69 Filmfare Awards South 2024: 69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ -2024 ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. టాలీవుడ్ స్టార్ హీరో సందీప్ కిషన్ ఈ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. సందీప్‌తోపాటు ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ కూడా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో పలువురు
ఈ ఉత్సవంలో రాశీఖన్నా, అపర్ణ బాలమురళీ, సానియా ఇయాపాన్, గాయత్రీ భరద్వాజ్ ప్రదర్శనతోపాటు పలువురు హీరోయిన్లు ఉత్సాహంగా డ్యాన్స్‌లతో ఉర్రూతలూగించారు. నామినేషన్స్ జాబితాలో ఉన్న వారిలో విజేతలను ప్రకటిస్తున్న సమయంలో వేడుక మొత్తం విజిల్స్ చప్పట్లతో మార్మోగిపోయింది.
బలగం, దసరాకు అవార్డుల పంట: చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న 'బలగం' ఉత్తమ చిత్రంగా నిలవడమే కాకుండా, ఉత్తమ దర్శకుడిగా వేణు అవార్డు అందుకున్నారు. ఇక 'దసరా'లో నటనకుగానూ నాని, కీర్తి సురేష్ ఉత్తమ నటీనటులుగా ఎంపికయ్యారు. ఉత్తమ పరిచయ దర్శకుడి అవార్డును ఇద్దరు అందుకున్నారు. శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్న) ఇద్దరి సినిమాల్లోనూ నాని కథానాయకుడిగా నటించడం మరో విశేషం. 'బేబీ' చిత్రానికి కూడా వివిధ విభాగాల్లో అవార్డులు లభించాయి.
Congratulations!
— Filmfare (@filmfare) August 3, 2024
The Filmfare Award for Best Actor In A Leading Role (Male) - Telugu goes to #Nani for #Dasara at the #69thSOBHAFilmfareAwardsSouth2024 with Kamar Film Factory. @SobhaLtd @KamarFilmfactry @KajariaCeramic pic.twitter.com/NPcRAbTCsT
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో తెలుగు విజేతలు
- ఉత్తమ చిత్రం: బలగం
- ఉత్తమ నటుడు: నాని (దసరా)
- ఉత్తమ నటి: కీర్తి సురేష్ (దసరా)
- ఉత్తమ దర్శకుడు: వేణు యెల్దండి (బలగం)
- ఉత్తమ పరిచయ దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్‌నాన్న)
- ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): సాయి రాజేష్ (బేబీ)
- ఉత్తమ నటి (క్రిటిక్స్): వైష్ణవి చైతన్య (బేబీ)
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నవీన్ పొలిశెట్టి (మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి), ప్రకాశ్‌రాజ్ (రంగమార్తాండ)
- ఉత్తమ సహాయ నటుడు: రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)
- ఉత్తమ సహాయ నటి: రూప లక్ష్మీ (బలగం)
- ఉత్తమ గాయకుడు: శ్రీరామచంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా, బేబీ)
- ఉత్తమ గాయని: శ్వేత మోహన్ (మాస్టారు.. మాస్టారు, సార్)
- ఉత్తమ గేయ సాహిత్యం: అనంత్ శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా, బేబీ)
- ఉత్తమ సంగీతం: విజయ్ బుల్గానిన్ (బేబీ)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: సత్యన్ సూరన్ (దసరా)
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కొల్లా అవినాష్ (దసరా)
- ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్ (ధూమ్ ధామ్ దోస్తానా, దసరా)
Nani Speech About Shouryuv And Srikanth At FilmFare Awards Event ❤️
— Nanii!! (@narasimha_chow2) August 3, 2024
Aa excitement and proud feeling speech lone ardham aypothondhi 😭❤️ pic.twitter.com/P9FjoQwjMY
'సోషల్ మీడియాలో ఆ కల్చర్ ఉంటుంది - వాటిని నేను పట్టించుకోను' - Janhvi Kapoor Trolls