Adah Sharma Sunflower Series : చిన్న బడ్జెట్ సినిమాలు కూడా 2023లో భారీ వసూళ్లు కలెక్ట్ చేసి దూసుకెళ్లాయి. అందులో కేరళ స్టోరీ ఒకటి. ఎన్నో కాంట్రవర్సీలతో, కోర్టు కేసులతో ఇలా పలు అడ్డంకులు దాటుకుని ఈ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంది. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డుకెక్కింది. ఎటువంటి స్టార్ నటులు లేకుండానే ఇంతటి భారీ వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించిన నటి అదాశర్మకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. తన నటనతో ఆమె క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు పొందింది. అయితే ఈ అమ్మడు ఈ సినిమా తర్వాత బస్తర్ అనే సినిమాలోనూ నటించింది. దీంతో పాటుగా సన్‌ఫ్లవర్ అనే సిరీస్‌లోనూ కీలక పాత్ర పోషించింది. అయితే ఈ వెబ్‌సిరీస్‌లో అదా ఓ బార్ డ్యాన్సర్‌గా కనిపించింది. ఈ నేపథ్యంలో ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. తన పాత్రలో నేచురల్‌గా కనిపించేందుకు డ్యాన్స్ బార్లో కొద్ది రోజుల పాటు గడిపిందట.
"చూసేవాళ్ల కళ్లకు వాస్తవంగానే అనిపించాలి. కరెక్ట్ పర్‌ఫామ్ చేయకపోతే నిల్చొన్నా, కూర్చొన్నా అందులో సహజత్వం కనిపించదు. ఇవన్నీ గమనించేందుకు బార్లోనే గడిపాను. అక్కడ కస్టమర్లతో మాట్లాడి కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకూ వెళ్తూ ఉండేదాన్ని. రాత్రి 9 గంటలకు వెళ్లి ఉదయం 4 - 5 వరకూ అక్కడే ఉండేదాన్ని" అని అదా శర్మ వెల్లడించింది.
ఇక అదా శర్మ కెరీర్ విషయానికి వస్తే, స్కూల్ పూర్తి కాగానే సినిమా ఇండస్ట్రీకి వచ్చేసింది అదా. విక్రమ్‌భట్ తెరకెక్కించిన '1920' సినిమాలో నటించినప్పుడు ఆమె వయస్సు 16 సంవత్సరాలే. ఇది బాక్సాఫీసు వద్ద సూపర్ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, హిందీలలో నటించింది.
'ఫిర్', 'హసీ తో ఫసీ', 'బై పాస్' రోడ్ సినిమాలు పెద్దగా టాక్ అందుకోలేకపోయింది. అయితే ఆమె సపోర్టింగ్ రోల్లో నటించిన 'కమాండో 2' మాత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. 2023లో వచ్చిన 'ది కేరళ స్టోరీ' కూడా మంచి సక్సెస్ సాధించింది. దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
రూ.15 చీరలో షాకిచ్చిన అదా శర్మ - ఇప్పుడిదే ఫుల్ ట్రెండింగ్! - Adah sharma 15rs Saree