ETV Bharat / entertainment

OTTలో దూసుకుపోతున్న తెలుగు హారర్ కామెడీ - రిలీజైన తొలిరోజే ట్రెండింగ్‌లోకి! - Amazon Prime OTT Telugu Movies - AMAZON PRIME OTT TELUGU MOVIES

తాజాగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ కామెడీ థ్రిల్లర్ మంచి రెస్పాన్స్​తో దూసుకెళ్తోంది. మరి వీకెండ్ వచ్చింది కదా. మీరు కూడా ఈ చిత్రాన్ని ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని చూసేయండి. పూర్తి వివరాలు స్టోరీలో.

OTTలో దూసుకుపోతున్న తెలుగు హారర్ కామెడీ - రిలీజైన తొలిరోజే ట్రెండింగ్‌లోకి!

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 13, 2024, 7:05 AM IST

Amazon Prime OTT Telugu Movies OM Bheem Bush : వీకెండ్ రావడంతో సరికొత్త సినిమా సిరీస్​లు ఓటీటీలో స్ట్రీమింగ్​కు అందుబాటులోకి వచ్చేశాయి. అలా వచ్చిన వాటిలో కొన్ని సూపర్ రెస్పాన్స్​తో అప్పుడే ట్రెండింగ్ అవ్వడం కూడా మొదలుపెట్టేశాయి. అందులో ఒకటి కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ. రీసెంట్​గా థియేటర్లలో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ మంచి ఆదరణ దక్కించుకుంటోంది. దాని పేరే ఓం భీమ్ బుష్.

బ్రోచెవారెవరురా చిత్రంతో సూపర్ హిట్ కాంబోగా పేరు తెచ్చుకున్న నటులు హీరో శ్రీ విష్ణు, కమెడియన్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. ఈ చిత్రంలో ఈ ముగ్గురు చేసే కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా నవ్వు తెప్పించింది. ఆ తర్వాత ఈ ముగ్గురు మళ్లీ కలిసి నటించిన సినిమా ఓం భీమ్ బుష్. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనేది క్యాప్షన్. ఈ చిత్రంలో కామెడీకి లైట్​గా హారర్ టచ్ ఇచ్చి బాక్సాఫీస్ ముందు మ్యాజిక్ చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

OM Bheem Bush Review : ఈ సినిమా స్లో స్లోగా మంచి వసూళ్లను కూడా సాధించింది. దీనిని హుషార్, రౌడీ బాయ్స్ ఫేమ్ దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి తెరకెక్కించారు. ఇప్పుడీ సినిమా విడుదలైన 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చి మరోసారి ఆడియెన్స్​ను ఆకట్టుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ అవ్వడం ప్రారంభించింది. విడుదలైన తొలి రోజు నుంచే ఇలా ట్రెండింగ్‌లో మంచి రెస్పాన్స్​తో దూసుకుపోతోంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ట్రెండింగ్ లిస్ట్‌లో 2వ స్థానం దక్కించుకుని మరీ పరిగెడుతోంది.

ఈ చిత్రాన్ని వి. సెల్యూలాయిడ్ బ్యానర్‌పై సునీల్, బలుసు కలిసి నిర్మించారు. యూవీ క్రియేషన్స్ సమర్పించింది. శ్రీ విష్ణు, ప్రియదర్శికి జోడీలుగా ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ నటించారు. ఇంకా శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి, ఆదిత్య మీనన్ తదితరులు కూడా ఇతర కీలక పాత్రల్లో నటించారు. హుషారు ఫేమ్ ప్రియా వడ్లమాని గెస్ట్ రోల్​లో సందడి చేసింది.

ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన 'పోకిరి' నటుడు ​సాయాజీ షిండే - పరిస్థితి ఎలా ఉందంటే? - Sayaji Shinde Hospitalized

ఫ్రైడే స్పెషల్ - OTTలోకి ఒక్కరోజే 11 ఆసక్తికర​ సినిమాలు! - This Week OTT Releases

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.