ETV Bharat / education-and-career

స్టేజ్​ ఫియర్​ పోగొట్టుకోవాలనుకుంటున్నారా? ఈ టిప్స్​ పాటిస్తే సక్సెస్​ మీ వెంటే! - tips to overcome stage fright - TIPS TO OVERCOME STAGE FRIGHT

Stage Fright Overcome Tips: స్టేజ్​ ఫియర్​.. ఈ మాట వింటే చాలు స్టేజ్​ ఎక్కకముందే చాలా మందికి భయం మొదలవుతుంది. నలుగురిలో అనర్గళంగా మాట్లాడినా.. స్టేజ్​ మీద మాత్రం సీన్​ రివర్స్​ అవుతుంది. ఎన్నో టిప్స్​.. మరెన్నో సలహాలు పాటించినా ఈ భయాన్ని మాత్రం వదలలేరు. ఇటువంటి సమయంలో ఈ టిప్స్​ పాటించమని సలహా ఇస్తున్నారు నిపుణులు.

Tips to Overcome Stage Fear
Tips to Overcome Stage Fear (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 5:14 PM IST

Tips to Overcome Stage Fear: చాలా మంది ఫ్రెండ్స్ అండ్​ ఫ్యామిలీ మధ్యలో ఉన్నప్పుడు చాలా బాగా మాట్లాడుతారు. తమ స్కిల్స్​, వాక్చాతుర్యంతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. కానీ స్టేజ్ ఎక్కి నలుగురి ముందు మాట్లాడమంటే మాత్రం వాళ్ల సౌండ్​ బాక్స్​ మ్యూట్​ అవుతుంది. ఆ భయాన్ని ఎంత వదిలించుకుందామన్నా అది మాత్రం పోదు. కానీ ఏదో ఒక సమయంలో నలుగురి ముందుకు వెళ్లి మాట్లాడవసిన పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో చాలా మందికి స్టేజ్ ఎక్కేసరికి కాళ్లు, చేతులు షివర్​ అవుతాయి. ఒళ్లంతా చల్లబడిపోతుంది.. మాట్లాడాలనుకున్నప్పుడు తడబడతారు. మంచి నాలెడ్జి ఉంటుంది. కానీ స్టేజి ఫియర్ వలన దానిని వ్యక్తపరచలేరు. దీని వల్ల గొప్ప అవకాశాలను కూడా కోల్పేయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే పుట్టుకతోనే ఎవరూ కూడా గొప్ప ఉపన్యాసకులుగా పుట్టరు. వాళ్లని వాళ్లు గొప్ప వక్తలుగా మలుచుకుంటారు. మొదట్లో ప్రతి ఒక్కరికి ఆ భయం ఉంటుంది. ఆ భయాన్ని అధిగమించాలి. మరి అలా చేయాలంటే ఈ టిప్స్​ పాటించమని సలహా ఇస్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

How to Overcome Stage Fright:

  • స్టేజ్​ ఫియర్​ పొగొట్టుకోవాలంటే ముందుగా చేయాల్సిన పని మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం. టెన్షన్​ పడకుండా.. నేను ఎలాగైనా మాట్లాడతా.. అందరి ప్రశంసలు అందుకుంటా అంటూ మిమ్మల్ని మీరే మోటివేట్​ చేసుకోవాలి. పరిస్థితి ఏదైనా సరే స్టేజ్​ ఎక్కి మాట్లాడే విధంగా మిమ్మల్ని మీరు ప్రిపేర్​ చేసుకోవాలి. ఇలా ముందుగానే రెడీగా ఉండటం వల్ల సగానికి సగం భయం తగ్గిపోతుందని అంటున్నారు.
  • ఏ టాపిక్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నారో ఆ అంశం గురించి మీకు పూర్తిగా తెలిసుండాలి. చెప్పే విషయం మీద మీకు మంచి పట్టు ఉన్నప్పుడు భయం అనేది ఆటోమేటిక్​గా మీ నుంచి పోతుంది. ఒకవేళ మీరు మాట్లాడే విషయమై మిమ్మల్ని మధ్యలో ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పగలిగేలా ఉండాలి. అలా ఉండాలంటే చెప్పబోయే దాని గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలి.
  • మీకు టాపిక్ మీద ఎంత మంచి అవగాహన ఉన్నా.. ప్రాక్టీస్ కచ్చితంగా అవసరం. అందుకే అంటారు.. Practice Makes a Man Perfect. కాబట్టి స్టేజ్​ మీద మాట్లాడేముందు ఇంట్లో అద్దం ముందు నిలబడి మీరు ఇవ్వబోయే స్పీచ్​ని ప్రాక్టీస్ చేయండి. లేదా మీ మొబైల్​తో రికార్డు చేసి తరువాత చూసుకోండి. దీని వల్ల మనం చేసే తప్పులేంటో మనకు తెలుస్తాయి. కాబట్టి ఆ తప్పులను సరిదిద్దుకోవచ్చు.
  • స్టేజ్ మీద మాట్లాడుతున్నంత సేపు కూడా మీ ఫోకస్, మీ ఎయిమ్​ అంతా మీరు చెబుతున్న టాపిక్ మీదే ఉండాలి. మీ దృష్టి కొంచెం మళ్లిందా.. మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. స్పీచ్​ ఎక్కడ ఆపారో గుర్తుండదు. తర్వాత ఏం మాట్లాడాలో తెలియదు. కాబట్టి మీకు స్పీచ్ మధ్యలో ఎటువంటి డిస్ట్రబెన్స్​ కలగకుండా చూసుకోండి.

పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా? ఈ 10 టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ!

  • వేగంగా మాట్లాడినంత మాత్రాన గొప్ప వక్త అనిపించుకోము. ఫాస్ట్​గా మాట్లాడినప్పుడు కొన్ని పదాలు ఎదుటి వారికి అర్ధం కాకపోవచ్చు. దాని వల్ల ఉపయోగం శూన్యం. కంగారుగా మాట్లాడి తప్పులు చెయ్యడం కన్నా నెమ్మదిగా మాట్లాడం ఉత్తమం. కాబట్టి నెమ్మదిగా మధ్యమధ్యలో గ్యాప్ ఇస్తూ మాట్లాడండి. దీనివల్ల మీకు ఆలోచించుకోవడానికి, అలాగే తరువాత మాట్లాడబోయే అంశాన్ని గుర్తుతెచ్చుకోవడానికి కూడా టైం దొరుకుతుంది.
  • మీరు స్పీచ్ ఇవ్వాల్సిన రోజు సమయానికి కంటే ముందుగానే ఆ ప్రదేశానికి చేరుకోండి. అక్కడి వాతావరణాన్ని బాగా గమనించి దానికి అలవాటు పడండి. అలాకాకుండా ఆలస్యంగా బయలుదేరి కంగారుగా వెళ్తే ఆ టెన్షన్​లో మొత్తం మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సాధ్యమైనంత ముందుగానే చేరుకోవడానికి ట్రై చేయండి.
  • మీరు ఇవ్వబోయే స్పీచ్ ఇంట్రెస్ట్​గా ఉండేలా చూసుకోవాలి. మీ స్పీచ్ బోరింగ్​గా లేకుండా.. మధ్య మధ్యలో కాస్తా ఫన్నీ సీన్స్​ ఎక్స్​ప్లైన్​ చేయాలి. దీని వల్ల ఆడియన్స్ నవ్వుతూ ఉంటే మీకు కూడా టెన్షన్ పోయి ఇంకా సరదాగా స్పీచ్ ఇవ్వగలరు.
  • మనం మాట్లాడుతున్నప్పుడు మన మాట ఎంత ముఖ్యమో మన బాడీ లాంగ్వేజ్ కూడా అంతే ముఖ్యం. వంగిపోయి, నీరసంగా కాకుండా ధైర్యంగా నిలబడండి. చేతులు కట్టుకుని ఉండడం, గోక్కోవడం, బిగుసుకుపోవడం చెయ్యకుండా రిలాక్స్​గా ఉంటూ ... చేతులు ఊపుతూ, ముఖం మీద చిన్న చిరునవ్వుతో మాట్లాడండి. దీని వల్ల ముందు ఉన్న ఆడియన్స్​కి మీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. చూశారుగా పైన చెప్పిన సలహాలను పాటిస్తూ... ప్రాక్టీస్ చెస్తే నలుగురిలో మాట్లాడటం వెన్నతో పెట్టిన విద్య అవుతుంది.

ఇంటర్వ్యూకు సిద్ధం అవుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.