే ఆ సినిమాలు హిట్ అయ్యాయని ఇళయరాజా భావిస్తున్నారు. కానీ, తాను కూడా ఆ సినిమా యూనిట్‌లో కాంట్రాక్ట్‌డ్ ఎంప్లాయీ అనే సంగతి మర్చిపోయి సెపరేట్ కాపీరైట్ అడుగుతున్నారు. ఇలా క్రియేటివ్ వర్క్ గురించి కాపీరైట్ క్లెయిమ్ చేయాలనుకుంటే పాటల రచయితలు కూడా అదే పని చేయాలి. రెహ్​మాన్​ ఎప్పుడూ తన పాటల గురించి కాపీరైట్ అడగలేదే. ఒక పాట బయటకు రావాలంటే సంగీతం సమకూర్చడంతో పాటు సింగర్ కూడా కావాలి. ఇళయరాజా సమకూర్చిన సంగీతానికి వేరొకరు పేరు ఆపాదించడం లాంటి వాటిని మాత్రమే కాపీరైట్ అంటారు. చట్టం ముందు అందరూ సమానులే. ఇళయరాజాకు ప్రత్యేక హక్కులేమీ లేదు" అని వాదించారు. తమ క్లయింట్ అయిన ఎకో సంస్థ ఇళయరాజా కంపోజ్ చేసిన 4వేల 500పాటలకు సంబంధించిన రైట్స్​ను ఆయా నిర్మాతల నుంచి కొనుగోలు చేసిందని కౌన్సిల్ తరపు న్యాయవాది తెలిపారు.

దీనిపై బెంచ్ జోక్యం చేసుకుంటూ, కర్ణాటక సంగీతానికి చెందిన త్రిమూర్తులు అయిన త్యాగరాజర్, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామ శాస్త్రి కూడా సంగీతం కంటే ఎప్పుడూ తమను తాము గొప్పగా చెప్పుకోలేదని గుర్తు చేసింది. ఇళయరాజా తరఫు న్యాయవాది తన వాదన వినిపించేందుకు సమయం కోరడంతో తదుపరి విచారణ జూన్ 19న జరగనుంది.

నటి శిల్పా శెట్టిపై చీటింగ్ కేసు నమోదు! : పోలీసులకు కోర్టు ఆదేశం

SSMB29 - కీలక అప్డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.