ETV Bharat / entertainment

రూ.15 చీరలో షాకిచ్చిన అదా శర్మ - ఇప్పుడిదే ఫుల్ ట్రెండింగ్​! - Adah sharma 15rs Saree - ADAH SHARMA 15RS SAREE

Adah Sharma 15 Rupees Saree : అదా శర్మ తాజాగా తాను ధరించిన ఓ సింపుల్ చీర ధర చెప్పి అందరినీ షాక్​కు గురి చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో ఫుల్ ట్రెండ్ అవుతోంది. దాని గురించే ఈ కథనం.

రూ.15 చీరలో షాకిచ్చిన అదా శర్మ - ఇప్పుడిదే ఫుల్ ట్రెండింగ్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 3, 2024, 1:03 PM IST

Adah Sharma 15 Rupees Saree : అదా శర్మ ఈ పేరు చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. నితిన్ హార్ట్​ అటాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇప్పటికే పలు తెలుగు చిత్రాల్లో నటించి తన గ్లామర్​తో ఆకట్టుకుంది. కానీ చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. దీంతో తన ఫోకస్​ను బాలీవుడ్​కు షిప్ట్ చేసి అక్కడే కొనసాగుతోంది. లేడి ఓరియెంటెడ్ లేదా తన పాత్రకు ప్రాధాన్యత ఉండే సినిమా, సిరీస్​లు చేస్తూ కెరీర్​లో ముందుకెళ్తోంది. ఆ మధ్య కేరళ స్టోరీస్ సినిమాలో సెన్సేషనల్ అయింది.

అయితే హీరోయిన్లు అన్నాక డిఫరెంట్​ మోడ్రన్​ కాస్ట్యూమ్స్​లో దర్శనమివ్వడం కామన్. ఒక్కోసారి ట్రెడిషనల్​, మరోసారి మోడ్రన్​ డ్రెస్సులో కనువిందు చేస్తుంటారు. అందరి కళ్లు తమవైపే ఉండేలా డ్రెస్టింగ్​ స్టైల్​తో కనిపిస్తుంటారు. టాప్​ టు బాటమ్ హెయిర్ క్లిప్ నుంచి వాచ్​, హ్యాండ్ బ్యాగ్స్​, చెప్పులు ఇలా​ అన్నీ స్టైలిష్​గానూ బాగా కాస్ట్లీగానూ ఉండేలా చూసుకుంటారు. అవి మనకు షాక్ కలిగించేలా ఉంటాయి.

అలానే అదా శర్మ కూడా ఎప్పుడూ అదే విధంగా కనిపిస్తుంటుంది. గ్లామర్ ఒలకబోస్తూ ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం ఒక సింపుల్ చీరలో కనిపించి ఆకట్టుకుంది. దీంతో పాటే దాని ధర చెప్పి భారీ షాకింగ్​కు గురి చేసింది. ఆమె లైట్​ ఆరెంజ్ కలర్ చీరలో ట్రెండీ బ్లౌజ్ ధరించి ఎంతో క్యూట్​గా మెరిసింది.

ఆమె అలా ఆ చీరలో క్యూట్​గా కనపడగానే కెమెరాలన్నీ తనవైపే తిరిగి క్లిక్ మనిపించాయి. అలానే ఆమె కూడా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ క్రమంలోనే తాను వచ్చిన పని మీద లోపలికి వెళ్తున్న సమయంలో ఓ కెమెరా మెన్​ మీ చీర ధర ఎంత అని అడిగారు.

దానికి ఆమె చెప్పిన చీర ధర విని షాకవ్వడం మిగతావారి పనైంది. ఎందుకంటే ఆ చీర ధర కేవలం 15 రూపాయలేనంట. నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజమని అదా శర్మ చెప్పింది. ఈ రోజుల్లో ఆ ధరకు చాక్లెట్ తప్ప ఇంకేమీ రావడం లేదు. మరి అలాంటిది ఏకంగా చీరను ఎలా కొనుగోలు చేసిందని అంతా స్టన్ అయ్యారు. దీంతో అసలు విషయాన్ని చెప్పింది అదా శర్మ. అది తన నానమ్మది అని చెప్పింది. ఆ రోజుల్లో ఆమె రూ.15కు కొన్నారట. ఇప్పుడా చీరకే బ్లౌజ్​ను ట్రెండీగా మార్చి ధరించింది అదా శర్మ. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతోంది.

లక్ష బీర్ బాటిళ్లతో స్పెషల్ సెట్​ - భారీ రిస్క్ చేస్తున్న మెగాస్టార్! - Viswambara Shooting

వీళ్లంతా బ్యాక్ గ్రౌండ్​తో​ కాదు టాలెంట్​తో! - Telugu Heroes Without Background

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.