ETV Bharat / entertainment

OTTలోకి భయపెట్టేందుకు వచ్చేసిన తెలుగు హారర్ ఫిల్మ్​ -మీరు చూశారా? - Tantra movie - TANTRA MOVIE

వీకెండ్​ వచ్చేసింది. దీంతో ఓటీటీలోకి సరికొత్త సినిమా సరీస్​లు వచ్చేస్తున్నాయి. అలా తాజాగా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను భయపెట్టేందుకు ఓ హారర్ థ్రిల్లర్ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. ఆ వివరాలు.

OTTలోకి భయపెట్టేందుకు వచ్చేసిన తెలుగు హారర్ ఫిల్మ్​ -మీరు చూశారా?

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 3:58 PM IST

Updated : Apr 5, 2024, 4:28 PM IST

Ananya Nagalla Tantra movie OTT : ఓటీటీలో మిస్ట్రరీ థ్రిల్లర్స్​తో పాటు హారర్ ఫిల్మ్​కు మస్త్ క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు వీటిని మంచి ఆసక్తిగా చూస్తుంటారు. అందుకే ఓటీటీ ఫ్లాట్​ఫామ్స్​ కూడా వీటిని ప్రత్యేకంగా విడుదల చేస్తుంటాయి. అలా తెలుగులో వచ్చిన రీసెంట్​ సినిమా తంత్ర. పవర్ స్టార్​ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్​లో నటించిన తెలుగందం నటి అనన్య నాగళ్ల ఈ తంత్రలో ప్రధాన పాత్ర పోషించింది. ఇందులో అనన్య నాగళ్లతో పాటు సీనియర్ నటి సలోని, మీసాల లక్షణ్, టెంపర్ వంశీ కూడా ఇతర పాత్రల్లో కనిపించారు.

మార్చి 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం టాక్ పరంగా మంచి రెస్పాన్సే దక్కించుకున్నా కమర్షియల్​గా సక్సెస్ కాలేకపోయింది. వసూళ్లు అంతగా రాలేదు. కానీ ఈ సినిమాలో భయపెట్టే హారర్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయంటూ రివ్యూస్ వచ్చాయి. అందుకే ఈ చిత్రంపై ఓటీటీ ఆడియెన్స్​కు మంచి ఇంట్రెస్ట్ కలిసింది.

అయితే ఇప్పుడీ సినిమా రిలీజై నెల రోజులు కూడా కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీ కొనుగోలు చేసింది. తాజాగా దీన్ని ఏప్రిల్​ 5 అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్​కు వదిలింది. కాబట్టి, థియేటర్లలో మిస్ అయిన వారు ఉంటే ఈ తంత్ర చిత్రాన్ని ఓటీటీలో చూసేయండి.

ఇకపోతే ఈ చిత్రాన్ని ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్లపై నరేశ్​ బాబు, రవి చైతన్య నిర్మించారు. శ్రీనివాస్ గోపిశెట్టి పుల్ లెంగ్త్​ హారర్ జానర్​గా దీనిని తెరకెక్కించారు. చిత్రంలో క్షుద్రపూజలు అంటూ భయపెట్టే అంశాలను చూపించారు. మొదట్లో ట్రైలర్ విడుదల చేసినప్పుడు అయితే అప్పట్లో ఓ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి క్షుద్రపూజ నేర్చుకున్నారని అంటూ సినిమాపై బాగా హైప్ పెంచారు.

కాగా, చిత్రంలో రేఖ (అనన్య నాగళ్ల) పుట్టినప్పుడే త‌ల్లి రాజ్య‌ల‌క్ష్మిని (స‌లోని) కోల్పోతుంది. దీంతో ఆమె నాన్నమ్మ దగ్గరే పెరుగుతోంది. ఈ క్రమంలోనే తేజూ (ధనుష్ రఘుముద్రి)తో ప్రేమలో పడుతుంది. కానీ అతడు వేశ్య కొడుకు కావ‌డం వల్ల వారి ప్రేమ‌కు అడ్డంకులు ఎదురౌతాయి. మరోవైపు రేఖ జననం క్షుద్ర శ‌క్తుల కార‌ణంగా జరుగుతుంది. దీంతో రేఖ చుట్టూ ఎప్పుడూ దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పౌర్ణ‌మి వ‌చ్చిందంటే రేఖ‌ను వెతుక్కుంటూ ఏకంగా ర‌క్త పిశాచే వ‌స్తుంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

జానకిగా మారిన టిల్లుగాడి పోరి - Anupama Parameshwaran

రష్మిక లగ్జరీ లైఫ్​ - లగ్జరీ ఇళ్లు, కార్లతో పాటు ఎన్ని కోట్లు సంపాదించిందంటే? - Happy Birthday Rashmika Mandanna

Last Updated : Apr 5, 2024, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.