ETV Bharat / entertainment

కూతురు కోసం రూ.200 కోట్లు ఖర్చు - మళ్లీ అతడితోనే కలిసి పనిచేయనున్న షారుక్! - Sharukh Khan Anirudh Movie - SHARUKH KHAN ANIRUDH MOVIE

Sharukh Khan Anirudh Movie : షారుక్ తన కొత్త సినిమా 'కింగ్' కోసం ​ మరోసారి అతడితో కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. పూర్తి వివరాలు స్టోరీలో.

Source ANI
Sharukh Khan (Source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 7:18 PM IST

Sharukh Khan Anirudh Movie : గతేడాది పఠాన్, జవాన్, డంకీ అంటూ బ్యాక్​ టు బ్యాక్ వరుస హిట్లను అందుకున్న బాలీవుడ్ బాద్​ షా షారుక్ ఖాన్ ఇప్పటి వరకు ​తన కొత్త ప్రాజెక్ట్​ను అనౌన్స్ చేయలేదు. కానీ ఆయన కింగ్ అనే సినిమా చేస్తున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసింది. ఈ చిత్రంతోనే షారుక్ కూతురు సుహానా ఖాన్ కూడా వెండితెర అరంగేట్రం చేయనుంది.

అయితే తాజాగా ఈ సినిమా కోసం మరోసారి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్​ అనిరూధ్​తో కలిసి పని చేయనున్నారట షారుక్. అంతకుముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన జవాన్ మ్యూజికల్​గానూ భారీ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అందుకే అనిరూధ్​ టాలెంట్​ అండ్​ వర్క్ నచ్చి మళ్లీ అతనితో కలిసి షారుక్ పని చేసేందుకు సిద్ధమయ్యారట. ఈ విషయాన్ని సినీ వర్గాలు తెలిపాయి.

"సరికొత్త యాక్షన్ థ్రిల్లర్​గా కింగ్ సినిమా తెరకెక్కనుంది. ఆడియెన్స్​కు సరికొత్త మజాను ఇవ్వనుంది. షారుక్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్​, సుజయ్ ఘోష్​ కలిసి ఈ సినిమాలో బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్​ కీలక పాత్ర పోషిస్తుందని భావించి, ఆ బాధ్యతను అనిరూధ్​కు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్​ నుంచి మొదలు కానుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్​ ఇప్పటికే మొదలైపోయాయి. వీడియో గ్లింప్స్​ ద్వారా సినిమా అనౌన్స్​మెంట్​ను అఫీషియల్​గా చెప్పాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అనిరూథ్​ ఈ సినిమా థీమ్​ మ్యూజిక్​ కోసం పని చేస్తున్నారు." అని సినీ వర్గాలు పేర్కొన్నాయి.

Sharukh Khan Suhana Khan King Movie : కింగ్​ చిత్రానికి సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్​పై సిద్ధార్థ్​ ఆనంద్​తో కలిసి షారుక్​ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు రూ.200కోట్ల బడ్జెట్​ పెట్టనున్నారని తెలుస్తోంది. కూతురితో కలిసి నటించబోయే సినిమా కాబట్టి ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట షారుక్. విదేశాల నుంచి స్టంట్ మాస్టర్లను తీసుకొచ్చి మరీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలిసింది. సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. కాగా, అంతకుముందు ది ఆర్చీస్ అనే చిత్రంతో సుహానా ఖాన్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

'నాకు అలాంటోడే కావాలి - వాడితోనే కలిసి ఉంటా' - Janvi Kapoor Marriage

రామ్​చరణ్​ హీరోయిన్​ను పట్టేసిన రాకింగ్ స్టార్​ యశ్​! - Toxic Movie Heroine

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.