12th Fail Hero National Award : హిందీతో పాటు రిలీజైన అన్ని భాషల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన '12th ఫెయిల్' మూవీ ఇప్పటికే ఎన్నో అవార్డులను, రికార్డులను సొంతం చేసుకుంది. ఇందులో భాగంగానే ఈ సినిమా జాతీయ అవార్డుల బరిలోనూ నిలిచింది. కానీ ఇందులో హీరో విక్రాంత్ మస్సేకు జాతీయ అవార్డు వస్తుందంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు తెగ ట్రెండ్ అయ్యాయి. అయితే ఈ విషయంపై హీరో విక్రాంత్ స్పందించారు.
"మా సినిమా నేషనల్ అవార్డుల నామినేషన్స్‌లో ఎంపికవ్వడం మా టీమ్‌కు ఎంతో సంతోషానిచ్చింది. ఇప్పటి వరకు ఈ చిత్రం ఎన్నో ప్రశంసలు కూడా అందుకుంది. ఎన్నో గొప్ప వేదికల్లోనూ ఈ సినిమా గురించి ప్రస్తావించారు. నా యాక్టింగ్ కూడా మంచి గుర్తింపు లభించింది. అందుకు నేను ఎంతో ఆనందంగానూ ఉన్నాను. అయితే నాకు జాతీయ అవార్డు వస్తుందంటూ రూమర్స్ వచ్చినట్లు తెలుసుకున్నాను. ఈ సిినిమాలో నటించేందుకు నేను ఎంతో కష్టపడ్డాను. అయితే ఈ ఏడాది ఎన్నో అద్భుతమైన సినిమాలు ఆడియెన్స్‌ను అలరించాయి. 'ది గోట్ లైఫ్', 'ఆవేశం' లాంటి సినిమాల్లో స్టార్‌ల నటన అద్భుతం. వారి సరసన ఉండటాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. నేషనల్ అవార్డు వస్తుందా రాదా అన్న దానిగురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయం కాదు" అని విక్రాంత్ అన్నారు.
స్టోరీ ఏంటంటే ?
ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా అనురాగ్ పాఠక్ రాసిన పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం రూపొందింది. మధ్యప్రదేశ్‌లోని చంబల్‌లోయ ప్రాంతమైన మౌర్యానాకు చెందిన మనోజ్ కుమార్ శర్మ ( విక్రాంత్ మాస్సే)ది నిరుపేద కుటుంబం. తినడానికి సరిగా తిండి లేని పరిస్థితి. మనోజ్ తండ్రి పనిలో నిజాయతీగా ఉన్నాడన్న కారణం వల్ల సస్పెండ్ అవుతాడు. చదువులో మనోజ్ టాపర్ ఏమీ కాదు. పైగా పరీక్షల్లో కాపీ కొట్టమని అతడి పాఠశాల ప్రిన్సిపలే ఎంకరేజ్ చేస్తారు. ఈ విషయం డీఎస్పీ దుష్యంత్ (ప్రియాన్షు ఛటర్జీ)కి తెలియడం వల్ల ఆ పాఠశాల ప్రిన్సిపల్‌ను పట్టుకుని, జైలుకు పంపుతాడు. అందరూ నిజాయతీగా ఉండాలని విద్యార్థులకు చెబుతారు. సగటు విద్యార్థి అయిన మనోజ్ 12వ తరగతి ఫెయిల్ అవుతాడు. డీఎస్పీ దుష్యంత్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని మనోజ్ ఏం చేశాడు? 12th ఫెయిల్ అయినా సివిల్స్ వైపు అతడి పయనం ఎలా సాగింది? ఈ క్రమంలో మనోజ్‌కు ఎదురైన సవాళ్ల గురించే ఈ సినిమా.
OTTలోకి 12th Fail తెలుగు వెర్షన్ - జీవితంలో ఎదగాలంటే ఈ మూవీ డోంట్ మిస్!
'110 గంటల పాటు బ్రేక్ లేకుండా నటించాను' - 12th Fail హీరో సంచలన వ్యాఖ్యలు