Amy Jackson Engagement : 'ఎవడు' సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది యంగ్ బ్యూటీ అమీ జాక్సన్. తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది, ఆ తర్వాత ఆ తర్వాత 'అభినేత్రి', 'రోబో 2.0' వంటి చిత్రాలతో ఆడియెన్స్‌ను మరించ చేరువైంది. ఇక తెలుగు నుంచి నెమ్మదిగా కోలీవుడ్లోకి అడుగుపెట్టింది. అక్కడ తాండవమ్', 'తంగ మగన్'(తెలుగులో నవమన్మదుడు) 'ఐ', 'తెరి', 'సింగ్ ఈజ్ బ్లింగ్', లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. అయితే '2.0' సినిమా తర్వాత వెండితెరకు దూరమైంది. కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి 2024లో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఫారిన్లో ఉన్న ఆమె 'మిషన్ చాప్టర్ 1', 'క్రాక్' అనే రెండు సినిమాల్లో కనిపించింది. అయితే ఇప్పుడు ఈ చిన్నది తన లైఫ్‌లో మోస్ట్ మెమరెబల్ మూమెంట్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది.
మార్చి 21న జరిగిన తన నిశ్చితార్దపు వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. "మా ప్రేమను ఇలా ప్రపంచం ముందు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది" అంటూ క్యాప్షన్‌ను జోడించింది. ఇక వాటిలో తన బాయ్‌ఫ్రెండ్ ఎడ్ వెస్ట్‌విక్‌తో కలిసి అమీ రొమాంటిక్‌గా ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ఇక అమీ లవ్‌స్టోరీ గురించి చూస్తే - అమీ జాక్సన్ 2022లో సోషల్ మీడియా వేదికగా ఎడ్ వెస్ట్‌విక్‌తో తన బంధాన్ని అఫిషియల్‌గా అనౌన్స్ చేసింది. ఆయన ఓ హాలీవుడ్ నటుడు. 'గాసిప్ గర్ల్', 'వైట్ గోల్డ్' వంటి సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. 'సన్ ఆఫ్ రాంబో', 'మీ యు మ్యాడ్నెస్' వంటి సినిమాల్లోనూ నటించారు. అయితే వెస్ట్‌విక్‌తో రిలేషన్‌షిప్‌కు ముందు అమీ 2019లో జార్జ్ పనాయోటౌ అనే యుకేకి చెందిన బిజినెస్ మ్యాన్‌తో ప్రేమబంధంలో ఉండేది. అదే ఏడాది సెప్టెంబర్‌లో ఒక బిడ్డకు తల్లి కూడా అయింది. అయితే 2021లో తామిద్దరం విడిపోతున్నట్టు ప్రకటించింది.
కాజల్ అగర్వాల్ టు అమీ జాక్సన్.. తల్లులైనా తగ్గేదే లే.. అదే అందం అదే ఫిజిక్
కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో అమీ జాక్సన్ చిల్.. అలా చేస్తున్న ఫొటోలను పోస్ట్ చేసి..