Amitabh Bachchan Sholay Movie interesting fact : పాన్ ఇండియా లెవెల్ సినిమా అంటూ ప్రస్తుతం ఏళ్ల తరబడి శ్రమించి ఒక్క మూవీని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడే కాదు అప్పట్లోనే రిలీజైన "షోలే" మూవీ కోసం కూడా చాలా ఏళ్లే తీసుకున్నారట. బహుశా అంత కష్టపడ్డారు కాబట్టే, బ్రిటీష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ 2002 టాప్ 10 ఇండియన్ ఫిల్మ్స్ ఆఫ్ ఆల్ టైం లిస్టులో నెం.1 స్థానం దక్కించుకుందీ చిత్రం. అంతేకాకుండా 2005లో ఫిల్మ్ ఫేర్ అవార్డ్ జ్యూరీ కూడా అందుకుని బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ 50 ఇయర్స్ టైటిల్ కూడా సొంతం చేసుకుంది. అలాంటి సినిమా గురించి బాలీవుడ్ బిగ్ బాస్ అమితాబ్ బచ్చన్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.
అమితాబ్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షోలే గురించి మాట్లాడారు. ఈ మూవీ డైరక్టర్ రమేశ్ సిప్పీ కేవలం ఒక్క సీన్ కోసం మూడేళ్ల సమయం తీసుకున్నారట. ఎన్ని సార్లైనా ఎన్ని రోజులైనా పర్వాలేదు, ఆ సీన్ పర్ఫెక్ట్‌గా రావాల్సిందేనని పట్టుబ్టట్టి మరీ షూట్ చేశారట. అదే బచ్చన్ దంపతులిద్దరూ కలిసి ఆ సినిమాలో చేసిన ఓ సీన్.
"అవుట్ హౌజ్‌లో కూర్చొని నేను మౌత్ ఆర్గాన్ వాయిస్తూ ఉంటాను. అక్కడే ఓ కారిడార్‌లో జయా దీపం వెలిగిస్తూ ఉంటుంది. డైరక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ దివేచా సూర్యాస్తమయంలో తీయాలనుకున్న షాట్ అది. ఆ షాట్ తీయడానికి సరైన లైటింగ్ కోసం డైరక్టర్ చాలా కాలం ఎదురుచూస్తూనే ఉన్నారు. షూట్ అయిన ప్రతిసారీ ఓకే అవుతుందేమో అని మేమంతా ఎదురుచూసే వాళ్లం. కానీ, సరిగా లేదని మళ్లీ తీయాలని సిప్పీ అనేవారు. బాగుందని మేమెంత చెప్పినా అస్సలు కన్విన్స్ అయ్యేవారు కాదు డైరక్టర్. అలా ఆ ఒక్క సీన్ కోసం కచ్చితంగా మూడేళ్లు కష్టపడ్డాం" అని అమితాబ్ బచ్చన్ చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలో ఒక్క సీన్ కోసమే కాదు ఐదు నిమిషాల సాంగ్ 'యే దోస్తీ'ని కూడా 21 రోజుల పాటు షూటింగ్ చేశారట. సినిమాలో విలన్ పాత్ర అయిన గబ్బర్ సింగ్, ఇమామ్ కొడుకును చంపే సీన్ కోసం 19 రోజుల పాటు కష్టపడ్డారట. రైలులో దొంగతనం సీన్ షూటింగ్ కోసం ఏడు వారాల సమయం పట్టిందట.
కాగా, ఆగస్టు, 15,1975లో విడుదలైన షోలే సినిమాను అప్పట్లోనే మూడు కోట్లకుపైగా బడ్జెట్ ఖర్చుచేసి నిర్మించారట. ఇందులో అమితాబ్ బచ్చన్‌తో పాటు జయా బచ్చన్, ధర్మేంద్ర, హేమ మాలిని, అమ్జద్ ఖాన్ వంటి బాలీవుడ్ ఫేమస్ నటులు చాలా మంది ముఖ్యపాత్రల్లో కనిపించారు.
ఒకప్పుడు రూ.90 కోట్ల అప్పులు! - ఇప్పుడు 'కల్కి'తో హాట్‌టాపిక్‌గా మారిన నటుడెవరంటే? - Kalki 2898 AD Movie
టాలీవుడ్ హీరో మంచి మనసు - నెలకు నాలుగున్నర లక్షల ఫుడ్ ఫ్రీగా పంచుతూ! - Tollywood Hero Free Food Delivery