ETV Bharat / entertainment

బన్నీకి మాత్రమే సాధ్యమైన రికార్డులివే - అన్నింటిలోనూ నెం.1! - HAPPY BIRTHDAY ALLUARJUN - HAPPY BIRTHDAY ALLUARJUN

Allu Arjun Happy Birthday : టాలీవుడ్​లో స్టైలిష్​ ఐకాన్ అల్లు అర్జున్ నటనలోనే కాదు అవార్డులు, రికార్డుల్లోనూ ఫస్ట్ నెం.1. నేడు ఆయన 42వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సాధించిన రికార్డులు ఏంటో తెలుసుకుందాం.

Allu Arjun Birthday
Allu Arjun Birthday
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 6:37 AM IST

Updated : Apr 8, 2024, 6:52 AM IST

Allu Arjun Happy Birthday : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూత్​కు ఫ్యాషన్ ఐకాన్. హీరోల్లో డ్యాన్స్​కు కేరాఫ్​ అడ్రెస్​. అలానే తన భిన్నమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే నేడు(ఏప్రిల్ 8) ఆయన పుట్టినరోజు. 1982 ఏప్రిల్ 8న జన్మించారు. ఈయన అలనాటి హాస్య నటుడు అల్లు రామలింగయ్య మనవడు, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తనయుడు.

బాలనటుడిగా రెండు మూడు చిత్రాలు చేసిన బన్నీ ఆ తర్వాత 2002 చిరంజీవి డాడీ సినిమాలో ఓ టీనేజర్​ పాత్రలో మెరిశారు. అనంతరం 2003లో గంగోత్రి సినిమాతో హీరోగా మారారు. 2004లో వచ్చిన ఆర్య సినిమా డైరెక్టర్​గా సుకుమార్​కే కాదు బన్నీ కెరీర్​కు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆపైన హిట్, ఫ్లాప్​లతో సంబంధం లేకుండా ఆయన చేసిన ప్రతి సినిమా ఆయన్ను టాలీవుడ్ స్టార్ హీరోను చేసింది. అయితే బన్నీ స్టార్ డమ్ తెలుగుకే పరిమితం కాలేదు. మలయాళంలో కూడా బన్నీ సినిమాలు సూపర్ హిట్ అయ్యి అక్కడి అభిమానులు మల్లు అర్జున్ అని పిలుచుకునే స్థాయికి చేరింది.

అయితే ఈ 20ఏళ్ల కేరీర్​లో బన్నీ నటనతో పాటు పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్​స్టాగ్రామ్​ థ్రెడ్స్ యాప్​లో ఒక్క ఫొటో పోస్ట్​తో 1 మిలియన్ ఫాలోవర్ అందుకున్న తొలి యాక్టర్ బన్నీనే. ఇన్‌స్టాగ్రామ్ డాక్యుమెంటరీ వీడియో చేసిన మొదటి హీరో కూడా అల్లు అర్జునే కావడం విశేషం. ఇందులో పుష్ప 2 సెట్స్​తో పాటు బన్నీ లైఫ్ స్టైల్ మొత్తాన్ని చూపించారు.
యూట్యూబ్​లోనూ ఆయన సెన్సేషనల్ రికార్డ్స్ సాధించారు. బోయపాటి బన్నీ కాంబినేషన్లో వచ్చిన సరైనోడు యూట్యూబ్​లో 300 మిలియన్ల వ్యూస్​ దాటిన మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

బన్నీని పాన్ ఇండియా స్టార్​గా చేసిన పుష్ప సినిమా ఆడియో ఆల్బమ్ కూడా యూట్యూబ్​లో 5 బిలియన్ల వ్యూస్ దాటి సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఈ మార్క్ అందుకున్న మొదటి ఇండియన్ ఆల్బమ్ పుష్పనే. ఇంకా ఈ సినిమా దేశవ్యాప్తంగా బన్నీకి అభిమానులను సంపాదించిపెట్టడమే కాకుండా తెలుగు వాళ్లకు అందని ద్రాక్షగా మిగిలిపోయిన నేషనల్ అవార్డు అల్లు అర్జున్​కు తెచ్చిపెట్టింది. బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు అందుకున్న మొదటి తెలుగు యాక్టర్ బన్నీనే కావడం విశేషం.

అంతే కాదు దుబాయ్​లోని మేడమ్‌ టుస్సాడ్స్​లో మైనపు విగ్రహం ఉన్న మొదటి టాలీవుడ్ యాక్టర్, తొలి సౌత్ ఇండియన్ యాక్టర్ కూడా బన్నీనే. దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న మొదటి టాలీవుడ్ హీరో కూడా అల్లు అర్జునే. ఎంతో ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్ సిటీ గ్రాండ్ మార్షల్​లో పాల్గొన్న మొదటి టాలీవుడ్ హీరో బన్నీనే.

కాగా, అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్ట్​ 15న విడుదలకు సిద్ధం కానుంది.

'పుష్ప 2' బిగ్ అప్డేట్- బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ- టీజర్ వచ్చేది అప్పుడే - Pusha 2 Teaser

అల్లు అర్జున్ - అట్లీ మూవీలో హీరోయిన్​ ఎవరంటే? - Atlee Allu Arjun Movie

Last Updated : Apr 8, 2024, 6:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.