ETV Bharat / entertainment

ఒకే ఫ్రేమ్​లో ధోనీ, మహేశ్​ - సోషల్​ మీడియాను షేక్​ చేస్తున్న ఈ పిక్ చూశారా? - Dhoni Mahesh Babu - DHONI MAHESH BABU

Anant Ambani Wedding Dhoni Mahesh Babu : క్రికెట్, సినిమా ఈ రెండిటి మధ్య చాలా దగ్గర సంబంధం ఉంటుంది. స్టేజ్​పై ఓ క్రికెట్​ స్టార్​, లేదా ఓ సినిమా స్టార్ కలిసి కనిపిస్తే ఫ్యాన్స్​కు వచ్చే ఆ కిక్కే మరో లెవల్​లో ఉంటుంది. ఒకే ఫ్రేమ్​లో కనిపిస్తే అభిమానులు పండగ చేసుకుంటారు. తాజాగా అనంత్ అంబానీ పెళ్లిలో ఇదే జరిగింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేస్​ బాబు, ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎమ్‌ఎస్ ధోనీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు.

source Associated Press and ANI
Dhoni Mahesh babu (source Associated Press and ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 8:26 PM IST

Updated : Jul 13, 2024, 8:39 PM IST

Anant Ambani Wedding Dhoni Mahesh Babu : క్రికెట్, సినిమా ఈ రెండిటి మధ్య చాలా దగ్గర సంబంధం ఉంటుంది. స్టేజ్​పై ఓ క్రికెట్​ స్టార్​, లేదా ఓ సినిమా స్టార్ కలిసి కనిపిస్తే ఫ్యాన్స్​కు వచ్చే ఆ కిక్కే మరో లెవల్​లో ఉంటుంది. ఒకే ఫ్రేమ్​లో కనిపిస్తే అభిమానులు పండగ చేసుకుంటారు. తాజాగా అనంత్ అంబానీ పెళ్లిలో ఇదే జరిగింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేస్​ బాబు, ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎమ్‌ఎస్ ధోనీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు.

దీనికి సంబంధించిన ఫొటోను మహేశ్​ బాబు సోషల్​ మీడియాలో పోస్ట్ చేశారు. లెజెండ్‍తో అంటూ బ్లాక్ కలర్ హార్ట్ ఎమోజీలను క్యాప్షన్‍గా పెట్టారు. ధోనీతో తాను కలిసి దిగిన ఫొటోను సెలెబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ తీసినట్టుగా క్రెడిట్ ఇచ్చారు. కాగా, హకీం గతంలో కొన్ని సార్లు మహేశ్, ధోనీకి హెయిర్ కటింగ్ చేశారు. ఈ పిక్​లో ధోనీ, మహేశ్ ఇద్దరూ ట్రెడిషనల్ లుక్‍లో మెరిశారు. బ్లాక్ కలర్ షెర్వానీలో మహేశ్, గోల్డ్ కలర్ ఔట్‍ఫిట్‍తో ధోనీ అదరగొట్టారు. ఇక ఈ ఫొటో చూస్తున్న అభిమానులు తెగ సంతోషడిపోతున్నారు. ఈ ఫొటోకు లైక్‍లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇకపోతే ఈ వివాహ వేడుకలకు మహేశ్​ తన భార్య నమ్రతా శిరోద్కర్, కూతురు సితారతో కలిసి హాజరవ్వగా, ధోనీ తన భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసి సందడి చేశారు. ఇంకా టాలీవుడ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్, విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి, అక్కినేని అఖిల్ కూడా వెళ్లగా, క్రికెటర్లలో హార్దిక్ పాండ్య, సచిన్​ సహా మరి కొందరు భారత క్రికెటర్లు వెళ్లారు.

మహేశ్ సినిమాల విషయానికొస్తే రాజమౌళితో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభంకానుంది. మరోవైపు, ఐపీఎల్​లో ధోనీ వచ్చే ఏడాది ఆడతాడా లేదా అన్న విషయంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.

అంబానీ ఇంట తారల సందడి- స్పెషల్ అట్రాక్షన్ వీళ్లే!- HD పిక్స్ చూశారా? - ANANT RADHIKA WEDDING PHOTOS

అనంత్ అంబానీ వెడ్డింగ్​ - 160 ఏళ్ల క్రితం నాటి చీరతో అలియా భట్​!

Last Updated : Jul 13, 2024, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.