ETV Bharat / entertainment

'ప్రేక్షకులు అందించిన ప్రేమకు ధన్యవాదాలు' - నేషనల్ అవార్డ్​ విన్నర్స్ రియాక్షన్స్ ఇవే - 70TH NATIONAL FILM AWARDS

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 16, 2024, 7:15 PM IST

70th National Film Awards Winners Reactions : 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం తాజాగా ప్రకటించింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకుగానూ ఈ అవార్డులను ప్రకటించారు. అయితే ఇందులో విజేతలుగా నిలిచిన పలువురు సెలబ్రిటీలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ వారేమన్నారంటే?

70th National Film Awards
70th National Film Awards (Getty Images)

70th National Film Awards Winners Reactions : 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం తాజాగా ప్రకటించింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకుగానూ ఈ అవార్డులను ప్రకటించారు. అయితే ఇందులో విజేతలుగా నిలిచిన పలువురు సెలబ్రిటీలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ వారేమన్నారంటే?

కన్నడ సంస్కృతికి వేడుక
చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది కన్నడ చిత్రం 'కాంతార' ఇప్పటికే పలు ప్రశంసలు, అవార్డులు అందుకున్న ఈ చిత్రం తాజాగా ప్రకటించిన నేషనల్ అవార్డ్స్​లో బెస్ట్ పాపులర్ కన్నడ ఫిల్మ్​, అలాగే బెస్ట్ యాక్టర్ (రిషబ్ శెట్టి) పురస్కరాలకు ఎంపికైంది. ఈ ఆనందాన్ని మూవీ టీమ్​ తాజాగా మీడియాతో పంచుకుంది.

'కాంతార' సినిమాకుగానూ నేషనల్ అవార్డు అందుకోవడం మాకు ఎంతో గర్వం, అలాగే గౌరవప్రదం. ఈ గుర్తింపు మా మొత్తం టీమ్​ హార్డ్​వర్క్ అలాగే డెడికేషన్​కు నిదర్శనమే కాకుండా కన్నడ సంస్కృతికి వేడుక లాంటింది. మాకు 'కాంతార' ఓ సినిమా కంటే ఎక్కువ. లోతుగా పాతుకుపోయిన సాంస్కృతిక అంశాలను తెరపైకి తీసుకురావడమే మా లక్ష్యం. ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ గుర్తింపు కోసం మేము కేంద్రానికి అలాగే, జ్యూరీకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము" అంటూ 'కాంతర' విజయ్‌ కిర్‌గందూర్‌, చలువే గౌడ పేర్కొన్నారు.

ఇది నా కష్టానికి ఫలితం
'ఉంఛాయి' చిత్రానికి గానూ బెస్ట్​ సపోర్టింగ్ యాక్ట్రెస్​గా బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్త తాజాగా నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. అయితే ఆమె ఇదివరకే 1994లో 'వో చోక్రి' అనే సినిమాకుగానూ ఉత్తమ సహాయ నటిగా గెలుపొందారు. ఈ విషయంపై నీనా ఆనందం వ్యక్తం చేశారు.

"నాకు ఈ అవార్డు వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను. గతంలో నాకు రెండు జాతీయ అవార్డులు ('బజార్ సీతారాం', 'వో చోక్రి') వచ్చాయి. ఇప్పుడు మరో చాలా సంవత్సరాల తర్వాత మరో నేషనల్ అవార్డు లభించింది. ఇది నాకు చాలా పెద్ద విషయం.కష్టపడి పనిచేయడమే నా మంత్రం. మీరు గొప్పగా పెర్ఫామ్​ చేసినప్పటికీ కొన్నిసార్లు మీకు అవార్డు రాని సందర్భాలు ఉన్నాయి, కానీ చివరికి మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ఇది నా కష్టానికి ఫలితం. " అంటూ నీనా గుప్త పేర్కొన్నారు.

రెండెకలు చేసేందుకు కృషి చేస్తాను
ఇక నాన్-ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 'ఫుర్సత్​ ' అనే షార్ట్​ఫిల్మ్​కు గానూ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్​గా పురస్కారం అందుకోనున్నారు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్. ఇప్పటి వరకూ ఆయన 'హైదర్', 'ఇష్కియా', 'తల్వార్', 'ది బ్లూ అంబ్రెల్లా' ​​వంటి చిత్రాలకు సంగీతం, అలాగే బెస్ట్​ స్క్రీన్ ప్లే విభాగాలలో 8 జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. ఇప్పుడు ఈ 9వ అవార్డు గురించి తాజాగా ఆయన స్పందించారు.

"ఇప్పుడే 'ఫుర్సత్'కి నేషనల్ అవార్డు వచ్చిందని విన్నాను. నా 9వ జాతీయ అవార్డును పొందడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన దేశంలోనే అతిపెద్ద, ముఖ్యమైన అవార్డును గెలవడం నా పనికి గొప్ప ధ్రువీకరణగా భావిస్తున్నాను. ఈ అవార్డు ప్రకటించినందుకు జ్యూరీకి నా ధన్యవాదాలు. ఇక దీన్ని రెండెకలు చేసేందుకు నేను కృష్టి చేయాలి" అంటూ భరద్వాజ్ అన్నారు.

ప్రేక్షకులు అందించిన ప్రేమకు ధన్యవాదాలు
'బ్రహ్మాస్త్ర పార్ట్ 1: శివ' సినిమాలోని 'కేసరియా' సాంగ్​కు బెస్ట్​ మ్యూజిక్ డైరెక్టర్​గా అవార్డు గెలుచుకున్నందుకు మ్యూజిక్ కంపోజర్ ప్రీతమ్ ఆనందం వ్యక్తం చేశారు. తనను ఎంపిక చేస జ్యూరీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ మూవీ టీమ్​తో పాటు సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అలాగే ప్రేక్షకులు అందించిన ప్రేమకు ధన్యవాదాలు" అని ప్రీతమ్ అన్నారు.

ఆ డైరెక్టర్ దెబ్బకు సినిమాలే వద్దనుకున్నారు - ఇప్పుడేమో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు - Best Actor Rishab Shetty

జాతీయ అవార్డుకు ఎంపికైన 'ఆట్టం' సినిమా ప్రత్యేకత ఇదే - ఏ ఓటీటీలో చూడొచ్చంటే? - Aattam Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.