Alia Bhatt Paris Fashion Week : బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మొదటి సారి హొయలొలికించింది. ఈ ఈవెంట్‌లో మెటాలిక్ డ్రెస్‌లో రన్‌వేపై ఫ్యాన్స్‌కు ప్లైయింగ్ కిస్‌లు ఇస్తూ స్టైల్‌గా నడిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, మొదటి సారి పారిస్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనడంపై అలియా భట్ మాట్లాడుతూ ఐశ్వర్యారాయ్ తనకు స్ఫూర్తి అని చెప్పింది.
"తన అందంతో ఈ వేదికకు మరింత కళ తెచ్చిన ఐశ్వర్య రాయ్ అంటే నాకు ఎంతో స్ఫూర్తి. సినిమాల్లోనూ ఆమె డ్యాన్స్ చూసి చాలా విషయాలను నేర్చుకున్నాను. ఆమె ఇప్పటికీ ఎంతో మందిని మంత్రముగ్దులను చేస్తున్నారు. యూట్యూబ్‌లో ఐశ్వర్యా రాయ్ సాంగ్స్ అని సెర్చ్ చేసి మరి చూస్తుంటాను. ఆమె డ్యాన్స్ మూమెంట్స్ అంటే నాకు ఎంతో ఇష్టం" అని అలియా భట్ చెప్పుకొచ్చింది.
Aishwarya Rai Paris Fashion Week : ఇకపోతే ఏ ఈవెంట్ అయినా సరే అలియా భట్ చెప్పినట్టుగానే ఐశ్వర్యా రాయ్ తన డిఫరెంట్ మోడ్రన్ డ్రెస్‌తో ఆ వేదికకే మరింత కళను తెప్పిస్తారు. అలా ఆమె అలియా భట్ పాల్గొన్న ఫ్యాషన్ వీక్‌లో రెడ్ కలర్ డ్రెస్‌లో సందడి చేశారు. ఫ్యాన్స్‌కు అభివాదం తెలుపుతూ ర్యాంప్ వాక్ చేశారు. అలా మరోసారి తన అందం, లుక్‌తో అభిమానులను ఫిదా చేశారు. ప్రస్తుతం ఐశ్వర్యా రాయ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి.
Aishwarya Rai Divorce : ఈ పారిస్ ఫ్యాషన్ వీక్‌కు కుమార్తె ఆరాధ్యతో కలిసి ఐశ్వర్యా రాయ్ హాజరైంది. ఈ సమయంలో ఐశ్వర్య కెమెరాకు పోజులిచ్చింది. వివాహం సమయంలో అభిషేక్ బచ్చన్ ఇచ్చిన ఉంగరాన్ని ధరించి ఆమె ఫ్యాషన్ వీక్‌కు హాజరైందని ఫొటోలు చూస్తే అర్థమైంది. దీంతో గత కొద్ది రోజులుగా అభిషేక్ - ఐశ్వర్యా రాయ్ విడాకులంటూ సాగుతున్న ప్రచారానికి తెరపడినట్టైంది.
Aliabhatt Upcoming Movies : అలియా భట్ ప్రస్తుతం జిగ్రా అనే సినిమాలో నటించింది. విజయదశమి సందర్భంగా ఇది విడుదల కానుంది. తన తమ్ముడిని కాపాడుకునేందుకు ఓ అక్క ఎటువంటి పోరాటం చేసింది? అనేది ఈ సినిమా కథ. ఈ మూవీ కోసం అలియా యాక్షన్ సీక్వెన్స్ కూడా చేసింది.
ఆగని 'దేవర' రికార్డులు జోరు - ఓవర్సీస్లో మరో ఘనత - NTR Devara Pre Sales Record
సత్యం సుందరం ప్రమోషన్లో 'ఖైదీ 2' అప్డేట్ - హింట్ ఇచ్చిన హీరో కార్తి - kaithi 2 Movie Update