UPSC Jobs 2024 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు
UPSC Vacancy 2024 : 122 పోస్టులు
ఈ పోస్టులు
1. అసిస్టెంట్ డైరెక్టర్- 51
2. సైంటిస్ట్-బీ
- ఫిజికల్-సివిల్- 01
- జూలాజికల్ సర్వే- 09
- ఎన్వీరాన్‌మెంటల్ సైన్స్- 02
- ఇంజీనీర్ అండ్ షిప్ సర్వేయర్- 01
3. స్పెషలిస్ట్ (గ్రేడ్-III)
- యూరాలజీ- 02
- న్యూరో-సర్జరీ- 06
- ఆప్తాల్మాలజీ- 17
- ఆర్థోపెడిక్స్- 19
- ఈన్‌టీ- 09
- ట్యూబర్కులోసిస్, రెస్పిరేటరీ మెడిసిన్ పల్మనరీ- 02
4. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (గ్రేడ్-I)- 02
విద్యార్హతలు
UPSC Jobs 2024 Education Qualification : పోస్టుల ఆధారంగా విద్యార్హతలను నిర్దేశించారు. సంబంధిత సబ్జెక్ట్‌లో పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏయే పోస్టులకు ఏ విద్యార్హత అవసరమో తెలుసుకునేందుకు యూపీఎస్సీ అఫీషియల్ నోటిఫికేషన్ కాపీని చూడవచ్చు.
దరఖాస్తు రుసుము
UPSC Jobs 2024 Application Fees : ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు. ఇతరులు రూ.25ను అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించారు.
ముఖ్యమైన తేదీలు
UPSC Jobs 2024 Important Dates :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 2024 ఫిబ్రవరి 10
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఫిబ్రవరి 29
- ఆన్లైన్లో దరఖాస్తు ప్రింట్అవుట్కు గడువు- 2024 మార్చి 1
వయోపరిమితి
UPSC Jobs 2024 Age Limit And Relaxation : ఆయా పోస్టులను అనుసరించి కేటగిరీల వారిగా వయోపరిమితులను నిర్ణయించారు. గరిష్ఠంగా 35 నుంచి 50 ఏళ్లు (2024 ఫిబ్రవరి 29 నాటికి) ఉన్నవారు సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చూడవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
అధికారిక వెబ్సైట్
UPSC Official Website : నోటిఫికేషన్‌కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://upsc.gov.in/ లేదా upsconline.nic.inను చూడవచ్చు.
అప్లై చేసుకోండిలా
- ముందు UPSC అఫీషియల్ వెబ్సైట్ upsconline.nic.inలోకి లాగిన్ అవ్వండి.
- హోంపేజ్పై కనిపించే 'ONLINE RECRUITMENT APPLICATION (ORA) FOR VARIOUS RECRUITMENT POSTS' లింక్‌పై క్లిక్ చేయండి.
- అడిగిన వివరాలను సమర్పించి రిజిస్టర్ అవ్వండి.
- రిజిస్ట్రేషన్ వివరాలతో అప్లికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయండి.
- ఆన్లైన్ ద్వారా దరఖాస్తు రుసుమును చెల్లించి దరఖాస్తు ఫారాన్ని సబ్మిట్ చేయండి.
- ముందుజాగ్రత్తగా అప్లికేషన్ ఫారాన్ని ప్రింట్అవుట్ను తీసి పెట్టుకోండి.
ఇస్రోలో 224 టెక్నీషియన్ & టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!
నాన్-ఇంజినీరింగ్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? ఈ టాప్-10 కెరీర్ ఆప్షన్స్‌పై ఓ లుక్కేయండి!