ETV Bharat / entertainment

ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌లో సాయి ప‌ల్ల‌వి రేర్​ ఫీట్​! - Saipallavi Filmfare Awards - SAIPALLAVI FILMFARE AWARDS

Saipallavi Filmfare Awards : సాయి పల్లవి తాజాగా 68వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్స్​లో రెండు పురస్కారాలను దక్కించుకుంది. తద్వారా ఓ ఘనతను అందుకుంది. పూర్తి వివరాలు స్టోరీలో

source ETV Bharat
Sai pallavi (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 6:23 PM IST

Saipallavi Filmfare Awards : మ‌ల‌యాళీ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లామర్‌ పాత్రల కన్నా గ్రామర్‌ పాత్రలనే ఎంపిక చేసుకుంటూ పాత్రలకు ప్రాణం పోసింది. మలయాళంలో మాత్రమే కాదు తెలుగు, త‌మిళంలోనూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్​ను సంపాదించుకుంది.

ప్రేమమ్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు హృదయాలను దోచిన ఈమె ఆ త‌ర్వాత తెలుగులో ఫిదాలో భానుమ‌తిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం ల‌వ్ స్టోరీ, గార్గీ, విరాట‌ప‌ర్వం, శ్యామ్ సింగ‌రాయ్ వంటి చిత్రాలతో ఆడియెన్స్​కు మరింత చేరువైంది. అయితే తాజాగా ఈ భామ ఫిలింఫేర్ అవార్డ్స్‌లో ఓ అరుదైన ఘ‌న‌త‌ను అందుకుంది. ఏకంగా ఆరు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకుని రికార్డుకెక్కింది.

తాజాగా సౌత్ ఫిలిం ఇండ‌స్ట్రీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ 2023ను ప్రకటించారు. 68వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల జాబితాను గురువారం నిర్వాహకులు ప్రకటించారు. ఇందులో సాయి ప‌ల్లవి కూడా అవార్డును దక్కించుకుంది. గార్గి చిత్రానికి తమిళంలో ఉత్తమ నటిగా, విరాటప‌ర్వం సినిమాకు తెలుగులో క్రిటిక్స్‌ విభాగంలో ఉత్తమ నటిగా రెండు భాషల్లోనూ పురస్కారాలను దక్కించుకుంది. దీంతో సౌత్‌ ఇండియాలో అతి తక్కువ కాలంలోనే ఆరు సార్లు ఫిలింఫేర్‌ అవార్డు దక్కించుకున్న హీరోయిన్​గా సాయి ప‌ల్ల‌వి నిలిచింది.

ఇప్పటి వరకు సాయి ప‌ల్లవి అవార్డులు అందుకున్న సినిమాలు ఇవే

ప్రేమ‌మ్ సినిమా – ఉత్త‌మ న‌టి (డెబ్యూ)

ఫిదా – ఉత్త‌మ న‌టి

ల‌వ్ స్టోరీ – ఉత్త‌మ న‌టి

శ్యామ్​ సింగ‌రాయ్ – ఉత్త‌మ న‌టి (క్రిటిక్స్)

గార్గి – ఉత్త‌మ న‌టి

విరాట‌ప‌ర్వం – ఉత్త‌మ న‌టి (క్రిటిక్స్)

SaiPallavi Upcoming Movies : ఇక సాయి పల్లవి ప్రస్తుత సినిమాల విషయానికొస్తే నాగచైతన్యతో కలిసి తండేల్ చిత్రంలో నటిస్తోంది. హిందీలో మరో రెండు సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్​ కొడుకు డెబ్యూ మూవీతో పాటు రణ్​బీర్ కపూర్​తో రామాయణ్ సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. త్వరలోనే రిలీజ్ కానున్నాయి.

పవర్‌ లిస్ట్‌ యాక్టర్స్​లో ప్రభాస్​, రామ్​చరణ్​, అల్లు అర్జున్​ - జాబితాలో ఇంకెవరున్నారంటే? - POWER LIST ACTORS

అనంత్-రాధిక వెడ్డింగ్​లో హీరో యశ్​ కొత్త లుక్​ - సోషల్ మీడియా షేక్​! - KGF Yash Stylish Look

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.