Animal Movie Khushboo Comments : అప్పటి వరకు స్మూత్ క్యారెక్టర్స్‌తో మెరిసిన బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, 'యానిమల్' సినిమాతో ఒక్కసారిగా వైలెంట్ మోడ్‌లోకి దిగి ప్రేక్షకులను షార్కు గురిచేశారు. ఇందులో ఆయన విలక్షణ నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి. అయితే ఈ సినిమా ఓ వైపు ప్రశంసలు అందుకుంటూనే మరోవైపు పలు విమర్మలను కూడా మూటగట్టుకుంటోంది.
సినీ క్రిటిక్స్ నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది ఈ చిత్రం గురించి ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. గతంలో ఈ సినిమా స్త్రీలపై ద్వేషాన్ని ప్రోత్సహించేలా ఉందంటూ ఆమిర్‌ఖాన్ మాజీ సతీమణి కిరణ్‌రావు వ్యాఖ్యానించారు. ఇప్పుడు కోలీవుడ్ నటి ఖుష్బూ కూడా ఈ చిత్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
"నేను యానిమల్ సినిమాను అస్సలు చూడలేదు. కానీ జాతీయ మహిళా కమిషన్ మెంబర్‌గా స్త్రీలపై దాడులు, వేధింపులు, దుర్వినియోగం, ట్రిపుల్ తలాక్ లాంటి లీగల్ కేసులను చాలానే చూశాను. 'కబీర్‌సింగ్', 'అర్జున్ రెడ్డి' వంటి సినిమాలతో సమస్యలు వస్తున్నాయి. అందుకని నేను డైరెక్టర్‌ను నిందించడం లేదు. ఆయన వైపు నుంచి కూడా ఆలోచిస్తున్నాను. ఓ సినిమా హిట్ అవుతుందా లేదా అనేదే చూస్తారు తప్ప అది ఆడియెన్స్‌పై ఎటువంటి ఎఫెక్ట్ చూపుతుందో వాళ్లు తెలుసుకోలేపోతున్నారు." అంటూ డైరెక్టర్ గురించి మాట్లాడారు.
మరోవైపు ఈ సినిమాను ఇంతటి హిట్ అయ్యేలా ప్రేక్షకులు ఎందుకు చేశారో అర్ధం కావట్లేదంటూ ఆడియెన్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు. తన పిల్లలను ఇలాంటి సినిమా చూసేందుకు ఎంకరేజ్ చేయనంటూ చెప్పుకొచ్చారు.
"యానిమల్ మూవీ భారీ వసూళ్లను సాధించిందంటే దానికి కారణం ప్రేక్షకులు. స్త్రీలపై ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్న ఈ చిత్రాన్ని హిట్ అయ్యేలా చేశారంటే వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో నాకు అస్సలు అర్థంకావడం లేదు. ఇలాంటి సినిమాలు ఆదరిస్తున్నారంటే వారి మనస్థత్వాలు ఎలా ఉన్నాయన్నవి కూడా ఆలోచించాల్సిందే. వీటిని నా పిల్లలు చూసేందుకు నేను అస్సలు అంగీకరించను. కానీ వారే ఈ సినిమాను ఆసక్తిగా చూసి, అమ్మా నువ్వు యానిమల్ చూడొద్దు అని నాతో అన్నారు" అంటూ ఖుష్బూ పేర్కొన్నారు.