ETV Bharat / business

ఎక్కువ మైలేజ్ ఇచ్చే టూ-వీలర్ కొనాలా? రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్​-9 బైక్స్ & స్కూటీస్ ఇవే! - Best Two Wheelers Under 1 Lakh - BEST TWO WHEELERS UNDER 1 LAKH

Best Two Wheelers Under 1 Lakh : మీరు కొత్త టూ-వీలర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీ బడ్జెట్ కేవలం రూ.1 లక్ష మాత్రమేనా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో చాలా బైక్స్​, స్కూటర్స్​ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మంచి ఫీచర్స్, స్పెసిఫికేషన్స్​ ఉండి, ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్​-9 మోడల్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

BIKES
two wheelers (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2024, 12:35 PM IST

Best Two Wheelers Under 1 Lakh : భారతదేశంలో టూ-వీలర్స్​కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు లేటెస్ట్ ఫీచర్స్​, స్పెసిఫికేషన్స్​తో, అదిరిపోయే డిజైన్స్​తో బైక్​లను, స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేసుకుని, ఎక్కువ మైలేజ్ ఇచ్చే టూ-వీలర్స్​ను తెస్తున్నాయి. అందుకే ఈ ఆర్టికల్​లో రూ.1 లక్ష బడ్జెట్లో లభిస్తున్న టాప్​-9 బైక్స్​ & స్కూటర్స్​ గురించి తెలుసుకుందాం.

1. TVS Jupiter 110 : టీవీఎస్ జూపిటర్ 110​ ఇటీవలే భారత మార్కెట్లో లాంఛ్ అయ్యింది. త్వరలోనే దీని డెలివరీ స్టార్ట్ అవుతుందని కంపెనీ స్పష్టం చేసింది. తక్కువ ధరలో మంచి స్కూటీ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ స్కూటర్​ 4 వేరియంట్లలో, 6 రంగుల్లో లభిస్తుంది.

ఈ టీవీఎస్​ జూపిటర్​లో 113.33 సీసీ బీఎస్​6 ఇంజిన్​ ఉంటుంది. ఇది 7.91 బీహెచ్​పీ పవర్​, 9.8 ఎన్​ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. దీనిలో ఫ్రంట్​ సైజ్ డిస్క్​ బ్రేక్​లు, వెనుక వైపు డ్రమ్ బ్రేక్​లు ఉంటాయి. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.1 లీటర్లు.

TVS Jupiter 110 Price : మార్కెట్లో ఈ టీవీఎస్ జూపిటర్​ 110 స్కూటీ ధర రూ.77,092 నుంచి రూ.89,834 (ఎక్స్​-షోరూం) ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది.

2. TVS Raider 125 : ఈ టీవీఎస్ రైడర్​ 125 బైక్​ 4 వేరియంట్లలో, 11 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైక్​లో 124.8 సీసీ బీఎస్​6 ఇంజిన్ ఉంటుంది. ఇది 11.2 బీహెచ్​పీ పవర్​, 11.2 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ మోటార్​ 5-స్పీడ్​ ట్రాన్స్​మిషన్​ అనుసంధానంతో పనిచేస్తుంది. ముందువైపు డిస్క్ బ్రేక్​లు, వెనుక వైపు డ్రమ్ బ్రేక్​లు ఉంటాయి. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు. ఈ బైక్​ 56.7 కి.మీ/లీటర్ మైలేజ్ ఇస్తుంది.

TVS Raider 125 : మార్కెట్లో ఈ టీవీఎస్ రైడర్​ 125 బైక్ ధర సుమారుగా రూ.97,066 నుంచి రూ.1,07,414 (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

3. Bajaj Freedom : తక్కువ బడ్జెట్లో మంచి బైక్ కొనాలని అనుకునేవారికి బజాజ్ ఫ్రీడమ్ మంచి ఛాయిస్ అవుతుంది. ఇది 3 వేరియంట్లలో, 7 రంగుల్లో లభిస్తుంది. ఈ బైక్​లో 125 సీసీ బీఎస్​6 ఇంజిన్ ఉంది. ఇది 9.3 బీహెచ్​పీ పవర్​, 9.7 ఎన్​ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది కంబైన్డ్​ బ్రేకింగ్​ సిస్టమ్​తో వస్తుంది. ఈ సీఎన్​జీ బైక్​ మైలేజ్​ 90 కి.మీ/ లీటర్​.

Bajaj Freedom Price : మార్కెట్లో ఈ బజాజ్​ ఫ్రీడమ్ బైక్ ధర సుమారుగా రూ.95,055 నుంచి రూ.1,10,055 (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

4. Hero Xtreme 125 R : హీరో కంపెనీ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ బైక్​లలో ఎక్స్​ట్రీమ్​ 125 ఆర్​ ఒకటి. ఈ బైక్ 2 వేరియంట్లలో, 3 అందమైన రంగుల్లో లభిస్తుంది. దీనిని ప్రధానంగా యువతను ఆకట్టుకునేందుకు యూత్​ఫుల్​ స్టైలింగ్​తో రూపొందించారు.

