Actor Ajith Birthday : కోలీవుడ్ స్టార్ హీరో నేడు ( మే 1)న 53 వ ఏట అడుగుపెడుతున్నారు. దీంతో అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు సెలబ్రిటీలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విషెస్ తెలుపుతున్నారు. అయితే ఆయన సతీమణి షాలినీ ఆయనకు ఓ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. అజిత్‌కు బైక్స్ అంటే ఇష్టమని తెలిసి ఆయనకు ఓ స్పెషల్ స్పోర్ట్స్ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇది చూసి ఫ్యాన్స్ 'ఈ సర్ప్రైజ్ ఎంతో స్వీట్‌గా ఉంది. కచ్చితంగా అజిత్‌కు కూడా నచ్చుంటుంది' అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో కపుల్ గోల్స్ అంటూ షాలినినీ కొనియాడుతున్నారు.
-
Shalini Mam Gifted Ducati Bike to birthday boy #Ak 😎#HBDAjithKumar #AjithKumarpic.twitter.com/SJP393pMns
— THALA AJITH (@ThalaAjith_Page) May 1, 2024
ఇక అజిత్ ఇటీవలె 'తునివు' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. తెలుగులో ఈ సినిమాను 'తెగింపు' అనే పేరుతో విడుదల చేశారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా మంచి టాక్ అందుకుని కలెక్షన్స్‌లోనూ దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆయన రెండు సినిమాల షూటింగుల్లో బిజీగా ఉన్నారు. మగిల్ తిరుమనేని డైరెక్షన్‌లో 'విడా ముయార్చి' అనే మూవీలో అజిత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రస్తుతం ఫారిన్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు. " ధైర్యానికి హద్దులు ఉండవని నిరూపించిన హీరో" అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. అందులో అజిత్ కుమార్ డూప్ లేకుండా ఓ డేంజరస్ స్టంట్ చేశారు.
ఓ ఏడారిలో షూట్ చేసిన ఆ సీన్లో అజిత్ ఎంతో సాహసోపేతంగా కారు నడిపారు. ఆ కారు కాస్త రోడ్డు పక్కునున్న ఎడారిలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇందులో అజిత్‌తో పాటు ఆరవ్ అనే మరో నటుడు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి ఆయన చిన్నపాటి గాయాలతో బయటపడ్డారని సమాచారం.
దీంతో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలోనూ ఆయన నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలె విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ అభిమానుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. మార్క్ ఆంటోనీ ఫేమ్ కోలీవుడ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
అజిత్ కార్ స్టంట్ వీడియో - క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్! - Ajith Kumar Car Stunt