96th Oscar Awards ceremony Live Streaming : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఆస్కార్ ఒకటి. నామినేటెడ్ సభ్యులే కాకుండా అభిమానులు కూడా దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఏడాది అకాడమీ అవార్డులు మరికొద్ది గంటల్లో ప్రకటించబోతున్నారు. ఇవి మార్చి 11 (ఆదివారం) తెల్లవారుఝామున లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ప్రకటిస్తారు. అయితే మీరు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని భారతదేశంలో ప్రత్యక్షంగా చూడాలనుకుంటే ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం.
భారీ భద్రత : ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ నేపథ్యంలో పెద్ద వేదికలపై నిరసనలు తెలుపుతున్నారు. అటువంటి పరిస్థితిలో, ఆస్కార్ వేడుకపై ఎటువంటి ప్రభావం లేకుండా ఉండే విధంగా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కట్టుదిట్టమైన పోలీసు నిఘాను ఏర్పాటు చేశారు. దాదాపు 2 వేల మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఇక్కడ భద్రతను పర్యవేక్షించనున్నారు.
భారతదేశంలో ఆస్కార్ లైవ్‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
భారతదేశంలో మార్చి 11 తెల్లవారుఝామున 4 గంటల నుంచి ఆస్కార్ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఇది OTT ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ హెచ్‌డీ, స్టార్ వరల్డ్‌లో కూడా ఈ ఆస్కార్ అవార్డ్ వేడుకలను ప్రత్యక్షప్రసారం ద్వారా చూడొచ్చు. ఈ ఏడాది ఆస్కార్ ప్రెజెంటర్లలో ఏ భారతీయ స్టార్ పేరును చేర్చలేదు. అయితే చివరిసారి హీరోయిన్ దీపికా పదుకొణే మనదేశం తరపున ప్రజెంట్ చేసింది. ఇంతకు ముందు ప్రియాంక చోప్రా కూడా ఈ బాధ్యతలను అందుకుంది. ఈసారి జాబితాలో నికోలస్ కేజ్, అల్ పాసినో, జెండయా, సామ్ రాక్‌వెల్, బాడ్ బన్నీ, డ్వేన్ జాన్సన్, క్రిస్ హేమ్స్‌వర్త్, జెన్నిఫర్ లారెన్స్, ఎమిలీ బ్లంట్, అరియానా గ్రాండే, టిమ్ రాబిన్స్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ వంటి పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి.
భారత్ నుంచి ఏ చిత్రమంటే? ఈసారి కిలియన్ మర్ఫీ చిత్రం 'ఓపెన్‌హైమర్' అత్యధికంగా 13 నామినేషన్లను అందుకుంది. ప్రముఖ సినీ నిర్మాత క్రిస్టోఫర్ నోలన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దీంతో పాటు 'బార్బీ', 'పూర్‌థింగ్స్', 'కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్' సహా పలు చిత్రాలు ఆస్కార్ కు పోటీ పడుతున్నాయి. భారత్ నుంచి పోటీలో టు కిల్ ఏ టైగర్ ఉంది. ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఈ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అయింది.
-
The countdown to the 96th #Oscars is on! Here's everything you need to know. https://t.co/rbhvApBcj6
— The Academy (@TheAcademy) March 5, 2024
ఆస్కార్ 2024: బరిలో పది చిత్రాలు- అయినా ఆ సినిమాకే ఛాన్స్ ఎక్కువ!