ETV Bharat / entertainment

రూట్ మార్చిన టాలీవుడ్ స్టార్స్​ - ఈసారి సమ్మర్​లో మరింత కొత్తగా! - Pushpa 2 Devara Movie

2024 Tollywood Summer Movies : సమ్మర్​ బాక్సాఫీస్ సీజన్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏప్రిల్‌ మొదలుకొని రెండు నెలలకుపైగా సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అవుతుంటాయి. వాటి రికార్డుల కబుర్లే ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ ఇప్పుడలా పరిస్థితి కనపడట్లేదు. రిలీజ్​లు కన్నా ఎక్కువగా కొత్త చిత్రాల ప్రారంభాలకు సంబంధించిన ముచ్చట్లే వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్, రామ్​ చరణ్​, ఎన్టీఆర్​ సహా చాలా మంది స్టార్ హీరోలు కమ కొత్త చిత్రాల్ని వేసవిలోనే మొదలు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.

రూట్ మార్చిన టాలీవుడ్ స్టార్స్​ - ఈసారి సమ్మర్​లో మరింత కొత్తగా!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 8:23 AM IST

2024 Tollywood Summer Movies : 2024 సమ్మర్ బాక్సాఫీస్ ముందు ప్రభాస్​ కల్కి, విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌ సినిమాలు రానున్నాయి. అంటే గతేడాదిలానే ఈ సారి కూడా సమ్మర్​ ఒకట్రెండు సినిమాలతోనే సరిపెట్టుకోనుంది. అయితే ఈ సారి స్టార్ హీరోల కొత్త చిత్రాలు ప్రారంభం కానున్నాయి.

గుంటూరు కారంతో పలకరించిన మహేశ్ బాబు - రాజమౌళితో(Rajamouli Mahesh Babu Movie) సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటికే విదేశాలకు వెళ్లి ప్రత్యేకమైన శారీరక శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ వేసవి నుంచే మహేశ్‌బాబు మూవీటీమ్​తో కలిసి రంగంలోకి దిగనున్నారట. పలువురు హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులు కూడా ఈ మూవీ కోసం పని చేయనున్నట్టు సమాచారం.

ప్రభాస్‌ కల్కి(Prabhas Kalki Movie) వేసవిలో రిలీజ్ కానుంది. సమ్మర్​లో సలార్‌ 2 షూటింగ్ కోసం ఆయన కాల్షీట్లు కేటాయించినట్టు తెలిసింది. ఇంకా రాజాసాబ్‌ షూటింగ్ కూడా ఈ ఏడాదే పూర్తి చేయనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Ramcharan Buchi babu Movie : రామ్‌చరణ్‌ - బుచ్చిబాబు సానా కాంబో సినిమా కూడా మే నెల నుంచే మొదలు కానున్నట్టు తెలిసింది.. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం చరణ్‌ ఇప్పటికే సన్నద్ధమవుతున్నట్టు సమాచారం అందుతోంది. ఆయన గేమ్‌ ఛేంజర్‌ మూవీని కూడా పూర్తి చేయనున్నారు.

Pushpa 2, Devara Movie : పుష్ప 2, దేవర సినిమాలతో బిజీగా ఉన్న అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లు కూడా ఈ సమ్మర్ నుంచే కొత్త చిత్రాల్ని సెట్స్​పైకి తీసుకెళ్లాలని ముందుగా సన్నాహాలు చేశారు. అయితే దేవర ఆలస్యం, పుష్ప 2 ఆగస్ట్​లో రిలీజ్ అవ్వడం వల్ల ఈ సమ్మర్​లో తారక్​, బన్నీ ఈ రెండు చిత్రాలతోనే గడిపేస్తారు. అయితే ఎన్టీఆర్​ వార్‌ 2తో పాటు ప్రశాంత్‌ నీల్​తో చేయాల్సిన సినిమా గురించి వేసవిలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. అల్లు అర్జున్​ - త్రివిక్రమ్‌ సినిమాపై కూడా ఈ సమ్మర్​లోనే స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.

మరోవైపు సీనియర్‌ హీరోస్​ చిరంజీవి విశ్వంభరతో(Chiranjeevi Viswambhara movie), వెంకటేశ్‌ - అనిల్‌ రావిపూడితో చేయబోతున్న సినిమాతో బిజీ కానున్నారు. శర్వానంద్‌, అఖిల్‌, రానా దగ్గుబాటితో పాటు పలువురు యంగ్ హీరోస్​ కూడా తమ కొత్త చిత్రాల్ని సమ్మర్​లోనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

వాలంటైన్స్​ డే : అనుపమ టు మృణాల్ ఠాకూర్ - ఈ ముద్దుగుమ్మల ప్రేమ కథలు తెలుసా?

'అలా అని మీకు ఎవరు చెప్పారు?'-నెటిజన్​పై రష్మిక ఫైర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.