Ajay Devgn Maidaan Movie Review :
చిత్రం : మైదాన్,
నటీనటులు : అజయ్ దేవగణ్, గజరాజ్ రావ్, ప్రియమణి, రుద్రనీల్ ఘోష్, చైతన్య శర్మ, దేవయాన్ష్ త్రిపాఠి, ఆయేషా వింద్రా, మీనల్ పటేల్, బహురాల్ ఇస్లాం తదితరులు;
సంగీతం : ఏఆర్ రెహమాన్;
ఎడిటింగ్ : దేవ్ రావ్ జాదవ్, షానవాజ్ మోసాని;
సినిమాటోగ్రఫీ : తుషార్ కాంతిరాయ్, ఫ్యోడర్ లియాస్;
నిర్మాతలు: బోనీ కపూర్, జీ 5 స్టూడియోస్, అరుణవ జాయ్ సేన్‌గుప్తా, ఆకాష్ చావ్లా;
దర్శకుడు: అమిత్ శర్మ;
ఒకవైపు హీరోగా మరోవైపు ఇతర సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్. రీసెంట్గా షైతాన్‌తో హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు మైదాన్ చిత్రంతో స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
కథేంటంటే : 1952 హెల్సెంకీ ఒలింపిక్స్‌లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన భారత ఫుట్‌బాల్ జట్టు, యూగోస్లేవియా చేతిలో అతి దారుణంగా పరాజయాన్ని అందుకుంటుంది. యూగోస్లేవియా ఏకంగా 10 గోల్స్ కొట్టగా సరైన బూట్లు కూడా లేని భారత ప్లేయర్లు గాయాలపాలై ఓడిపోతారు. దీంతో ఒలింపిక్స్‌లో భారత్ పరిస్థితి అంటూ పత్రికలు తీవ్రంగా విమర్శస్తాయి. అప్పుడు భారత ఫుట్‌బాల్ జట్టును ఉన్నత శిఖరాలకు కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగణ్) ఎలా తీసుకెళ్లాడు? ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు, తర్వాత టోర్న్‌మెంట్‌లో భారత జట్టు ఎలా రాణించింది? అన్నదే ఈ సినిమా కథ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎలా ఉందంటే : సయ్యద్ అబ్దుల్ రహీం ఉన్న కాలాన్ని భారత ఫుట్‌బాల్‌కు స్వర్ణయుగంగా చెబుతుంటారు. హైదరాబాదీ అయిన ఆయన జీవిత చరిత్రకు భావోద్వేగాలు జోడించి తెరపై అద్భుతంగా చూపించారు. పోయిన చోటే వెతుక్కోవాలనే అంశాన్ని బలంగా చూపించారు. ఫస్టాఫ్‌లో ఎక్కువగా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఎలా పని చేస్తుంది?సయ్యద్ మట్టిలో మాణిక్యాల్లాంటి ఆటగాళ్లను ఎలా వెతికి తీశాడు సహా తదితర సన్నివేశాలతో తీర్చిదిద్దాడు దర్శకుడు. అయితే ఈ సీన్స్ అన్నీ నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుడి సహనానికి కాస్త పరీక్ష పెడతాయి. సెకండాఫ్‌లో కథ కొత్త టర్న్ తీసుకుంటుంది. ఫుట్‌బాల్ టీమ్ రెడీ అయ్యాక ఆట పరంగా వాళ్లను సిద్ధం చేయడం, అందుకోసం సయ్యద్ వాళ్లకు శిక్షణ ఇవ్వడం వంటివి చూపిస్తూనే మరోవైపు సయ్యద్ వ్యక్తిగత జీవితాన్ని కూడా చూపించారు. ఈ క్రమంలో ఆటగాళ్లను ఉద్దేశిస్తూ సయ్యద్ ఇచ్చే ఎమోషనల్ స్పీచ్‌లు ఎమోషనల్‌గా సాగుతాయి. అలాగే ఒక్కో మ్యాచ్ గెలుస్తూ భారత ఆటగాళ్లు దూసుకెళ్తున్నప్పుడు గూస్ బంప్స్ వస్తుంది. క్లైమాక్స్ సీన్స్ కన్నీళ్లు వచ్చేలా చేస్తాయి.
ఎవరెలా చేశారంటే ? ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రలో అజయ్ దేవగణ్ అద్భుతంగా నటించారు. గజరాజ్ రావు, ప్రియమణి తదితరులు కూడా తమ పరిధి మేరకు నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం ఎమోషనల్ సీన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. సంగీతం ద్వారానే ప్రేక్షకులు సీన్స్‌లో లీనమైపోతారు. కథ, కథనాలను క్లుప్తంగా చెప్పేందుకు దర్శకుడు అమిత్‌శర్మ రిస్క్ తీసుకున్నారనే చెప్పాలి. సాంకేతిక బృందం పనితీరు అద్భుతం. ఫైనల్‌గా మూవీ ఒక కోర్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా.
'నేనుంటే టాలీవుడ్ స్టార్ హీరోస్‌ను ఎవ్వరూ పట్టించుకోరు' - Priyamani on Star Heroes
'పెళ్లి కన్నా ముందు సహజీవనం చేయండి' - యూత్‌కు స్టార్ నటి సలహా! - Zeenat Aman