ANR 100th Birthday Celebrations : దివంగత అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి వేడుకలో భాగంగా తాజాగా జరిగిన ఈవెంట్లో హీరో నాగార్జున కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది ఏఎన్నార్ అవార్డును చిరంజీవికి ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ 28న చిరంజీవికి ఈ అవార్డును ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా అమితా బచ్చన్ రానున్నారని నాగ్ వెల్లడించారు.
ఇక హైదరాబాద్‌లోని ఆర్కే సినీ ప్లెక్స్‌లో యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అధ్యక్షతన అక్కినేని శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అక్కినేని నాగార్జునతోపాటు కుటుంబసభ్యులు హాజరుకాగా దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు, సీనియర్ నటులు మురళీమోహన్ , ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పోస్టల్ శాఖ రూపొందించిన అక్కినేని పోస్టల్ స్టాంప్ ను ఆవిష్కరించారు. అలాగే కింగ్ ఆఫ్ సిల్వర్ స్క్రీన్ పేరుతో నాలుగు రోజుల పాటు 31 నగరాల్లో అక్కినేని నటించే చిత్రాల పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం అక్కినేనితో ఉన్న అనుబంధాన్ని అతిథులు గుర్తుచేసుకున్నారు. అభిమానుల కంటే అక్కినేనిపై తమ కుటుంబానికి ఎక్కువ ప్రేమ ఉందన్న నాగార్జున, ఆ ప్రేమను మరిపించేలా అభిమానులు వివిధ కార్యక్రమాలు చేపట్టడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. నవ్వుతూ జీవించడం నేర్పిన తన తండ్రిని ఎప్పుడు తలుచుకున్నా నవ్వొస్తుందన్నారు. ఈ శత జయంతి సంవత్సరంలో అక్కినేని జాతీయ పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవికి ప్రదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
The ANR National Award in his centenary birth year will be awarded to MEGASTAR @KChiruTweets Garu ✨
— Annapurna Studios (@AnnapurnaStdios) September 20, 2024
Superstar @SrBachchan Garu will present the award in a special event on October 28th ❤🔥#ANR100 #CelebratingANR100 #ANRLivesOn #AnnapurnaStudios pic.twitter.com/3Ia7xWuoWh
'ఆ క్షణాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా'
ఇక ఏఎన్నార్ శత జయంతిని పురస్కరించుకొని మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు. ఏఎన్నార్ అద్భుతమైన నటుడని ఆయన కొనియాడారు. ఆయనతో కలిసి పని చేసిన రోజులను ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. "అద్భుతమైన నటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావును శత జయంతి సందర్భంగా స్మరించుకుంటాం. ఆయన ఓ నటనా మేధావి. అద్భుతమైన పాత్రలతో ఆయన ఎప్పుడూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి ఉంటారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. 'మెకానిక్ అల్లుడు' కోసం ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం నాకు కలిగింది. అందుకు నేను ఎంతో ఆనందించాను. ఆ క్షణాలను నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను" అంటూ చిరు ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.
Remembering the legendary ANR,#AkkineniNageswaraRao garu, one of the greatest actors of all time on his 100th birth anniversary.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2024
An acting genius and A doyen of Cinema, ANR garu’s memorable performances remain etched in the hearts and minds of Telugu audiences. His… pic.twitter.com/nW0TCrz2Cf
ఏఎన్నార్ నెగిటివ్ పాత్రల్లో నటించకపోవడానికి కారణం ఏంటంటే? - ANR Birth Anniversary
ANR ఫిల్మ్ ఫెస్టివల్- థియేటర్లలో 'మిస్సమ్మ', 'మాయాబజార్' మూవీస్ - Nageswara Rao Birth Anniversary