Alka Yagnik Rare Disease : తన గొంతుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న, పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ అల్కా యాగ్నిక్. ఇంత కాలం అభిమానులను పాటలతో అలరించిన ఆమె, తాజాగా ఓ బాధాకరమైన వార్తను పంచుకున్నారు. వైరల్ ఎటాక్ కారణంగా తనకు అరుదైన వినికిడి లోపం వచ్చినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ కఠిన సమయంలో అందరూ తమ ప్రార్థనల్లో తనకు చోటివ్వాలని కోరారు.
"కొన్ని వారాల క్రితం, నేను ఫ్లైట్ నుంచి దిగుతున్నప్పుడు, నాకు షడెన్‌గా ఏదీ వినిపించలేదు. అప్పటి నుంచి కొన్ని వారాలు జరిగిన అంశాల గురించి, ధైర్యం తెచ్చుకుని, నా స్నేహితులు, శ్రేయోభిలాషుల ముందు మౌనం వీడాలని నిర్ణయించుకున్నాను. చాలా మంది ఎందుకు యాక్టివ్‌గా లేరని అడుగుతున్నారు. వైరల్ ఎటాక్ కారణంగా అరుదైన సెన్సరీ న్యూరల్ నెర్వ్ హియరింగ్ లాస్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. నాకు తెలియకుండా, నా జీవితంలో ఇంత పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నేను సమస్యతో పోరాడుతున్నప్పుడు, అందరూ దయచేసి మీ ప్రేయర్స్‌లో నన్ను కూడా భాగం చేయండి. నా అభిమానులు, యువ సహోద్యోగులు, లౌడ్ మ్యూజిక్ వినడం, ఎక్కువ సేపు హెడ్ ఫోన్స్ యూజ్ చేయడంపై జాగ్రత్తగా ఉండండి. ఏదో ఒక రోజు, నా ఫ్రొఫెనల్ లైఫ్‌కి సంబంధించిన ఆరోగ్య ప్రమాదాలను పంచుకోవాలనుకుంటున్నాను. మీ అందరి ప్రేమ, మద్దతుతో నేను నా జీవితాన్ని పునఃపరిశీలించాలని కోరుకుంటున్నాను. త్వరలోనే మీ అందరిని కలవాలని ఆశిస్తున్నాను. ఈ క్లిష్టమైన సమయంలో మీ సపోర్ట్, అండర్‌స్టాండింగ్ నాకు చాలా అవసరం." అని అల్కా పేర్కొన్నారు.
2 వేలకుపైగా పాటలు
ఇక అల్కా యాగ్నిక్ 16 భాషల్లో 2000కు పైగా పాటలు పాడారు. బాలీవుడ్ ప్లేబ్యాక్ ఇండస్ట్రీలో మెలోడీ క్వీన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. అల్కా యాగ్నిక్, కోల్‌కతాలోని ఆకాశవాణి రేడియోలో 6 సంవత్సరాల వయస్సులో తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు. మాధురీ దీక్షిత్, అనిల్ కపూర్ నటించిన తేజాబ్ (1988)లోని ప్రముఖ పాట 'ఏక్ దో తీన్'తో ఆమె కెరీర్ మారిపోయింది. వరుస అవకాశాలతో పాపులర్ సింగర్‌గా ఎదిగారు.
అప్పుడు రూ.50 కోసం స్టేజ్షో- ఇప్పుడు పాటకు రూ.10లక్షలు- సక్సెస్ అంటే ఇది! - Neha Kakkar Career