ETV Bharat / education-and-career

అసిస్టెంట్ ప్రొఫెసర్​ కావాలా? యూజీసీ-నెట్​ 2024కు అప్లై చేసుకోండిలా! - UGC NET 2024 - UGC NET 2024

UGC NET 2024 : మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎలిజిబిలిటీ సంపాదించాలా? లేదా పీహెచ్​డీ చేద్దామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. యూజీసీ-నెట్ పరీక్షకు నోటిఫికేషన్​ విడుదలైంది. జూన్​ 16న ఈ పరీక్ష జరగనుంది. పూర్తి వివరాలు మీ కోసం.

UGC NET 2024 Age limt
UGC NET 2024 Eligibility
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 10:17 AM IST

UGC NET 2024 : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ- నెట్‌) పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్​డీ చేసేందుకు ఇది ఎంతో కీలకం. యూజీసీ-నెట్​లో అత్యధిక మార్కులతో పాస్ అయిన వారికి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్​ కూడా లభిస్తుంది.

83 సబ్జెక్టులు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మొత్తం 83 సబ్జెక్టులకు ఈ నెట్​ ఎగ్జామ్స్​ నిర్వహిస్తారు. వాస్తవానికి ఏటా 2 సార్లు ఈ పరీక్ష నిర్వహిస్తుంటారు. ఈసారి యూజీసీ-నెట్ పరీక్షను జూన్​ 16న నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్​ తెలిపింది.

సబ్జెక్ట్స్​ : ఆంథ్రోపాలజీ, అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, అరబ్ కల్చర్ అండ్‌ ఇస్లామిక్ స్టడీస్, అస్సామీ, అరబిక్, ఆర్కియాలజీ, బోడో, బెంగాలీ, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్‌, కంప్యూటర్ సైన్స్ అండ్‌, క్రిమినాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్‌, ఇంగ్లీష్‌, హిస్టరీ, హోం సైన్స్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఇండియన్‌ కల్చర్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, లింగ్విస్టిక్స్‌, మ్యూజిక్‌, సైకాలజీ, లా మొదలైన 83 సబ్జెక్టులు ఉంటాయి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

విద్యార్హతలు
UGC NET Eligibility : అభ్యర్థులు 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి
UGC NET Age Limit :

  • జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్​ (జేఆర్​ఎఫ్​) పొందాలంటే, అభ్యర్థుల వయస్సు 2024 జూన్​ 1 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి.
  • అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ఎలిజిబిలిటీకి ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.

పరీక్ష విధానం
UGC NET Exam Pattern : అభ్యర్థులకు ఓఎమ్మార్‌ షీట్ ఇస్తారు. దీనిలో మీరు ఆన్సర్స్​ బబుల్ చేయాల్సి ఉంటుంది. యూజీసీ నెట్​ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలోనూ ఆబ్జెక్టివ్ అండ్​ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలు ఇస్తారు. వీటికి 100 మార్కులు ఉంటాయి. పేపర్‌-2లో 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు.

దరఖాస్తు రుసుము
UGC NET Fee : జనరల్/ అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.1150 చెల్లించాలి; ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ- ఎన్‌సీఎల్‌ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్లు రూ.325 దరఖాస్తు రుసుముగా చెల్లిస్తే సరిపోతుంది.

ఏపీలో పరీక్ష కేంద్రాలు : అమరావతి, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

తెలంగాణాలో పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, సికింద్రాబాద్, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.

ముఖ్యమైన తేదీలు
UGC NET Exam Date :

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 ఏప్రిల్ 20
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 మే 10
  • అప్లికేషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 2024 మే 12
  • దరఖాస్తు సవరణ తేదీలు : 2024 మే 13 నుంచి 15 వరకు
  • పరీక్ష తేదీ: 2024 జూన్​ 16

AI ఎంత డెవలప్ అయినా ఈ స్కిల్ ఉంటే చాలు - జాబ్ గ్యారెంటీ! - Best Job Skills

కృత్రిమ మేధ (AI) ఎంత డెవలప్ అయినా - ఈ జాబ్స్​ మాత్రం సేఫ్​! - Jobs That Are Safe From AI

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.