ETV Bharat / entertainment

బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్ల లాస్ అయినా ఆ​ ​ హీరోతో రూ. 600 కోట్ల మూవీ​ - ప్రభాస్ అప్​కమింగ్ మూవీస్

Actor Who Gave Indias Two Biggest Flops : సినిమా ఇండస్ట్రీలో జయాపజయాలనేవి సర్వసాధారణం. ఫలితాలతో సంబంధం లేకుండా పలువురు స్టార్స్ తమ తదుపరి సిినిమాలను మాసివ్​ బ్లాక్​బస్టర్లు చేసి చూపిస్తుంటారు. ఇలానే ఓ స్టార్ హీరో తన రెండు సినిమాలతో ఆడియెన్స్​ను నిరాశపరచగా, ఇప్పుడు తన ట్యాలెంట్​తో రూ. 600 కోట్ల మూవీలో భాగమయ్యారు. ఇంతకీ ఆ నటుడు ఎవరు? ఏ సినిమాలో నటిస్తున్నారంటే ?

Actor Who Gave Indias Two Biggest Flops
Actor Who Gave Indias Two Biggest Flops
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 6:15 PM IST

Updated : Feb 16, 2024, 6:37 PM IST

Actor Who Gave Indias Two Biggest Flops : ఓ స్టార్ హీరో సినిమా విడుదల అవుతుందంటే ఇక ఫ్యాన్స్ దానిపై భారీ అంచనాలే పెట్టుకుంటారు. ఫస్ట్ గ్లింప్స్ దగ్గర నుంచి థియేట్రికల్ ట్రైలర్ వచ్చే వరకు ప్రతి అప్​డేట్​ కోసం ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఇక సినిమా రిలీజైందంటే ఇక ఆ రోజు థియేటర్లంతా సందడి సందడిగా ఉంటుంది. ఫ్యాన్స్ అంతలా సినిమాలను ఆదిస్తారు. అయితే కొన్ని సార్లు భారీ అంచనాలతో వచ్చే ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంటుంటాయి. చేసింది స్టార్ హీరోనే అయినా కూడా ఒక్కోసారి సినిమాలోని మిగతా అంశాలు కూడా దాని రిజల్ట్​పై ఎఫెక్ట్ చూపిస్తుంటుంది.

ఈ నేపథ్యంలో హీరోలు కూడా తమ తదుపరి సినిమాల విషయంలో వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయినప్పటికీ ఆ తర్వాతి సినిమాలు కూడా కొన్ని సార్లు ఆడియెన్స్​ను నిరాశపరిచిన సందర్భాలు ఉన్నాయి. వరుస హిట్లు అందుకున్న అదే హీరో వరుస డిజాస్టర్లతో డీలా పడిపోతుంటారు. అయితే ఆ నటుడికి ఉన్న స్టార్​డమ్​, అతడిపై ఉన్న నమ్మకం పలువురి మేకర్స్​ను తమ సినిమాలకు సైన్ చేసేలా చేస్తాయి. ఇదే కోవకు చెందిన ఓ నటుడు ఇటీవలే తన సినిమాలతో దాదాపు రూ.400 కోట్లు నష్టాన్ని అందుకున్నారు. అయినప్పటికీ ఆయన్ను నమ్మి రూ.600 కోట్ల భారీ బడ్జెట్​ను చేస్తున్నారు నిర్మాతలు. ఇంతకీ ఎవరా హీరో, ఏంటా సినిమా అంటే?

ఆ స్టార్ హీరో ఎవరో కాదు మన రెబల్​ స్టార్​, డార్లింగ్​ ప్రభాస్​. 'బాహుబలి' సినిమాలతో మాసివ్ సక్సెస్​ అందుకున్న ఈ స్టార్ హీరో ఆ తర్వాత విడుదలైన సినిమాలతో బాక్సాఫీస్​ వద్ద మిశ్రమ ఫలితాలు అందుకున్నారు. భారీ అంచనాల మధ్య వచ్చిన 'సాహో', 'ఆదిపురుష్​' సినిమాలు ఆడియెన్స్​ను నిరాశపరిచాయి. 'సాహో' సినిమాకు రూ.170కోట్ల నష్టం వాటిల్లగా, ఆ తర్వాత వచ్చిన 'ఆదిపురుష్'​కు రూ.230 కోట్ల మేర లాస్​ వచ్చిందని ట్రేడ్ వర్గాల మాట. అలా రెండు చిత్రాలు కలిపి దాదాపు రూ.400 కోట్లు మేర మేకర్స్ నష్టపోయారట​.

అయితే ఈ రెండు సినిమాల తర్వాత స్టార్​ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‎ తెరకెక్కించిన సలార్ సినిమాలో నటించారు. ఈ సినిమా సూపర్​ హిట్​ టాక్​ సాధించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్ల కలెక్షన్లు కూడా అందుకుంది. ఈ సినిమాతో ప్రభాస్ మళ్లీ మునుపటిలా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు.

ఇక 'సలార్​' సినిమా తర్వాత ప్రభాస్​ ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్​గా తెరకెక్కనున్న 'శౌర్యంగ పర్వం'లో నటిస్తున్నారు. దీంతో పాటు మారుతి డైరెక్షన్​లో 'రాజాసాబ్', నాగ్ అశ్విన్ 'కల్కి 2898 AD' సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. దాదాపు ఈ సినిమా రూ.600 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కనుంది.

ఈ టాలీవుడ్ డైరెక్టర్ల సతీమణులను ఎప్పుడైనా చూశారా ?

పదికి తొమ్మిది పాయింట్లు- IMDB టాప్ మూవీలు/సీరియల్స్ ఇవే!

Last Updated : Feb 16, 2024, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.