'పుష్ప పేరు చిన్నదే, కానీ సౌండ్ ఎక్కువ'
'పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్'
'పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా, ఇంటర్నేషనల్'
'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటిరా, ఫైర్ కాదు వైల్డ్ ఫైర్'
మరో వారం రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్‌ను రూల్ చేసేందుకు సిద్ధమైన పుష్పగాడి గురించి మూవీటీమ్ చెబుతున్న మాటలివి. అందుకు తగ్గట్టే సినిమా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఇదే సమయంలో సినిమాలో యాక్షన్‌తో పాటు ఆడియెన్స్‌ను ఏడిపించేసే రేంజ్లో మంచి ఎమోషనల్ డ్రామా కూడా ఉంటుందని తెలిసింది. 'తగ్గేదేలే' అన్న పుష్పగాడి యాటిట్యూడ్‌కు ఈ సారి ఎమోషనల్ రైడ్ తోడై ప్రేక్షకులను కంటతడి పెట్టించనుందట.
అప్పుడేమో యాటిట్యూడ్ - తొలి భాగంలో ఒక సాధారణ కూలీగా జీవితం ప్రారంభించిన పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదగాడో అదిరిపోయేలా చూపించారు దర్శకుడు సుకుమార్. అయితే ఈ ఎదిగే క్రమంలో పుష్ప రాజ్ ఎవరి దగ్గర తలవంచడు. ఆ కాలు నాదే, ఈ కాలు నాదే అంటూ, ఎంతటి వాడు ముందైనా కాలు మీద కాలేసి కూర్చిని యాటిట్యూడ్ చూపిస్తూ ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌కు నాయకుడు అవుతాడు. సినిమా మొత్తం తన సిగ్నేచర్‌తో యాటిట్యూడ్ చూపిస్తూ కింగ్ మేకర్ అవుతాడు.
అయితే ఈ మొదటి భాగంలో ఎమోషన్ సీన్స్ విషయానికొస్తే, తల్లికి జరిగిన అన్యాయం, ఇంటి పేరు లేని వ్యక్తిగా పుష్పను చూపిస్తూ అక్కడక్కడా ఎమోషన్ పండించారు. మొత్తంగా తొలి భాగంలో ఎమోషన్ కన్నా ఎక్కువగా యాక్షన్ పార్ట్‌కే పెద్ద పీట వేశారు.
ఇప్పుడేమో ఎమోషనల్ - అయితే ఇప్పుడు రెండో భాగం సీక్వెల్లో అలా కాకుండా యాక్షన్‌తో పాటు దీటుగా ఎమోషనల్ సీక్వెన్స్‌కు పెద్ద పీట వేశారని తెలుస్తోంది. సినిమాకు సంబంధించి వచ్చిన రివ్యూలను పరిశీలిస్తే 'పుష్ప 1' చిత్రంతో పోలిస్తే పుష్ప 2 సినిమాలో ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. ఈ సారి మదర్ సెంటిమెంట్‌తో పాటు భార్య శ్రీవల్లితో వచ్చే ఎమోషనల్ బాండింగ్ సీన్స్, సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయని ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది. సినిమా మొత్తం ఎమోషనల్ రైడ్‌గా సాగుతుందని చెబుతున్నారు.
'శ్రీవల్లి అంటే నా ప్రాణం'
'పెళ్లాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటదో ప్రపంచానికి చూపిస్తా'
అంటూ ప్రచార చిత్రంలోనూ అల్లు అర్జున్, రష్మిక పాదంపై తన సిగ్నేచర్ స్టెప్‌తో చెప్పిన తీరే అర్థమవుతోంది. అంటే సినిమాలో భార్య, మహిళల ప్రాధాన్యత కూడా చూపించినట్లు అర్థమవుతోంది.
అయితే ప్రచార చిత్రంలో గంధపు చెక్కలపై ఎవరినో కాలుస్తున్నట్టుగా ఎమోషనల్‌గా ఓ సన్నివేశాన్ని చూపించారు. ఈ సీన్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చాలా మంది శ్రీవల్లి సినిమాలో చనిపోతుందా? అనే అనుమానం అందరిలో కలుగుతోంది. మరికొంతమంది శ్రీవల్లి పుష్ప వాళ్ల అమ్మ చనిపోతుందేమో, ఆమెనే గంధపు చెక్కలపై కాల్చి ఉంటారని అనుకుంటున్నారు. మొత్తంగా సినిమా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతుందని అంతా అంటున్నారు.
రష్మిక ఏం చెబుతుందంటే? - హీరోయిన్ రష్మిక కూడా ఇదే మాట చెబుతోంది. పుష్ప 2 భావోద్వేగాల కలయిక అని అంటోంది. సినిమా హై ఆక్టేన్ యాక్షన్, స్వాగ్తో పాటు పూర్తి ఎమోషనల్ డ్రామాగా రూపొందిందని పేర్కొంది. "అందరూ ఈ సినిమాను కేవలం యాక్షన్ ఎంటర్టైనర్ అనుకుంటున్నారు. కానీ ఇది అంతకుమించి ఎమోషనల్ రైడ్. సినిమాలో ఎక్కువ భాగం ఫ్యామిలీ సెంటిమెంట్ యాంగిల్ ఉంటుంది. అదే సినిమాలో కీలకమైన అంశం. కాబట్టి మీరు పుష్ప స్వాగ్, యాక్షన్ కోసం ఎదురుచూస్తున్నట్టైతే, అందులో ఉన్న ఎమోషనల్ డ్రామా కోసం కూడా ఎదురుచూడండి" అంటూ చెప్పుకొచ్చింది. మొత్తంగా పుష్పరాజ్ - శ్రీవల్లి మధ్య ఎమోషనల్ బాండింగ్, ఇంకా ఇతర ఎమోషనల్ సీన్లు కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం ఖాయంగా కనిపిస్తోందని తెలుస్తోంది.
ఇంకా సెన్సార్ బోర్డ్ రివ్యూ ప్రకారం సినిమా జపాన్ ఎపిసోడ్‌తో 'పుష్ప 2' మొదలు అవుతుందట. సినిమాలో అరగంట సేపు జాతర ఎపిసోడ్ కేక పుట్టిస్తుందని చెబుతున్నారు. ఇక క్లైమాక్స్‌లో మాస్ అప్పీల్ థియేటర్లను షేక్ చేస్తుందని అంటున్నారు. అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్ మధ్య సీన్స్ అదిరిపోతాయని టాక్ గట్టిగా వినిపిస్తోంది.
యాక్షన్ మోడ్‌లో మోక్షజ్ఞ - కొత్త లుక్ వైరల్
డిసెంబర్‌లో అందాల భామల సినిమా జాతర - OTTలోకి రానున్న బడా చిత్రాలివే!