Telangana Intermediate Exams 2024 : ఇంటర్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు(Inter Board) తీపి కబురు చెప్పింది. పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించాలని నిర్ణయించింది. దీంతో నిమిషం నిబంధనను ఎత్తేసినట్లు ఇంటర్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. ఉదయం 9 గంటల లోపు కేంద్రానికి చేరుకోవాలని గతంలోనే ఇంటర్ బోర్డు ఆదేశించింది. తాజా నిర్ణయంతో ఉదయం 9 గంటల తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
ఇంటర్ పరీక్షలు : రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలకు(Inter Exams 2024) అధికారులు నిమిషం నిబంధనను కఠినంగా అమలు చేశారు. మొదటిరోజే సుమారు 12 మంది విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. ఆదిలాబాద్లో జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి పరీక్షకు హాజరవడం వల్ల లోపలికి అనుమతించలేదని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వీటిని ఆసరాగా చేసుకొని విద్యార్థులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటారేమోనన్న ఉద్దేశ్యంతో ఇంటర్ బోర్డు నిమిషం నిబంధన నియమావళిని సవరించింది.
EAMCET Exam Preparation Tips : ఇలా ప్రిపేర్ అయితే.. ఎంసెట్లో మంచి ర్యాంకు పక్కా
TS Inter Exams 2024 : అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి ప్రశాంతంగా సాగుతున్నాయి. ఇలాగే మార్చి 19 వరకు మొదటి, రెండో ఏడాది పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 9,80,978 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఈ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వేగంగా చేరుకునేందుకు వీలుగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
నిమిషం నిబంధన రేపటి నుంచి ఎత్తివేస్తున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపిన నేపథ్యంలో ఐదు నిమిషాలు ఆలస్యమైనా కూడా విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లవచ్చు. కానీ ఐదు నిమిషాలు దాటిన తర్వాత మరి అనుమతి లేదు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్(Section 144)ను పకడ్బందీగా అధికారులు ఏర్పాటు చేశారు. విద్యార్థులు మాస్కాఫీయింగ్, ఎలక్ట్రానిక్స్ డివైజ్లు వంటివి తీసుకువచ్చిన కఠిన చర్యలు ఉంటాయని అధికారులు విద్యార్థులకు హెచ్చరించారు.
ఇంటర్ పరీక్షలు ప్రారంభం - నిమిషం ఆలస్యమైన విద్యార్థులకు 'నో ఎంట్రీ'