ETV Bharat / entertainment

సెకెండాఫ్​పైనే ఆశలు - బీటౌన్​లో ఫస్ట్​హాఫ్​ ఎలా సాగిందంటే? - 2024 Bollywood Movies

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 7:30 AM IST

2024 Bollywood Movies : ఈ ఏడాది ఫస్ట్​హాఫ్​ బాలీవుడ్​కు అంత అచ్చి రాలేదనే చెప్పాలి. భారీ బడ్జెట్​తో రిలీజైన పలు సినిమాలు కూడా బాక్సాఫీస్​ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. దీంతో సెకెండాఫ్​పైనే ఆశలు పెట్టుకున్నారు బీటౌన్​ ప్రేక్షకులు. మరీ సెకెండాఫ్​లో రిలీజవ్వనున్న సినిమాలేంటో ఓ లుక్కేద్దామా

2024 Bollywood Movies
2024 Bollywood Movies (Getty Images)

2024 Bollywood Movies : ఈ ఏడాది బాలీవుడ్​లో ఎన్నో సినిమాలు రిలీజయ్యాయి. అయితే అవన్నీ అంతంతమాత్రంగానే టాక్ సంపాదించుకున్నాయి. భారీ బడ్జెట్​తో తెరకెక్కి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న చిత్రాలకు కూడా నిరాశ తప్పలేదు. మరికొన్నేమో మంచి టాక్ వచ్చినప్పటికీ వసూళ్ల విషయంలో ఆశించినంత సాధించలేకపోయాయి.

ముఖ్యంగా ఈ ఏడాది ఫస్ట్​హాఫ్​లో 70 చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. అయితే అవేవి అంచనాలకు మించినవి కావని అభిమానులు అంటున్నారు. దీంతో ఈ ఏడాది జూన్‌ వరకూ హిందీ సినిమాలు వసూళ్లు చేసింది రూ.1331 కోట్లు మాత్రమే అని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ లెక్కన ఆల్‌-ఇండియా బాక్సాఫీసులో బాలీవుడ్‌ కేవలం 34 శాతం వాటాతోనే సరిపెట్టుకుంది. ఇది గత ఏళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని అంటున్నారు విశ్లేషకులు.

స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన 'చందు ఛాంపియన్‌' తొలి రోజు రూ.5 కోట్లను పొంది, అభిమానులను నిరాశపరిచింది. యాక్షన్ బ్యాక్​డ్రాప్​లో రూపొందిన 'బడే మియా ఛోటే మియా' బాక్సాఫీసును మెప్పించలేకపోయింది. బయోపిక్స్​ జానర్​లో వచ్చిన 'మైదాన్‌', 'శ్రీకాంత్‌' మూవీస్​ కూడా కలెక్షన్ల విషయంలో అంతంతమాత్రంగానే అందుకున్నాయి. హృతిక్‌ రోషన్, సిద్ధార్థ్‌ మల్హోత్రా నటించిన 'ఫైటర్‌', 'యోధ' కూడా టార్గెట్ ఆడియెన్స్​ను ఆకట్టుకోలేకపోయింది. అజయ్‌ దేవగణ్‌ 'షైతాన్‌' కూడా మంచి ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ మునపటిలా మారాలంటే వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని క్రిటిక్స్ సూచిస్తున్నారు.

ఇక సెకెండాఫ్​లో 'ఔరో మే కహా దమ్‌ థా', 'ఖేల్‌ ఖేల్‌ మే', 'సింగమ్‌ అగైన్‌', 'స్కై ఫోర్స్‌', 'సితారే జమీన్‌ పర్‌' లాంటి టాప్ చిత్రాలు విడుదలకు sసిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు పాన్‌ ఇండియా లెవెల్​లో 'పుష్ప 2', 'దేవర', 'కంగువా', 'వేట్టయాన్‌','తంగలాన్‌', 'ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌', 'డెడ్‌ఫూల్‌ వర్సెస్‌ వొల్వేరిన్‌' చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. చూడాలి ఈ సెకెండాఫ్​ అయినా బాలీవుడ్​కు పూర్వ వైభవం తెస్తుందో లేదో ?

OTTలోకి 9 మంది స్టార్​ హీరోలు కలిసి నటించిన సిరీస్​!- స్ట్రీమింగ్ ఎందులో అంటే? - Manorathangal OTT

షారుక్ సినిమాలో విలన్​గా జూనియర్ అశ్వత్థామ - కన్ఫామ్ చేసిన అమితాబ్​ - Sharukh Suhana Khan Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.