ETV Bharat / state

మహిళ ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ - నాగార్జున సాగర్​ కెనాల్​లో పడి చివరకు? - Woman Fell into Canal Taking Selfie

Woman Selfi Fell into Nagarjuna Sagar Canal : నాగార్జున సాగర్​ ఎడమ కాల్వ వద్ద సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు మహిళ కాల్వలో పడిపోయింది. అదృష్టవశాత్తు ఆమెను స్థానికులు స్పందించి తాళ్ల సాయంతో రక్షించడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండల కేంద్రంలో జరిగింది.

Woman Selfi Fell into Canal
Woman Selfi Fell into Canal (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2024, 3:37 PM IST

Updated : Aug 30, 2024, 3:47 PM IST

A Woman Fell into a Canal while Taking Selfie : సెల్ఫీ సరదా మహిళ ప్రాణం మీదకు తీసుకువచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహారానికి వెళ్లింది. ఈ క్రమంలో ఒక ప్రాంతంలో సెల్ఫీ వీడియో తీసుకోవాలని అంతా కారు నుంచి కిందకు దిగారు. మహిళ సెల్ఫీ వీడియో తీస్తూ ప్రమాదవశాత్తు కాలుజారి కాల్వలో పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను రక్షించారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని నాగార్జున సాగర్​ ఎడమ కాల్వ వద్ద జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల్లోకి వెళితే, హైదరాబాద్​ నుంచి కారులో మిర్యాలగూడ వైపు ఓ కుటుంబం కారులో వెళుతుంది. వారు ఉన్నట్టుండి వేములపల్లి సాగర్​ ఎడమ కాల్వ వద్ద వాహనాన్ని ఆపారు. అప్పుడు ఆ ప్రకృతి అందాలను చూసి ముచ్చటపడి ఒక సెల్ఫీ తీసుకోవాలనుకున్నారు. దీంతో భర్త, ఆమె, తమ్ముడు, కుమార్తెలతో కలిసి సెల్ఫీ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అనుకొని సంఘటన ఎదురైంది. సెల్ఫీ దిగుతుండగా ఆ మహిళ ప్రమాదవశాత్తు జారిపడి సాగర్​ కాల్వలో పడిపోయింది.

ఆమెకు కొద్దిగా ఈత రావడంతో అలా కొంత దూరం వరకు కెనాల్​లో ఈదుకుంటూ నీటిపై తేలియాడుతూ వెళ్లింది. ఈ క్రమంలో మహిళను గమనించిన స్థానికులు సాగర్​ ఎడమ కాల్వ బ్రిడ్జిపై నుంచి తాళ్ల సహాయంతో రక్షించాలని అనుకున్నారు. తాళ్లను కాల్వలో వేసి ఆమెను పైకి లాగే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. తిరిగి కాల్వలో పడిపోయింది. దీంతో కొంతమంది యువకులు అందులోకి దూకి మహిళను కాపాడడానికి తీవ్రంగా శ్రమించారు.

40 నిమిషాలు కష్టపడి ప్రాణాలు రక్షించారు : సుమారు 40 నిమిషాల పాటు కష్టపడి తాళ్ల సాయంతో మహిళను ప్రాణాలతో యువకులు ఒడ్డుకు చేర్చారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా కొంచెం సేపు ఉంటే ప్రాణాలే పోయేవని స్థానికులు చెప్పుకున్నారు. చూడండి సెల్ఫీ సరదా ప్రాణాల మీదకు తీసుకువచ్చిందంటూ స్థానికులు వారిని గట్టిగా మందలించారు. ఆ తర్వాత వారు కారెక్కి వెళ్లిపోయారు. ఇంకా ఇందుకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. అందుకే అనవసరంగా సెల్ఫీలు ఎక్కడిపడితే అక్కడ తీసుకోవద్దని, వాటిని తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఇలాంటి సెల్ఫీ మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని కాల్వల దగ్గర జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Young Man Suicide Selfi Video Viral : సిగరెట్టు డబ్బా దొంగతనం చేశాడని యువకుడిపై ఆరోపణలు.. మనస్థాపం చెంది ఆత్మహత్య

SELFIE SUICIDE: సరదాగా మొదలుపెడితే.. వ్యసనమై ప్రాణం తీసింది..

Last Updated : Aug 30, 2024, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.