Akira New Look : నటి రేణు దేశాయ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్‌గా ఉంటూ ఏదో ఒక పోస్ట్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూనే ఉంటుంది. ముఖ్యంగా తన పిల్లల అకీరా, ఆద్యకు సంబంధించిన విషయాలనే పంచుకుంటుంది. అదే సమయంలో ఈ ఇద్దరు పెద్దవాళ్లు అవుతుండడంతో సోషల్ మీడియాలో వారిపై ఫోకస్ మరింత ఎక్కువగా అవుతోంది. వారికి సంబంధించి ప్రతి చిన్న విషయం ఇట్టే వైరల్ అయిపోతుంది.
అలా తాజాగా అకీరాకు సంబంధించి రేణు పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడం మొదలైంది. ఇందులో అకీరా బిస్కెట్ కలర్ ప్యాంటు, ఎర్ర చొక్కా వేసుకుని ఎంతో నేచురల్‌గా సింపుల్‌గా కనిపించాడు. చెప్పులు కూడా తన తండ్రి పవన్ ధరించే లాంటివే వేసుకున్నాడు. మొత్తంగా తన తండ్రి పోలికలతో వింటేజ్ పవన్‌ను మరోసారి గుర్తుచేశాడు. అదే సమయంలో అతడు వైర్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటం మరో విశేషం. ఇప్పుడందరూ బ్లూటూత్ వినియోగిస్తుంటే అతడు మాత్రం ఓల్డ్ వైర్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కనిపించాడు. ఈ ఫొటోనే ప్రస్తుతం నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు దాన్ని తెగ షేర్ చేస్తున్నారు. అకీర పాత ట్రెండ్‌ను కొత్త ట్రెండ్‌గా మారుస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే ఈ పిక్‌ను షేర్ చేసిన నటి రేణూ తన పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో ఈ పోస్ట్ ద్వారా అర్థమయ్యేలా చేసింది. అకీరా, ఆద్యాను ఓల్డ్ వైర్ ఇయర్ ఫోన్స్ మాత్రమే వాడాలని సూచిస్తున్నాను. ఎందుకంటే బ్లూటూత్ వాడటం వల్ల మెదడు, చెవులుపై ఏదైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అకీరా స్లోగా ఫ్యాన్సీ హెడ్ ఫోన్స్‌ను వాడటం తగ్గించేసి ఈ వైర్ ఇయర్ ఫోన్స్ వాడటం నాకు సంతోషంగా ఉంది అంటూ రాసుకొచ్చింది.
కాగా, అకీరా ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ దీనిపై ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. అతడు ప్రస్తుతం మ్యూజిక్‌పై ఎక్కువ దృష్టి పెట్టాడు. అతడి ఆసక్తి కూడా దానిపైనే ఎక్కువగా ఉన్నట్లు పలుసార్లు రేణూ చెప్పుకొచ్చింది.
వరుణ్ తేజ్ - లావణ్య ప్రత్యేక పూజలు చేసింది అందుకోసమేనా?
షారుక్ ఖాన్ పాటతో నవ్వులు పూయించిన అల్లు అయాన్ - ఇప్పుడీ వీడియోనే ట్రెండింగ్!