ETV Bharat / entertainment

ట్రాక్ మార్చిన టిల్లు బ్యూటీ - లేడీ ఓరియెంటడ్ మూవీస్​కు సై - Anupama Parameswaran New Movie

Anupama Parameswaran Female Oriented Movies : అటు నేచురల్​గానూ తనదైన స్టైల్​లో మురిపించి, ఇటు గ్లామర్​తోనూ ఆకట్టుకున్న మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు ట్రాక్ మార్చి కొత్త జానర్​లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆ విశేషాలు మీ కోసం.

Anupama Parameswaran
Anupama Parameswaran (Source : ETV Bharat Archives)
author img

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 7:27 PM IST

Anupama Parameswaran Female Oriented Movies : తన నేచురల్ యాక్టింగ్​తో యూత్​ను ఆకట్టుకుంది మల్లు బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఈ చిన్నది, అగ్రతారల సరసన స్క్రీన్ షేర్ చేసుకుని ఇటు టాలీవుడ్​లోనే కాకుండా మొత్తం సౌత్​లోనూ మంచి స్టార్​డమ్​ సంపాదించుకుంది. ఇటీవలె వచ్చిన 'టిల్లు స్క్వేర్' మూవీ పలు షేడ్స్​ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. సినిమా హిట్ కావడంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఇన్నేళ్లు చేసినట్లుగా కాకుండా ఓ కొత్త జానర్​ను ఎంచుకుని దాంట్లో కూడా తన సత్తా చాటాలని చూస్తోంది అనుపమ. లేడీ ఓరియంటడ్ సినిమాల వైపు మక్కువ చూపిస్తోంది. తాజాగా ఆమె సైన్ చేసిన పలు సినిమాలు అదే కోవకు చెందినవి కావడం విశేషం.

ఇటీవలె ప్రశాంత్ వర్మ డైరెక్షన్​లో తెరకెక్కుతున్న 'ఆక్టోపస్' అనే సినిమాకు అనుపమ సైన్ చేసింది. అందులో ఆమె పాత్ర చాలా స్ట్రాంగ్​గా ఉండనున్నట్లు టాక్ నడుస్తోంది. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ మూవీకి బ్రేక్​ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. మళ్లీ ఈ సినిమా షూటింగ్​ను తిరిగి ప్రారంభించారు.

ఇక 'ఆక్టోపస్' తర్వాత డైరెక్టర్ ప్రవీణ్ కందిరేగుల రూపొందించనున్న 'పరదా' అనే ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీకి కూడా సైన్ చేసింది. తాజాగా విడుదలైన పోస్టర్​ ద్వారా ఆమె ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇక 'ఆక్టోపస్' చిత్రీకరణ తర్వాత అనుపమ 'పరదా' షూటింగ్​లో పాల్గొనే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, తమిళ డైరెక్టర్ ఏ.ఆర్ జీవా తెరకెక్కిస్తున్న 'లాక్​డౌన్'​ అనే సినిమాలోనూ అనుపమ కీ రోల్​ ప్లే చేస్తోంది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తాజాగా మేకర్స్​ అనుపమ స్పెషల్ లుక్​ను కూడా విడుదల చేశారు. దీనిబట్టి అనుపమ రానున్న సినిమాల్లో స్ట్రాంగ్ క్యారెక్టర్స్​లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు అనుపమ మలయాళంలో 'జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ' అనే సినిమాలో నటించింది. డైరెక్టర్ ప్రవీణ్‌ నారాయణ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జానకిగా అనుపమ కనిపించనుంది. మలయాళ స్టార్ యాక్టర్​ సురేశ్‌ గోపి కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.

టిల్లు స్క్వేర్ మ్యాజిక్​​ - అనుపమ పాత్ర మిస్ చేసుకున్న హీరోయిన్స్ వీరే! - Tillu Square

ఫుల్​ స్వింగ్​లో అనుపమ - పాన్ఇండియా స్టార్ అయినా ఆ సినిమాల్లో ఛాన్స్ రాలేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.