ఈ హీరో ఎక్స్​ట్రీమ్​ 125 ఆర్​ బైక్​లో 124.7 సీసీ బీఎస్​6 ఇంజిన్ ఉంటుంది. ఇది 11.4 బీహెచ్​పీ పవర్​, 10.5 ఎన్​ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది యాంటీ-లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్​తో పనిచేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు. దీని మైలేజ్​ 66 కి.మీ/ లీటర్​.

Hero Xtreme 125 R Price : మార్కెట్లో ఈ హీరో ఎక్స్​ట్రీమ్ 125 ఆర్ బైక్​ ధర సుమారుగా రూ.97,484 నుంచి రూ.1,02,870 వరకు ఉంటుంది.

5. Suzuki Burgman Street 125 : తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటీ కొనాలని అనుకునేవారికి ఈ సుజుకి బర్గ్​మాన్​ స్ట్రీట్​ 125 మంచి ఆప్షన్ అవుతుంది. ఇది 3 వేరియంట్లలో, 14 రంగుల్లో లభిస్తుంది. ఈ స్కూటీలో 124 సీసీ బీఎస్​6 ఇంజిన్ ఉంటుంది. ఇది 8.48 బీహెచ్​పీ పవర్​, 10 ఎన్​ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.5 లీటర్స్​. దీనిపై లీటర్ పెట్రోల్​తో 58.5 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.

Suzuki Burgman Street 125 Price : మార్కెట్లో ఈ సుజుకి బర్గ్​మాన్​ స్ట్రీట్​ 125 ధర సుమారుగా రూ.96,824 నుంచి రూ.1,17,209 (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

6. Honda SP 125 : ఇండియాలోని మోస్ట్ పాపులర్ బైక్​ల్లో హోండా ఎస్​పీ 125 ఒకటి. దీనిలో 124 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 10.72 బీహెచ్​పీ పవర్​, 10.9 ఎన్​ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. దీని మైలేజ్​ 65 కి.మీ/ లీటర్​. ఈ బైక్ 3 వేరియంట్లలో, 7 రంగుల్లో లభిస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 11.2 లీటర్లు. ఈ బైక్​ 65 కి.మీ/ లీటర్ మైలేజ్ ఇస్తుంది.

Honda SP 125 Price : మార్కెట్లో ఈ హోండా ఎస్​పీ 125 ధర సుమారుగా రూ.87,383 నుంచి రూ.91,498 (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

7. Honda Shine : తక్కువ ధరలో మంచి బైక్​ కొనాలని అనుకునేవారికి హోండా షైన్ మంచి ఎంపిక అవుతుంది. ఇది 2 వేరియంట్లలో, 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైక్​లో 123.94 సీసీ బీఎస్​6 ఇంజిన్​ ఉంటుంది. ఇది 10.59 బీహెచ్​పీ పవర్​, 11 ఎన్​ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. దీనిలో 10.5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్​పై లీటర్​ పెట్రోల్​తో 55 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.

Honda Shine Price : మార్కెట్లో ఈ హోండా షైన్ ధర సుమారుగా రూ.81,119 నుంచి రూ.85,119 (ఎక్స్​-షోరూం) వరకు ఉంటుంది.

8. OLA S1 X : ఇండియాలోని మోస్ట్ పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో 'ఓలా ఎస్​1 ఎక్స్' ఒకటి. ఇది 4 వేరియంట్లలో, 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్​తో పనిచేస్తుంది. ఈ ఓలా ఎస్​1 ఎక్స్ బేస్ మోడల్​లో 2కిలోవాట్స్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ యూనిట్ ఉంటుంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేయడానికి 5 గంటలు పడుతుంది. ఈ స్కూటీపై గరిష్ఠంగా గంటకు 85 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. దీని రైడింగ్ రేంజ్​ 95 కి.మీ.

OLA S1 X Price : మార్కెట్లో ఈ ఓలా స్కూటీ ధర సుమారుగా రూ.84,999 నుంచి రూ.1,07,994 (ఎక్స్​-షోరూం) వరకు ఉంటుంది.

9. Honda Activa 125 : ఇంటిల్లపాదికీ ఉపయోగపడే బెస్ట్ స్కూటర్ హోండా యాక్టివా 125. దీనికి ఇండియాలో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ స్కూటర్​లో 124 సీసీ ఇంజిన్ ఉంటుంది. దీని మైలేజ్​ 46 కి.మీ/ లీటర్​. ఈ స్కూటీ 4 వేరియంట్లలో, 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Honda Activa 125 Price : మార్కెట్లో ఈ హోండా యాక్టివా 125 స్కూటర్ ధర సుమారుగా రూ.82,570 నుంచి రూ.91,751 (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

రూ.2లక్షల్లో మంచి టూ-వీలర్​ కొనాలా? త్వరలో లాంఛ్ కానున్న టాప్-10 మోడల్స్ ఇవే! - Upcoming Bikes Under 2 Lakh

మహిళా ఉద్యోగులకు, కాలేజ్ అమ్మాయిలకు ఉపయోగపడే టాప్-10 స్కూటీస్ ఇవే! - Best Scooters Or College Students

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.