ETV Bharat / entertainment

90's వెబ్​సిరీస్​ డైరెక్టర్​కు మూవీ ఆఫర్స్- ఆ స్టార్ హీరోతో సినిమా కన్ఫార్మ్! - మిడిల్ క్లాస్ వెబ్​సిరీస్ ఓటీటీ

90s Middle Class Biopic Director Movie Offers: 90's ఏ మిడిల్​క్లాస్ బయోపిక్ వెబ్​సిరీస్​తో సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ఆదిత్యకు సినిమా ఛాన్స్​లు తలుపుతడుతున్నాయట. రీసెంట్​గా ఆయనకు రెండు బ్యానర్స్​లో సినిమా అవకాశాలు వచ్చినట్లు తెలుస్తోంది.

90s Middle Class Biopic Director Movie Offers

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 9:36 AM IST

Updated : Jan 28, 2024, 10:05 AM IST

90s Middle Class Biopic Director Movie Offers: 90's ఏ మిడిల్​క్లాస్ బయోపిక్ వెబ్​సిరీస్​తో లైమ్​లైట్​లోకి వచ్చారు డైరెక్టర్ ఆదిత్య హాసన్. మధ్య తరగతి కుటుంబ నేపథ్యంలో రూపొందిన ఈ వెబ్​సిరీస్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకొని సూపర్​హిట్​గా నిలిచింది. దీంతో డైరెక్టర్ ఆదిత్యకు సినిమా ఛాన్స్​లు క్యూ కడుతున్నాయి. తాజాగా రెండు సినిమా అవకాశాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఆదిత్య హాసన్ హీరో నితిన్​ లీడ్ రోల్​లో ఓ సినిమా తెరకెక్కించనున్నారి టాక్. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్​టైనర్​గా ఉండనుందట. ఈ ప్రాజెక్ట్​ కోసం కథ రెడీ చేసుకోమని నితిన్​, డైరెక్టర్ ఆదిత్యను సూచించినట్లు తెలిసింది. ఇక ఈ సినిమా నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ఠ్​ మూవీస్ పతాకంపై రూపొందనుంది. అయితే డైరెక్టర్​ ఆదిత్య కూడా ఇదే పనిలో బిజీగా ఉన్నారట. స్ట్ర్కిప్ట్​ వర్స్డ్​ పూర్తి చేసుకొని ప్రాజెక్ట్​ను త్వరలోనే పట్టాలెక్కించే పనిలోని ఉన్నట్లు సమాచారం.

ఇక ప్రముఖ నిర్మాత నాగ వంశీ కూడా ఆదిత్యతో సినిమాకు సై అన్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్ట్ సితారా ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్​పై రూపొందనుంది. అయితే ఈ సినిమా నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కానీ, ఆదిత్య ముందుగా నితిన్ సినిమా కంప్లీట్ చేశాక నాగవంశీ ప్రాజెక్ట్​ స్టార్ట్ కానుందట. మరోవైపు 90's ఏ మిడిల్​క్లాస్ బయోపిక్​కు కూడా సీక్వెల్ ఉంటుందని ప్రమోషన్స్​ సమయంలో మేకర్స్ తెలిపారు. మరి ఈ సీక్వెల్​కు ఆదిత్య దర్శకత్వం వహిస్తారా? లేదా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

90's A Middle Class Web Series ETV WIN: ఈ వెబ్​సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ ఈటీవీ విన్​లో స్ట్రీమింగ్ అవుతోంది. అద్భుతమై రెస్పాన్స్​ అందుకున్న ఈ సిరీస్​ ఇప్పటికే 120+ మిలియన్ మిలిట్స్ వ్యూస్​తో దూసుకుపోతోంది. ఇందులో టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజి లీడ్​ రోల్​లో నటించగా వాసుకీ ఆనంద్ సాయి, మౌళి, వాసంతిక, రోహన్ రాయ్, స్నేహల్ తదితరులు ఆయా పాత్రలు పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'కు విశేష స్పందన- 'ETV WIN​'లో రికార్డ్స్ బ్రేక్!

ETV WIN బంపర్ ఆఫర్- బ్లాక్ బస్టర్​ హిట్​ '90s మిడిల్ క్లాస్' ఫ్రీగా చూడండిలా

Last Updated : Jan 28, 2024, 10:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.