ETV Bharat / entertainment

ఐశ్వర్యారాయ్ దగ్గరున్న 5 లగ్జరీ కార్లు, ఖరీదైన వస్తువులు ఇవే- ఈమె ఆస్తి ఎన్ని కోట్లంటే? - Aishwarya Rai Net Worth - AISHWARYA RAI NET WORTH

Aishwarya Rai Net Worth: యాభై ఏళ్ల వయసులోనూ అత్యంత పారితోషికం అందుకుంటున్న నటి ఐశ్వర్యా రాయ్‌. అయితే ఈమె తన భర్త అభిషేక్ బచ్చన్​ నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు ఈ మధ్య జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె లగ్జరీ లైఫ్​, నెట్​ వర్త్ వంటి వివరాలను తెలుసుకుందాం.

source Associated Press
Aishwarya Rai Net Worth (source Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 8:43 PM IST

Aishwarya Rai Net Worth: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది మూవీ లవర్స్‌కు ఇప్పటికీ అందమంటే ముందుగా గుర్తొచ్చేది ఐశ్వర్యా రాయే. తన అందం, అభినయంతో వెండితెరపై వెలిగిపోయిన ఈ భామ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇటు దక్షిణాదిలో, అటు బాలీవుడ్‌లో రాణించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. అలానే కెరీర్‌లో ఎన్నో సక్సెస్‌లతో పాటు బానే ఆర్జించింది. అత్యంత ధనవంతులైన హీరోయిన్ల లిస్టులోనూ చోటు సంపాదించుకుంది.

1973 నవంబర్ 1న కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన ఐశ్వర్యా రాయ్ 1994లో మిస్ వరల్డ్ టైటిల్‌ గెలుచుకుంది. ఇది ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. అప్పటి నుంచి ఎన్నో వరుస సినీ అవకాశాలను అందుకుంటూ కెరీర్​లో దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే 2007లో బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకుంది. ఈ జంటకు కుమార్తె ఆరాధ్య బచ్చన్ జన్మించింది. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కోడలిగా మూవీ ఇండస్ట్రీలో ప్రముఖ వ్యక్తిగా తన స్థాయిను మరింత పెంచుకుంది. అయితే ఇప్పుడీ జంట విడిపోబోతున్నట్లు ఈ మధ్య జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.

దుబాయ్‌లో విలాసవంతమైన ఇల్లు - ఐశ్వర్యా రాయ్ బచ్చన్ పేరిట లగ్జరీ హౌస్‌లు ఉన్నాయని ఇంగ్లీష్ మీడియాల్లో కథనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ముంబయిలోని ప్రముఖ జూహు ఏరియాలోని అమితాబ్‌ బచ్చన్‌ ఇల్లు జల్సాలో ఉంటోందట. ఈ ఇంట్లో రాజసం ఉట్టిపడే గ్రాండ్ ఇంటీరియర్స్ ఎంతో ఆకట్టుకుంటాయి. ఇంకా ఆమెకు దుబాయ్‌లోని శాంక్చురీ ఫాల్స్, జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్‌లో అద్భుతమైన విల్లా ఉంది. దీన్ని ఆమె రూ.15 కోట్లకు కొనుగోలు చేసినట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.

ఈ ఇంట్లో ఇన్‌-హౌస్‌ జిమ్‌, స్విమ్మింగ్ పూల్, ఇతర విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయట. స్కావోలిని డిజైన్డ్ కిచెన్‌ కూడా ఉందట.ఇకపోతే ఐశ్వర్య రాయ్ బచ్చన్ 2015లో ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో రూ.21 కోట్లతో 5BHK బంగ్లాను కొనుగోలు చేసింది. ఈ ఇల్లు 5,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుతం దీని విలువ రూ.50 కోట్లు ఉండవచ్చని అంచనా.

ఐశ్వర్యా రాయ్‌ నెట్‌ వర్త్‌ ఎంత? - ఐశ్వర్యా రాయ్ బచ్చన్ వ్యాపారవేత్త కూడా. అంబీ, పాజిబుల్ వంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ఇంకా వివిధ ఇన్వెస్ట్‌మెంట్స్‌, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం అందుకుంటున్నట్లు కొన్ని రిపోర్ట్స్‌ చెబుతున్నాయి. ఆమె నెట్‌ వర్త్‌ ఏకంగా రూ.800 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

లగ్జరీ కార్లు - ఐశ్వర్యా రాయ్ వద్ద రోల్స్ రాయిస్ ఘోస్ట్ (రూ.6.95 కోట్లు), ఆడి ఎ8ఎల్ (రూ.1.34 కోట్లు), మెర్సిడెస్-బెంజ్ ఎస్ 500 (రూ.1.98 కోట్లు), మెర్సిడెస్ బెంజ్ ఎస్ 350 డి కూపే (రూ.1.60 కోట్లు ), లెక్సస్‌ ఎల్ఎక్స్‌ 570 (రూ.2.84 కోట్లు) వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.

ఖరీదైన వస్తువులు - ఐశ్వర్య వద్ద ఉన్న అత్యంత విలువైన వస్తువుల్లో గోల్డెన్ శారీ ఒకచి. నీతా లుల్లా డిజైన్‌ చేసిన ఈ చీరలో గోల్డ్ థ్రెడింగ్, స్వరోవ్స్కి క్రిస్టల్ వర్క్స్ ఉన్నాయి. ఈ చీర ధర దాదాపు రూ.75 లక్షలు. ఇంకా ఆమె దగ్గర రూ.2.2 లక్షల విలువైన డయోరాడిక్ట్ లాంబ్స్కిన్ స్లింగ్ బ్యాగ్ ఉందట. ఆమె కలెక్షన్‌లో ఇతర ఖరీదైన బ్యాగ్‌లు కూడా ఉన్నాయి.

సినిమా కెరీర్‌ - ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌కు ఇప్పుడు 50 ఏళ్లు. అయినా ఇప్పటికీ ఆమె స్టార్‌ హీరోయిన్స్‌లో ఒకరిగా కొనసాగుతున్నారు. అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు. ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల వరకు అందుకుంటుందని సమాచారం. ఆమె చివరిసారిగా 'పొన్నియిన్ సెల్వన్-1, 'పొన్నియిన్ సెల్వన్-2లో నటించింది.

జాన్వీ కపూర్ ప్రియుడు ఏం చేస్తాడో తెలుసా? - అతడి ఆస్తి ఎన్ని కోట్లంటే? - Janhvi Kapoor Boyfriend

పుట్టబోయే బిడ్డ కోసం దీపికా పదుకొణె కీలక నిర్ణయం! - ఫ్యాన్స్ ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.